Jump to content

టీ ట్రీ నూనె

వికీపీడియా నుండి
మెలల్యుక ఆల్టరిని ఫోలియా.
కొరకి సౌత్ వేల్స్ టీ ట్రీ తోటలు

టీ ట్రీ నూనె ఒక ఆవశ్యక నూనె, సుగంధ తైలం.అంతేకాదు ఓషధిగుణాలున్న నూనె.ఈ నూనెను టీట్రీ యొక్క ఆకులనుండి ఉత్పత్తి చేస్తారు.టీట్రీ నూనె అనగా మనం మామూలుగా తాగే తేనీరు (tea) చెట్టు యొక్క ఆకుల నుండి కాదు. ఆవశ్యక నూనె తీసే టీ ట్రీని ti-treeఅని, ti-trol అని మెలసోల్ (melasol) అని అంటారు.టీ ట్రీ మిర్టసియా (Myrtaceae) కుటుంబానికి చెందిన చెట్టు.టీ ట్రీ మొక్క వృక్షశాస్త్ర పేరు మెలల్యుక ఆల్టరిని ఫోలియా (Melaleuca alternifolia).దీనికున్న ఔషధ, రుగ్మత నివారణ కారణాలవలన ఎక్కువ మందికి ప్రీతి పాత్రమైన నూనె టీ ట్రీ ఆవశ్యక నూనె.టీ ట్రీ నూనెను సబ్బుల్లో, క్రీముల్లో, లోషన్లలో, ఎయిర్ ప్రెసనర్‌లలో, డియోరంట్లలో క్రీమి వికర్షణ మందులో ఉపయోగిస్తారు.

ట్రీ ట్రీ

[మార్చు]

టీ ట్రీ ఆస్ట్రేలియాలోని దక్షిణ వేల్స్ (సౌత్ వేల్స్) ప్రాంతానికి చెందిన చెట్టు.టీ ట్రీ చూడటానికి సైప్రెస్ చెట్టును పోలి వుండును.సూదులవంటి అంచులున్న ఆకులులను కల్గి వుండును.పసుపు లేదా పర్పుల్ రంగు పూలు పూయును. చెట్టు దాదాపు 7 మీటర్ల (20 ఆడుగులు) ఎత్తు పెరుగును.చిత్తడిగా వుండే ప్రదేశాలలో బాగా పెరుగుతుంది.ప్రస్తుతం నూనెకై టీ ట్రీని తోటలలో/సేద్య వనాలుగా పెంచుతున్నారు. చెట్టును నరకినను చెట్టు మొదలు/బోదే మళ్ళీ చిగిర్చి రెండేళ్ళల్లో మళ్ళీ పూతకు వచ్చును .టీ ట్రీ నూనెను ఆస్ట్రేలియాలో నే ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు.[1] టీ ట్రీ అనే పేరు 18 వశతాబ్దిలో నావికులచే పెట్టబడింది.ఆస్ట్రేలియా దక్షిణ తీర ప్రాంతంలోని జాజికాయ వాసన వున్న ఆకులనుండి టీ తయారు చేసి, ఆచెట్టుకు టీ ట్రీ అనీ పేరు పెట్టారు.[2] ఈ చెట్టు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ ఈశాన్య తీర ప్రాంతం,, ఆగ్నేయ క్వీన్స్ లాండ్ లో ఈ చెట్లు ఎక్కువ వ్యాపించి ఉన్నాయి.ప్రస్తుతం (2018 నాటికి) న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లోని మిర్టేసియా కుటుంబానికి చెందిన పలుచెట్లను టీ ట్రీ చెట్లు అని వ్యవరిస్తున్నారు.1970-80 మధ్య వాణీజ్యపరంగా న్యూ వేల్సులో తోటల పెంపకం పెరిగింది.అదేసమయంలో కేవలం మెలలేక ఆల్టేర్నిఫోలియా, నుండే కాకుండా తునిసియా, ఈజిప్టు లోMelaleuca armillaris, Melaleuca styphelioides చెట్ల ఆకులనుండి, Melaleuca leucadendra చెట్ల ఆకులనుండిఈజిప్టు, మలేసియా,, వియత్నాం, Melaleuca acuminata నుండి తునిసియా, Melaleuca ericifolia నుండిఈజిప్ఱు, Melaleuca quinquenervia నుండి అమెరికాలో నూనెను ఉత్పత్తి చెయ్యడమ్ మొదలైనది.

