అసంతృప్త కొవ్వు ఆమ్లం
అసంతృప్త కొవ్వు ఆమ్లాలు వృక్ష, జంతు సంబంధిత నూనెలు, కొవ్వులలో గ్లిజరాయిడ్/ గ్లిసెరైడ్ ల రూపములో వుండును. మూడు అణువుల ఫ్యాటి అమ్లాలు, ఒక అణువు గ్లిసెరోల్ సంయోగమ్ చెందటం వలన, ఒక అణువు ట్రై గ్లిసెరైడ్, మూడు అణువుల నీరు ఏర్పడును.[1] ట్రైగ్లిసెరైడ్‌లు పరిసర ఉష్ణోగ్రత (ambient temparature) వద్ద ద్రవరూపములో వున్న నూనెలనియు (oils), ఘనరూపములో వున్న కొవ్వులనియు (fats) అందురు.కొవ్వు ఆమ్లాలు కార్బొక్షిల్ గ్రూపుకు చెందిన మోనొకార్బొక్షిల్ ఆసిడ్‌లు. కొవ్వు ఆమ్లాలు సంతృప్త (saturated), అసంతృప్త (unsaturated) కొవ్వు ఆమ్లాలని రెండు రకాలు. సంతృప్త కొవ్వు ఆమ్లాల గురించి సంతృప్త కొవ్వు ఆమ్లాలు అనే శీర్షికలో వివరించడం జరిగినది. నూనెలలో వుండే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు సరిసంఖ్య (even number) కార్బనులను కలిగి వుండును. హైడ్రోకార్బను గొలుసులో సామాన్యముగా కొమ్మలు/శాఖలు (Branches) వుండవు.నూనెలోని అసంతృప్త కొవ్వు ఆమ్లాలు సిస్(cis)లేదా ట్రాన్స్(Trans)అమరికను కలిగివుండును.[2] నూనెలలోని అసంతృప్త కొవ్వు అమ్లాలు ఎక్కువగా సిస్ (cis) అమరిక కలిగి వుండును. అయితే వీటిని పలుమార్లు అధిక ఉష్ణోగ్రతలో వేడిచేసిన ట్రాన్స్ (Trans) కొవ్వు ఆమ్లాలుగా మారే అవకాశము వున్నది. నూనెలలో అధిక శాతములో 18 కార్బనులు వున్న అసంతృప్తకొవ్వు ఆమ్లాలలే వున్నవి.18 కార్బనులున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో ఒలిక్, లినొలిక్, లినొలెనిక్ కొవ్వు ఆమ్లాలు ముఖ్యమైనవి. ఒలిక్ ఆమ్లం ఒక ద్విబందం, లినొలిక్ ఆమ్లం రెండు ద్విబంధాలు, లినొలెనిక్ ఆమ్లం మూడు ద్విబంధాలు కలిగి వుండును. నూనెలలో 14-16 కార్బనులున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలు వున్నప్పటికి అవి సాధారణంగా 1-5% లోపు వుండును. బేసి సంఖ్య కార్బనులను కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలు నూనెలలో గుర్తించినప్పటికి, అవి చాలా స్వల్ప ప్రమాణములో ఉన్నవి. వంటనూనెల (Cooking oils) లో1-3 ద్విబంధాలున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా వున్నవి.4-7 ద్విబంధాలు కలిగి, 20-24 కార్బనులు కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలను సముద్రజల (marine) కొవ్వులలో(fats) కన్పిస్తాయి. కొమ్మలను (Branches), బేసిసంఖ్యలో(odd number) కార్బనులను కలిగిన అసంతృప్త కొవ్వు ఆమ్లాలను బాక్టిరియా (Bacteria), స్పాంజీకలో (sponges) గుర్తించారు.
