కుప్పి సోపు నూనె
కుప్పు సోపు నూనె లేదా కుప్పు సోంపు నూనె ఒక ఆవశ్యక నూనె. ఇది ఒక సుగంధ తైలం. కుప్పు సోంపును హిందీలో వలైటి సౌంఫ్ అంటారు. కుప్పు సోపు చూటటానికి సోపు/పెద్ద జీలకర్రను పోలి వుండును. కుప్పిసోంపును ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు. కుప్పు సోంపు మొక్క అంబేల్లిఫెర కుటుంబానికి చెందిన మొక్క. కుప్పి సోంపు మొక్కలలో పలు రకాలు ఉన్నాయి. ఆవశ్యక నూనెను పింపినెళ్ల అనిసుం ముక్క నుండి ఉత్పత్తి చేస్తారు. ( పింపినెళ్ల అఫిసినల్, పింపినెళ్ల వుల్గరే అనేవి ఇతర రకాలు).కుప్పి సోపుని అనిసే (anise) లేదా ఆనిసీడ్ (aniseed) అనికూడా అంటారు.అనిసే గింజలను స్టార్ అనిసే మరోరకం మొక్కగా అప్పుడప్పుడు పొరపాటు పడుతుంటారు.స్టార్ అనిసే మొక్క లిల్లీసియేసి కుటుంబానికి ఛేండినది.దాని వృక్ష శాస్త్ర పేరు లిల్లీసీయం వేరుమ్. అనిసే నూనెను తరచుగా ఆరోమాథెరపీలో వాడుతారు.[1]
కుప్పి సోపు మొక్క
[మార్చు]అనిసీడ్ మధ్య తూర్పు ప్రాంతానికి చెందినది. వర్తమాన కాలంలో (2018 నాటికి) ఐరోపా, అమెరికా, ఉత్తర ఆఫ్రికాలలో సాగు చేస్తున్నారు.ఇది ఏక వార్షికమొక్క 80 సెం.మీ ఎత్తు (రెండు అడుగులన్నర) ఎత్తు పెరుగును.సున్నితమైన తేలిక ఆకులను కల్గి వుండును. చిన్నని తెల్లని పూలు పూయును.విత్తనాలు గ్రెయిష్ బ్రౌన్ రంగులో వుండును.పురాతన కాలం నుండి రోమనులు, ఈజిప్తులు,, గ్రీకులు ఈ నూనెను ఉపయోగించారు.రోమనులు ముస్తాసియస్ (mustaceus) అనే కేకులో వాడగా, ఈజిప్టులు బ్రేడ్డు (దిబ్బరోట్టె) లో కలిపి వాడేవారు.ఇక గ్రీకులు జీర్ణ వ్యవస్థలోని ఇబ్బందులు తగ్గించుటకు వాడారు.[1] కుప్పి సోపు గింజలోని పదార్థాలు
వరుస సంఖ్య | పదార్థం | శాతం |
1 | తేమ | 9-13 |
2 | మాంసకృత్తులు | 18% |
3 | కొవ్వు ఆమ్లాలు | 8-23 |
4 | ఆవశ్యక నూనెలు | 2-7 |
5 | స్టార్చ్ | 5 |
6 | ముడి పీచు పదార్థం | 12-25 |
ఈ పంటను బల్గేరియా, సిప్రస్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, మెక్సికో, దక్షిణ అమెరికా, సిరియా, టర్కీ, స్పైన్, ఇంగ్లాండు, రష్యా, ఇండియా దేశాలలో సాగు చేస్తున్నారు.. ఇండియాలో నూనె ఉత్త్పత్తికి కాకుండా కేవలం వంటల్లోవాడటానికి కుప్పి సోపునుసాగు చేస్తున్నారు.[2]
భారతీయ భాషల్లో కుప్పి సోపు పేరు
[మార్చు]భారతీయ భాషల్లో కుప్పి సోపు పేర్లు ఇలావున్నాయి[3]
- హింది=Valaiti saunf or aawonf
- బెంగాలి=Muhuri, Mitha jira
- గుజరాతి=Anisi, Sowa
- కన్నడ=sompu
- మలయాళం=Shombu
- మరాటీ=Somp, Badishop
- ఒరియా=Sop
- పంజాబీ=Valaiti sounf
- సంస్క్ర్తంతం=Shatapusapa
- తమిళం=Shombu
నూనె సంగ్రహణ
[మార్చు]నూనెను విత్తనాల నుండి నీటి ఆవిరి స్వేదన క్రియ/స్టీము డిస్టిలేసను పద్ధతి ద్వారా సంగ్రహిస్తారు.