నూనె సంగ్రహణ

[మార్చు]

టీ ట్రీ నూనెను చెట్టు యొక్క ఆకులు, సన్నని రెమ్మలనుండి నీటీ ఆవిరి స్వేదన క్రియ/స్టీము డిస్టీలేసను పద్ధతిలో సంగ్రహిస్తారు. ఆకులనుండి నూనె దిగుబడి 1.8% వరకు వుండును.[1] వాణిజ్య పరంగా టీట్రీ నూనె ఉత్పత్తి 1920 లో ఆస్ట్రేలియన్ ఆర్థర్ పెన్ఫోల్డ్ ప్రారంభించాడు.రానున్న కాలంలో టీట్రీ నూనేకు డిమాండ్ పెరుగునని అప్పుడే ఊహించాడు

నూనె

[మార్చు]

టీ ట్రీ నూనె వలన ఔషధ పరమైన అనేక ప్రయోజనాలు ఉపయోగాలు ఉన్నాయి.రెండవ ప్రపంచ యుద్ద సమయంలో ట్రీ ట్రీ తోటల ఉత్పత్తి దారులను, చెట్లను నరికే వారిని, కావలసిన పరిమాణంలో ట్రీ ట్రీ నూనె ఉత్పత్తి అయ్యే వరకు వారిని మిలిటరీ సేవల నుండి మినహాయింపు ఇచ్చారు.కారణం యుద్ధంలో సైనికులకుఇచ్చుకిట్ (kit) లో టీ ట్రీ నూనె కూడా వుండేది.కారణం ఈ నూనె గాయాలుయ వలన అంటు వ్యాధులు సంక్రమించకుండా నిరోధించు గుణం వుండటం చేత. టీట్రీ నూనె గాటైన వాసన కల్గి వుండి, లేత పసుపు రంగులో వుండును.నీటివంటి స్నిగ్థత కల్గి ఉంది.[1].కర్పూరం వంటి గాటైన వాసన వున్న నూనె.ఇంటర్నేసల్ స్టాండర్డ్ ISO 4730 ప్రమాణం ప్రకారం టీ ట్రీ మొత్తం ఆయిల్ లో టెర్పినోల్-4-ఒల్, γ-టెర్పినెన్, α- టెర్పినెన్ లు 70-90%వరకు, ρ-సైమెన్, టెర్పినోలెన్, α- టెర్పినియోల్,, ఆల్ఫా పైనేలు కలిపి 15% వరకు వుండి తాజా కర్పూర వాసనతో వుండాలి.

నూనెలోని రసాయన సమ్మేళనాలు

[మార్చు]

నూనెలో 20 కిపైన వృక్ష రసాయనాలు వున్నవి వాటిలో ముఖ్యమైనవి ఆల్ఫా-పైనేన్, బీటా పైనేన్, సబినెన్, మైర్సేన్, ఆల్ఫా –పిల్లాన్డ్రేన్, ఆల్ఫా –టెర్పినేన్, లిమోనెన్,1, సినేయోల్, y-టెర్పినేన్, p-సైమెన్, టెర్పినోలెన్, లినలూల్, టెర్పినేన్-4-ఒల్,, ఆల్ఫా-టెర్పీనియోల్ లు.[1]

నూనె యొక్క వైద్యపరమైన చికిత్సపరమైన గుణాలు

[మార్చు]
  • టీ ట్రీ నూనె దేహ పరిరక్షిత వ్యవస్థ (immune system) వృద్ధికారిగా పరిచేసి పరిరక్షిత వ్యవస్థను సంరక్షించును.అంటు రోగాలను సమర్ధవంతంగా ఎదుర్కోనేలా దేహ రక్షిత వ్యవస్థను పటిస్త పరుస్తుంది.మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తుంది.బాక్టీరియా, ఫంగసు, వరసులను సమర్థవంతంగా నిలువరిస్తుంది.[1]
  • చర్మ సంబంధమైన నొప్పులను నివారించును, అలాగే పేలను, స్కాబిస్ ను, కాళ్ళవేళ్ళ సందు ఫంగస్ వ్యాధిని తగ్గించును.పురుగుల కాటుకు మందుగా పనిచేయును.[2]
  • అలాగే తెగిన గాయాలకు యాంటీ సెప్టిక్ గా పనిచేయును. అలాగే కురుపులు, కాలిన దెబ్బలకు కూడా పని చేయును.అలాగే యోని సంబంధమైన జబ్బులను నివారించును.గొంతు, నోటి నొప్పులకుదగ్గును శ్వాస కోశ వ్యాధులకు పని చేయును.[2][3]
  • టీ ట్రీ ఆయిల్ జుట్టుకు కూడా మేలు చేస్తుంది. చుండ్రు, దురద వంటి జుట్టు సమస్యలను ఇది తగ్గిస్తుంది .
  • టీ ట్రీ ఆయిల్ మొటిమల మచ్చలకు సమర్థవంతమైన సహజ నివారణగా పరిగణించబడుతుంది. ఇది రంధ్రాలను అన్‌లాగ్ చేయడానికి, మంటను తగ్గించడానికి సహాయపడుతుంది, ఇది కొత్త మోటిమలు ఏర్పడకుండా, ఇప్పటికే ఉన్న మచ్చలను తీవ్రతరం చేయకుండా నిరోధించవచ్చు. అదనంగా, టీ ట్రీ ఆయిల్ కొత్త చర్మ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, ఇది మొటిమల మచ్చలను పోగొట్టడానికి, చర్మ ఆకృతిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