'సిస్ అమరిక(cis)':అసంతృప్త కొవ్వుఆమ్లంలోని,ద్విబంధం వద్దనున్నరెండు కార్బనులతో వున్న హైడ్రొజనులు రెండు ఒకేవైపున వున్నచో పరస్పరం ఆకర్షింఛు కోవటం వలన, కొవ్వు ఆమ్లం యొక్క హైడ్రొకార్బను గొలుసులో చిన్న వంపు ఏర్పడును. దీనినే సిస్ అమరిక అందురు.[3]
'ట్రాన్స్(Trans)':అసంతృప్త కొవ్వు ఆమ్లంలోని ద్విబంధం వద్ద నున్న కార్బనులతో సంయోగం చెందివున్న రెండు హైడ్రోజనులు వ్యతిరేక దిశలో వుండటం వలన వాటి మధ్య ఆకర్షణ తక్కువగా వుండటం వలన హైడ్రోకార్బను గొలుసులో ఎటువంటి వంపు ఎర్పడదు.[4]
అసంతృప్త కొవ్వు ఆమ్లాల వర్గీకరణ
[మార్చు]ఏక ద్విబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు(mono unsaturated fatty acids)
[మార్చు]ఏక ద్వింబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లమనగా,కొవ్వు ఆమ్లం యొక్క కర్బనపు-ఉదజని శృంఖలంలో ఒకే ద్వింబంధం రెండు కార్బనుల మధ్య ఏర్పడి వుండటం[5] ఏక ద్విబంధమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో, సమాన కార్బనులున్న సంతృప్త కొవ్వు ఆమ్లం కన్న రెండు హైడ్రోజను పరమాణువులు తక్కువగా వుండును.ఏక ద్విబంధ కొవ్వు ఆమ్లాలు 10 కన్న ఏక్కువ కార్బనులను కలిగి వుండును.16 కార్బనులు కలిగి ఏకద్విబంధమున్న పామిటొలిక్ ఆమ్లం(Pamitoleic), 18 కార్బనులుండి, ఏక ద్విబంధమున్న ఒలిక్ ఆమ్లం నూనెలలో అధికముగా వున్నవి.
ఎంపిరికల్‌ఫార్ముల:CnH2n-2O2
ఏకద్విబంధమున్న కొవ్వుఆమ్లాలపట్టిక
FORMULA | COMMON Name | SYSTEMATIC NAME | MELTING POINT0C |
C10H18O2 | Obtusilic | 4-Decenoic | |
C10H18O2 | Caproleic | 9-Decenoic | |
C12H22O2 | Linderic | 4-Dodecenoic | 1.3 |
C12H22O2 | Lauroleic | 9- Dodecenoic | |
C14H26O2 | Tsuzuic | 4-Tetradecen | 18.5 |
C14H26O2 | Physteric | 5-Tetradecenoic | |
C14H26O2 | myristoleic | 9-Tetradecenoic | |
C16H30O2 | Pamitoleic | 9-Hexadecenoic | |
C18H34O2 | Petrosteric | 6-Octadecen | 30 |
C18H34O2 | Oleic | 9-Octadecenoic | 14 |
C18H34O2 | accenic | 11-trans Octadecenoic | 44 |
C20H38O2 | Gadoelic | 9-Eicosenoic | |
C20H38O2 | .... | 11- Eicosenoic | |
C22H42O2 | Cetaleic | 11-Docosenoic | |
C22H42O2 | Erucic | 13-Docosenoic | 33.5 |
C24H46O2 | selacholeic | 15-tetracosenoic | |
C26H50O2 | Xmenic | 17-Hexacosenoic | |
C30H58O2 | Lumequeic | 21-triacontenoic |
పై రెండు కొవ్వు ఆమ్లాలు (ఒలిక్,పామిటొలిక్)9-కార్బను వద్ద ద్విబంధము కలిగి సిస్ రూపములో వున్నవి. 4,5,6,11,13, 17 కార్బనుల వద్ద ఏక ద్విబంధమున్నకొవ్వు ఆమ్లాలను నూనెలలో గుర్తించినప్పటికి అవి స్వల్పప్రమాణములో వున్నాయి.
కాప్రొలిక్ ఆమ్లం(caproleic acid)
[మార్చు]H2C=CH(CH2)7COOH
10 కార్బనులను కలిగి వుండి ,9వ కార్బను వద్ద ఒక ద్విబంధము వున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం.శాస్త్రీయ నామము 9-డెసెనొయిక్ ఆసిడ్(9-Decenoic acid).[6] ఇది జంతు(animal)పాలకొవ్వులలో 1%శాతము కన్న తక్కువ ప్రమాణములో కన్పించును.కాప్రొలిక్ ఆమ్లం ఐసోమర్ ఒబుస్టిలిక్ ఆసిడ్(4-Decenoic)ను కొన్ని విత్తన నూనెలలో గుర్తించారు.మధ్యస్తమైన పొడవు ఉన్న కర్బన-ఉదజని శృంఖలాన్నికలిగి వున్న కొవ్వుఆమ్లం.