నీటి ఆవిరి స్వేదన క్రియ/స్టీము డిస్టిలేసను పద్ధతి ప్రధాన వ్యాసం ఆవశ్యక నూనెల ఉత్పత్తి- నీటి ఆవిరి ద్వారా స్వేదనక్రియ చదవండి
నూనె
[మార్చు]కుప్పి సోపు నూనె కొద్ధిగా మధ్యస్తాయి చిక్కదనం (స్నిగ్థత) కల్గి వుండును. తక్కువ ఉష్ణోగ్రత వద్ద గట్టి పడును (ఘన స్థితిచెందును).[1]
నూనెలోని రసాయన సంయోగపదార్థాలు
[మార్చు]నూనెలోని పలు వృక్షరసాయనాలు వున్నవి వాటిలో ముఖ్యమైనవి ఆల్ఫా-పైనేన్, కాంపెన్, బీటా పైనేన్, లినలూల్, సీస్-అనేథోల్, ట్రాన్స్- అనేథోల్, సఫ్రోల్, అనిస్ అల్డిహైడ్, ఆసిటో అనిసోల్లు.
వరుస సంఖ్య | రసాయన సమ్మేళనం | శాతం |
1 | ట్రాన్స్-అనథోల్ | 93-96 |
2 | y-హిమాచలెన్ | 1.9-3.1 |
3 | మిథైల్ కావికోల్ | 0.19-0.79 |
4 | ట్రాన్స్-సూడో ఇసో యూజెనైల్ -2 మిథైల్ బూటరేట్ |
0.66-0.99 |
5 | ట్రాన్స్ మూరోలా -4 (14),5- డైన్ | 0.07-0.46 |
6 | ఆల్ఫా జింజీబెరేన్ | 0.16-0.36 |
7 | ఆల్ఫా హిమాచలెన్ | 0.12-0.31 |
8 | బీటా హిమాచలెన్ | 0.11-0.19 |
9 | సీస్-డై హైడ్రో కార్వోన్ | 0.01-0.28 |
10 | బీటా బిసబోలెన్ | 0.00-0.19 |
11 | సీస్ అనెతోల్ | 0.04-0.08 |
భౌతిక గుణాలు
[మార్చు]కుప్పి సోపు నూనె భౌతిక గుణాల పట్టిక[4]
వరుస సంఖ్య | భౌతిక గుణం | విలువల మితి |
1 | ద్రవీభవన ఉష్ణోగ్రత | 63 °F |
2 | ఫ్లాష్ పాయింట్ | 199 °F |
3 | విశిష్ట గురుత్వం | 0.978-0.988, 77 °Fవద్ద |
4 | ద్రావణీయత | నీటిలో కరుగదు |
5 | వక్రీభవన సూచిక | 1.552[5] |
ఉపయోగాలు
[మార్చు]- నూనెను కండరాల నొప్పులకు, బాధలకు ఉపయోగిస్తారు.అలాగే కీళ్ల వాత నొప్పులకు, శ్వాసకోశ జబ్బులకు, కోరింత దగ్గు, ప్రేగులకు సంబంధించిన రోగాలను, అజీర్తిని, అరుచిని తగ్గించును[1]
- సుగంధ తైలంగా ఉపయోగిస్తారు.ఇతర సుగంధ నూనెలతో మిశ్రమం చేసి ఉపయోగిస్తారు.
- యాంటి బాక్టీరియా, యాంటి ఫంగల్, యాంటి ఆక్సిడెంట్, ౘుఱుకు పుట్టించెడు (ఔషధ) గుణం, జీర్ణకారి, వాయు హరి గుణాలు కల్గి ఉంది.
- కండరాలను సదలింపు చేయు గుణం, క్రిమి సంహరక గుణం, గ్లూకోజ్ శోషణగుణం కల్గి ఉంది.[6]
- మూర్చరోగాన్ని హైపరు టెన్సను తగ్గించును.
వాడకంలో ముందు జాగ్రత్తలు
[మార్చు]గాఢత నూనె సున్నిత చర్మ మున్న కొందరికి చర్మం పై చెడు ప్రభావం చూపవచ్చును. అందువలన అటు వంటి వారు వాడరాదు.అలాగే ఎక్కువ మోతాదులో తీసుకున్న సర్కులేసన్ తగ్గిపోయి cerebral congestion (మెదడులో రక్తం ఒకచోటాధికంగా చేరడం) ఏర్పడవచ్చు.గర్భంతో వున్నప్పుడు స్ర్తీలు వాడరాదు.[1]
బయటి వీడియో లింకులు
[మార్చు]ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Aniseed essential oil information". essentialoils.co.za. Archived from the original on 2018-02-27. Retrieved 2018-09-18.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "ANISEED". indianspices.com. Archived from the original on 2018-08-16. Retrieved 2018-09-18.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "ANISEED". indianspices.com. Archived from the original on 2018-08-16. Retrieved 2018-09-19.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "ANISE OIL". cameochemicals.noaa.gov. Archived from the original on 2017-05-08. Retrieved 2018-09-19.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Anise oil". chemicalbook.com/. Archived from the original on 2017-12-19. Retrieved 2018-09-01.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Anise (Pimpinella anisum)". sigmaaldrich.com. Archived from the original on 2017-09-23. Retrieved 2018-09-19.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)