పుచ్చగింజల నూనె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆడ, మగ పూలు
మగపుష్పము
ఆడ పుష్పము
పండు
గింజలు

పుచ్చ మొక్క కుకుర్బిటేసి కుటుంబానికి చెందిన మొక్క. ఈమొక్క వృక్షశాస్త్రనామం:సిట్రుల్లస్ వల్గారిస్ (citrullus vulgaris). పుచ్చగింజలలో పోషక విలువలున్న పదార్ధాలున్నాయి. పుచ్చ గింజలో 27% వరకు నూనె ఉంది.దోస, గుమ్మడి కాయ మొక్కలు కూడా ఈ వృక్ష కుటుంబానికి చెందిన మొక్కలే [1].ఈ మొక్క బలహీనమైన ప్రధానకాండం కల్గి వుండటంవలన మొక్క నిటారుగా పెరగ లేదు.ఇది ఒకరకమైన నేలమీద ప్రాకెడు మొక్క. నేలమీద 5-6 అడుగుల వ్యాసంలో విస్తరిస్తుంది.ఈ మొక్కయొక్క ఆది జన్మస్థానంఆఫ్రిక అని ఆధారాలు కన్పిస్తున్నాయి.ఇజిప్టు, భారతదేశాలలో క్రీ.పూ.2500 సంవత్సరాల క్రితమే ఈ పంటను సాగుచేసే వారని తెలుస్తున్నది.[2]

ఇతరభాషలలో పిలువబడు పుచ్చపేర్లు[3][మార్చు]

నూనె లక్షణాలు[మార్చు]

నూనె తెలికపాటి రంగును కల్గివుండును .రెండు ద్విబంధాలున్న లినోలిక్ ఆమ్లం ఈనూనెలో 60% మించివున్నది.ఈనూనెలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలశాతం 80% వరకున్నది.అందులో ఏకద్విబంధమున్న ఒలిక్ ఆమ్లం 12-15% వరకు, రెండు ద్విబంధాలున్న లినొలిక్ ఆమ్లం/ఒమేగా-6 కొవ్వు ఆమ్లం 60-65% వరకుండును. పామిటిక్, స్టియరిక్ సంతృప్త కొవ్వు ఆమ్లాలు 20% వరకున్నవి.నూనెలో 1.5% వరకు సపోనికేసను చెందనటువంటి పదార్థాలుండి, రంగు 20-25 యూనిట్ల వరకుండును. సపోనిఫికెసను సంఖ్య 190 నుండి198 మధ్య, అయాడిన్ విలువ 115-120వరకుండును.[4]

పుచ్చగింజల నూనెలోని కొవ్వు ఆమ్లంలశాతం

కొవ్వు ఆమ్లాలు శాతం
పామిటిక్‌ ఆమ్లం (C16:0) 11
స్టియరిక్ ఆమ్లం (C18:0) 10
ఒలిక్ ఆమ్లం (C18:1) 15
లినొలిక్ ఆమ్లం (C18:2) 63.0

పుచ్చగింజల నూనె భౌతికలక్షణాల పట్టిక[5]

భౌతిక లక్షణాలు మితి
వక్రీభవన సూచిక 400Cవద్ద 1.4630-1.4670
అయోడిన్ విలువ 115-125
సపనిఫికెసను విలువ 190-198
అన్‌సఫొనిపియబుల్ పదార్థం 1.5% గరిష్ఠం
తేమశాతం 0.5% గరిష్ఠం
రంగు 1/2"సెల్, (y+5R) 20

నూనెయొక్క ఉపయోగాలు[మార్చు]

  • రిపైండ్ చేసిన పుచ్చగింజల నూనెను వనస్పతి తయారిలో ఇతరనూనెలతో కలిపి వాడెదరు.
  • చర్మం పైపూత లేపనాలు (skin ointments) తయారు చేయుదురు. ముఖ్యంగా శిశువుల దేహమర్దననూనెలు, పిల్లలసబ్బులు (baby soaps), లేపనాలు, సౌందర్యక్రీములు, వంటివి తయారుచెయ్యడంలో ఉపయోగిస్తున్నారు.[6]
  • కేశ సంవర్ధన నూనె (Hair oil) గా కూడా ఉపయోగిసారు.[7]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Watermelons". botanical-online.com. http://www.botanical-online.com/english/watermelon.htm. Retrieved 2015-03-09. 
  2. "Watermelon History". homecooking.about.com. http://homecooking.about.com/od/foodhistory/a/watermelonhistory.htm. Retrieved 2015-03-09. 
  3. SEA Hand Book.2009by Solvent Extractors' Association Of India
  4. [http://www.ajournal.co.uk/pdfs/volume2/Vol.1%20(2)%20Article%206.pdf "Fatty acid Profile, Ash Composition and Oil Characteristics of Seeds of Watermelon Grown in Sudan"]. ajournal.co.uk. http://www.ajournal.co.uk/pdfs/volume2/Vol.1%20(2)%20Article%206.pdf. Retrieved 2015-03-09. 
  5. SEA HandBook.2009
  6. "The Benefits of Watermelon Seed Oil". massagemag.com. http://www.massagemag.com/News/massage-news.php?id=5855&catid=124&title=the-benefits-of-watermelon-seed-oil. Retrieved 2015-03-09. 
  7. "FEED YOUR HAIR: WATERMELON SEED OIL". rockitnapptural.com. http://www.rockitnapptural.com/2011/09/feed-your-hair-watermelon-seed-oil.html. Retrieved 2015-03-09.