- అణుభారం:170.24
- ద్రవీభవన ఉష్ణోగ్రత్త =269-2710C/సాధారణ వాతావరణ పీడనంవద్ద.
లారోలిక్ ఆమ్లం(Lauroleic acid)
[మార్చు]CH(CH2)CH=CH(CH2)7COOH
12 కార్బనులను కలిగి,9వ కార్బనువద్ద ద్విబంధమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం. శాస్రీయ నామము 9-డొడెసెనొయిక్ ఆసిడ్ (9-Dodecenoic acid).ఇది వెన్నఫ్యాట్( (butter fat)లో తక్కువ ప్రమాణములో వున్నది. దీని ఐసోమర్ లిండెరికాసిడ్(4-dodecenoic)ను లిండరోల్ సిటబ ఫ్యాట్/కొవ్వు లో గుర్తించారు.
మిరిస్టోలిక్ ఆమ్లం(myristoleic acid)
[మార్చు]CH3(CH2)3CH=CH(CH2)7COOH
14 కార్బనులను కలిగి వుండి,9వ కార్బనువద్ద ద్విబంధమున్న అసంతృప్త కొవ్వు అమ్లం. శాస్త్రీయ నామము 9-టెట్రాడెసెనొయిక్ ఆసిడ్(9-tetra decenoic acid). ఈ ఆసిడ్‌ను సముద్రజలజీవుల కొవ్వులలో, వెన్నలో 1% వరకు వున్నట్లు గుర్తించారు.
గుణము | విలువల మితి[9] |
అణుభారం | 226.34 |
వక్రీభవన సూచిక | 1.4562 |
మరుగు ఉష్ణోగ్రత | 1440C/0.6 మి.మి/మెర్కూరి పీడనంవద్ద |
సాంద్రత | 09/250C వద్ద |
పామిటొలిక్ ఆమ్లం(pamitoleic acid)
[మార్చు]CH3(CH2)5CH=CH(CH2)7COOH
గుణము | విలువల మితి[10] |
అణుపార్ముల | C16 H32O2 |
అణుభారం | 254.4082 |
సాంద్రత | 895 గ్రాం/లీటరు. |
మెల్టింగ్‌పాయింట్ | 13-140C. |
బాయిలింగ్‌పాయింట్ | 1620C./06 mm/Hg |
వక్రీభవన సూచిక(600C) | 1.457 |
16 కార్బనులను కలిగి వుండి,9-వ కార్బనువద్ద ద్విబంధమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం,దీని శాస్త్రీయ నామము 9-హెక్సాడెసెనొయిక్‌ఆసిడ్(9-Hexadecenoic acid).ఇది పత్తిగింజల నూనెలో, వేరుశనగ నూనెలో,సోయాబీన్, పామ్ నూనెలో, పొగాకు విత్తన నూనెలో 1% వరకు వున్నది. పశుపాల కొవ్వులలో(animal milk fat)2-4% వరకు కలదు. ఎద్దు(beef),గుర్రం(horse)మాంస కొవ్వులలో , పక్షుల (birds), సరీసృపాల(reptiles), ఉభయచరాల (amphbia)ఫ్యాట్‌లలో 6-15% వరకు ఈ కొవ్వు ఆమ్లంను గుర్తించారు.చేపల(fishes), తిమింగలాల(whales)ఫ్యాట్‌లలో10-20% వరకు పామిటొలిక్ ఆమ్లంను గుర్తించారు.[11]
ఒలిక్ ఆమ్లం(oleic acid)
[మార్చు]CH3(CH2)7CH=CH(CH2)7COOH
18 కార్బనులను కలిగి వుండి,9వకార్బనువద్ద ఒక ద్విబంధమున్న కొవ్వు ఆమ్లం ఇది. ఇది ఎక్కువగా సిస్ ఐసొమర్ రూపంలో నూనెలలో ఉన్నది. శాస్త్రీయనామము సిస్,9-అక్టడెసెనొయిక్‌ఆసిడ్ (cis,9-octade cenoic acid).అన్నిశాకనూనెలలో(vegetable oils), జంతుకొవ్వులలో (animal fats)తప్పనిసరిగా కన్పించె అసంతృప్త ఫ్యాటి ఆమ్లంలలో ఇది ఒకటి. దీనిని ఒమేగా-9 కొవ్వుఆమ్లమనికూడా అంటారు.