మొటిమల మచ్చల కోసం టీ ట్రీ ఆయిల్ ఎలా ఉపయోగించాలి?

[మార్చు]

జొజోబా ఆయిల్ లేదా కొబ్బరి నూనె వంటి క్యారియర్ ఆయిల్‌తో టీ ట్రీ ఆయిల్‌ను 1:10 నిష్పత్తిలో కరిగించండి (ప్రతి 10 చుక్కల క్యారియర్ ఆయిల్‌కు ఒక చుక్క టీ ట్రీ ఆయిల్). మీ ముఖాన్ని సున్నితమైన క్లెన్సర్‌తో శుభ్రం చేసి, శుభ్రమైన టవల్‌తో ఆరబెట్టండి. పలచబరిచిన టీ ట్రీ ఆయిల్‌ను కాటన్ శుభ్రముపరచుతో ప్రభావిత ప్రాంతానికి రాయండి. వృత్తాకార కదలికలను ఉపయోగించి మీ చర్మంపై నూనెను సున్నితంగా మసాజ్ చేయండి. ఎక్కువ ఒత్తిడి రాకుండా జాగ్రత్త వహించండి, లేకుంటే ఇది చర్మాన్ని చికాకుపెడుతుంది. టీ ట్రీ ఆయిల్‌ను మీ చర్మంపై కనీసం 30 నిమిషాలు లేదా రాత్రిపూట ఉంచండి. గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడిగి, శుభ్రమైన టవల్‌తో ఆరబెట్టండి. మీ మొటిమల మచ్చల తీవ్రతను బట్టి మీరు ఈ ప్రక్రియను రోజుకు ఒకటి లేదా రెండుసార్లు పునరావృతం చేయవచ్చు.[4]

నూనె ధుష్ప్రభావం

[మార్చు]
  • ట్రీ టీ నూనె సురక్షితమైన, విష ప్రభావం లేని నాన్-ఇరిటెంట్ నూనె అయినను కొందరికి అలెర్జీ కల్గించవచ్చు. కళ్ళకు, చెవులకు, ముక్కుకు మరీ దగ్గరగా వాడరాదు. అలాగే లోతైన పెద్ద దెబ్బలకు వాడరాదు.ఇది చాలా గాఢత వున్న నూనె కనుక వాడునపుడు తగు జాగ్రత్తగా వుండాలి.[1]
  • చిన్న ఆపిల్లల తలలోని పేలనివారణకుసిఫారసు చెయ్యబడలేదు.దీనివలన వారికి స్కీన్ ఇరిటేసన్, లేదా అలెర్జీ కలిగించవచ్చు. కడుపులోకి తీసుకున్న విష ప్రభావం కల్గించ్చును.దానివలన మత్తుగా వుందటం, వాంతులు రావడం, తల తిరగడం, కోమా లోకి వెళ్ళడం, నిలకడ లేక పోవడం, అయోమయానికి లోనవడం, బలహీనంగా వుండటం, నీళ్ళ విరేచనాలు, కడుపులో అస్తవ్యస్త, అలాగే చర్మం పై దద్దుర్లు/rashes ఏర్పడవచ్చును.
  • 2006 నాటి పునర్విచారన తరువాత గాఢత నూనె కాకుండా విలీన నూనెను ఉపయోగించిన ఎటువంటి వ్యతిరేక/దుష్ప్రభావాలు ఉండవని తేల్చారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Tea Tree essential oil information". essentialoils.co.za. Archived from the original on 2018-02-27. Retrieved 2018-09-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. 2.0 2.1 2.2 "TEA TREE OIL". www.webmd.com. Archived from the original on 2018-09-05. Retrieved 2018-09-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. Pazyar, N; Yaghoobi, R; Bagherani, N; Kazerouni, A (July 2013). "A review of applications of tea tree oil in dermatology". International Journal of Dermatology. 52 (7): 784–90. doi:10.1111/j.1365-4632.2012.05654.x. PMID 22998411.
  4. https://www.formen.health/blogs/skin/how-to-use-tea-tree-oil-for-acne-scars