గుణము | విలువల మితి[12] |
అణుపార్ముల | C18H34O2 |
అణుభారం | 282.4614 |
సాంద్రత | 895 గ్రాం/లీటరు. |
ద్రవీభవన పాయింట్ | 13-140C. |
భాష్పిభవన ఉష్ణోగ్రత | 3600C. |
వక్రీభవన సూచిక(600C) | 1.4449 |
విశీష్ణోణం(500C)J/g | 2.046 |
స్నిగ్ధత,mPa.s(250C) | 25.64 |
ఒలిక్ ఆమ్లం గోధుమ, పసుపు రంగు కలిగిన ద్రవము.ఒలివ్/ఆలివ్ ఆయిల్(olive)లో మొదటగా ఆధిక శాతములో గుర్తించడం వలన ఈ పేరు వచ్చినది[13] .ఒలివ్ ఆయిల్‌లో ఈ ఫ్యాటిఆసిడ్ 80% వున్నది.పొగాకు విత్తన నూనెలో 85% వరకు,వేరుశనగ నూనెలో 50-60% వరకు వున్నది.నువ్వుల(sesame)నూనెలో 30-40%,పొద్దు తిరుగుడు నూనెలో 15-30% వరకున్నది.అలాగే సోయాబీన్ నూనెలో 19-30%,కుసుమ నూనెలో 40%,అవిసె నూనెలో 20-22% వరకు వున్నది.తవుడు నూనెలో 30-40% వరకు ఉన్నది.11 వ కార్బను వద్ద ద్విబంధమున్న దీని ఐసొమర్ వస్సెనిక్ ఆమ్లంను కూడా పలునూనెలలో గుర్తించారు.
గడొలిక్ ఆమ్లం(gadoleic acid)
[మార్చు]CH3(CH2)9CH=CH(CH2)7COOH
ఇది 20 కార్బనులను కలిగి,9 వ కార్బనువద్ద ఏక ద్విబంధమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం. శాస్త్రీయనామము: 9-ఎయికొసెనొయిక్ ఆసిడ్(9-eicosenoic acid)దీనిని సముద్ర జలచరజీవుల నూనెలలో 10% వరకు వున్నట్లు గుర్తించడం జరిగినది.11 వ కార్బను వద్ద ద్విబంధమున్న (ఐసోమరు) 11-ఎయికొసెనొయిక్ ఆసిడ్(11-eico senoic)ను జొజబ/ హహోబ ఫ్యాట్(jojaba))లో 65% వరకు,ఆవాల (mustard)నూనెలో 1-14% వున్నట్లు గుర్తించారు.తిమింగళ కొవ్వు తైలంలో, కొన్నిరకాల చేపలనూనెలో ఈ ఆమ్లంయొక్క ఉనికిని గుర్తించడం జరిగినది.[14]
గుణము | విలువల మితి [15] |
అణుభారం | 310.51452 |
ద్రవీభవన ఉష్ణోగ్రత | 25-250C |
మరుగు ఉష్ణోగ్రత | 1700C/1 mm/Hగ్ పీడనంవద్ద. |
ఈ కొవ్వు ఆమ్లం యొక్క మరి కొన్ని ఐసోమరు రూపాలు:9Z-ఎయికొసెనొయిక్‌ఆసిడ్(9Z-eicosenoic acid) ,cis-9-ఐకో సెనొయిక్ ఆమ్లం(cis-9-icosenoic acid)లనుకూడా షార్కు, కాడ్(cod) కాలేయ నూనెలలో గుర్తించారు.[15]
ఇరూసిక్ ఆమ్లం(erucic acid)
[మార్చు]CH3(CH2)7CH=CH(CH2)11COOH
ఇది 22 కార్బనులను కలిగి,13వ కార్బను వద్ద ద్విబంధమున్నవున్న , పొడవైన ఉదజని-కర్బనపు గొలుసును కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం. శాస్త్రీయనామము: 13-డెకొసెనొయొక్‌ఆసిడ్(13-decosenoic).ఈ కొవ్వు ఆమ్లము "కృసిఫెరె" (crucif erae), "ట్రొపొలసియే"((tropolaceae) కుటుంబ మొక్కలకు చెందిన నూనెలలో అధిక మొత్తములో లభ్యము. ఆవాల నూనెలో (rape/ mustard),[16] "వాల్‌ప్లవరుసేడ్" నూనెలలో 35-45% వరకు వున్నది.
గుణము | విలువల మితి[17] |
అణుభారం | 338.55 |
ద్రవీభవన ఉష్ణోగ్రత | 330C[18] |
మరుగు ఉష్ణోగ్రత | 3580C/400 mm/Hgపీడనంవద్ద[19] |
వక్రీభవన సూచిక | 1.456-1.457 |
విశిష్టగురుత్వం | 0.853 |
ఈ కొవ్వు ఆమ్లాన్ని కందెనల తయారి పరిశ్రమలలో,ఉష్ణవాహకనూనె(heat transfer fluids),కాస్మెటిక్సు,పాలిమర్,ప్లాస్టికు,నైలాను పరిశ్రమలో కూడా ఉపయోగిస్తారు[17]
బహుబంధ అసంతృప్తకొవ్వు ఆమ్లాలు(poly un saturated fatty acids)
[మార్చు]ఒకటి కన్న ఎక్కువగా ద్విబంధాలున్న కొవ్వు ఆమ్లాలను బహుబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (poly unsaturated fatty acids)లని అందురు. బహుబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు నూనెలలో విసృతంగానే లబిస్తాయి. ఎక్కువగా 18కార్బనులున్న బహుబంధ కొవ్వు ఆమ్లాలున్నాయి. వీటిలో రెండు ద్విబంధాలున్న లినొలిక్(Linoleic) ఆమ్లం, మూడుద్విబంధాలున్న లినొలెనిక్(Linolenic)ఆమ్లం లు ముఖ్యమైనవి.యివి రెండు కూడా సిస్ అమరిక ఉన్న కొవ్వు ఆమ్లాలు.20-22 కార్బనులను కలిగి,4-5 ద్విబంధాలున్న కొవ్వు ఆమ్లాలు సముద్రజలజీవుల నూనెలలో లభ్యం. 18కన్న తక్కువ కార్బనులను కలిగిన బహుబంధ కొవ్వు ఆమ్లాలు శాకనూనెలలో(vetable oils)అంతగా కన్పించవు.
బహుబంధాలున్నకొన్ని అసంతృప్త కొవ్వుఆమ్లాల పట్టిక
ఫార్ములా | శాస్త్రనామం | వాడుక పేరు | M.P.0C | లభ్యం |
18H32O2 | సిస్,సిస్,9,12-ఆక్టాడెకడైనొయిక్ | లినొలిక్‌ఆమ్లం | -5 | పొద్దుతిగుడునూనె |
పత్తిగింజలనూనె | ||||
C18H30O2 | సిస్,సిస్,సిస్,9,12,15-ఆక్టాడెకాట్రైయినొయిక్ | లినోలినిక్ ఆమ్లం | -11 | లిన్‌సీడ్‌నూనె |
పెరిల్ల నూనె | ||||
C18H30 | సిస్,ట్రాన్స్,ట్రాన్స్,9,12,15- ఆక్టాడెకట్రైయినొయిక్ | αఈలయ స్టియరిక్ ఆమ్లం | -49 | టంగ్‌నూనె,పొయక్‌నూనె |
C18H30O2 | అన్నియు,ట్రాన్స్,9,11,13- ఆక్టాడెకట్రైయినొయిక్ | βఈలయ స్టియరిక్ | 70 | αఐసోమర్ |
C18H28O2 | 9,11,13,15-ఆక్టాడెకటెట్రాయినొయిక్ | పరినరిక్‌ఆమ్లం | 86 | పరినరియమ్ |
C20H32O2 | అన్నిసిస్,5,8,11,14- ఎయికొస టెట్రొనొయిక్ | ఆరచిడొనిక్‌ఆమ్లం | -50 | జంతుకొవ్వుపాస్పొలిపిడ్స్ |
C22H34O2 | అనియు,సిస్,4,8,12,15,19-డొకొసపెన్టనొయిక్ | క్లుపడొనిక్ | జలజీవులు |
లినొలిక్ ఆమ్లం(Linoleic acid)
[మార్చు]CH3(CH2)6CH=CH(CH2)7COOH
18 కార్బనులను కలిగివుండి, రెండు ద్విబంధములున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం.ద్విబంధాలలో, ఒకటి-9వకార్బనువద్ద,రెండోవది-12వ కార్బను వద్ద వుండును.దీని శాస్త్రీయనామము: సిస్,సిస్,-9,12 అక్టాడెకనొయిక్ ఆసిడ్(cis,cis9-12 octadecadeinoicacid).18 కార్బనునులు కలిగివున్న సంతృప్తకొవ్వు ఆమ్లం స్టియరిక్ ఆమ్లం కన్న లినొలిక్ ఆమ్లం లో 4 హైడ్రొజను పరమాణువులు తక్కువగా వుండును.సాధారణ గది ఉష్ణోగ్రతవద్ద పారదర్శకంగా వుండును.రెండు ద్విబంధాలు కూడా "సిస్"అమరికలో వుండును.[20] అమ్లం యొక్క గుణగణాలపట్టిక [21]
లక్షణము | విలువమితి |
ఎంపిరికల్‌పార్ముల | CnHn-4O2 |
అణుభారం | 280.45 గ్రాం/మోల్ |
సాంద్రత | 900గ్రాం/లీటరు. |
మెల్టింగ్‌పాయింట్ | -5 0C |
బాయిలింగ్‌పాయింట్ | 3650C. |
సాంద్రత 250C | .902 |
ద్రవీభవన ఉష్ణోగ్ర్త | -50C |
లినొలిక్ ఆమ్లం ను ఒమెగా-6 కొవ్వు ఆమ్లం అనికూడా అందురు.కొవ్వు ఆమ్లం హైడ్రోకార్బను గొలుసులోని చివరి మిధైల్(CH3) గ్రూప్‌లోని కార్బనును ఒమెగా()కార్బను అందురు.ఒమెగా కార్బను నుండి 6వ కార్బనువద్ద మొదటిద్విబంధం వున్నందువలన దీనిని ఒమెగా-6 కొవ్వు ఆమ్లం అనికూడా అందురు. లినొలిక్‌ఆసిడ్ అవశ్యకకొవ్వు ఆమ్లాలలో(essential fatty acid)ఒకటి[22] .లిన్‌సీడ్(linseed)ఆయిల్ లో ఈఆమ్లంను మొదటగా గుర్తించడం వలన ఈకొవ్వు ఆమ్లంకు లినొలిక్ ఆమ్లం అనేపేరు వచ్చినది. లినొలిక్ ఆమ్లం కుసుమ (safflower) నూనెలో 75%,ద్రాక్షవిత్తననూనెలో 73%,గసగసాల(poppy seed)నూనెలో 70%,పొద్దుతిరుగుడు (sun flower) నూనెలో68%, గోగు(hemp) నూనెలో 60%, మొక్కజొన్న నూనె లో 59%,పత్తిగింజల నూనెలో 55% వరకు లినొలిక్ ఆమ్లం కలదు., సోయాబీన్ నూనె లో 51%,వాల్నట్(walnut)నూనెలో 50%, నువ్వులనూనె లో 45%, తవుడునూనె లో 35% , వేరుశనగ నూనెలో 32%, పామాయిల్ , లార్డ్, ఒలివ్ ఆయిల్‍లలో 10% వరకు లినొలిక్ ఆమ్లం వున్నది.[23]
లినోలినిక్ ఆమ్లం(Linolenic acid)
[మార్చు]CH3(CH=CHCH2)3(CH2)7COOH
యిది 18 కార్బనులను కలిగివుండి,3ద్విబంధాలు కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లమే లినోలినిక్ ఆమ్లం.. దీన్ని అల్పా-లినొలెనిక్ ఆసిడ్ అనికూడా అంటారు. దీని శాస్త్రీయనామము-సిస్, సిస్.సిస్-9,12,15' అక్టా డెక ట్రైనొయిక్ ఆసిడ్((cis,cis,cis,-9,12,15 octa deca trienoic acid). మానవుని ఆహారంలో తప్పనిసరిగా వుండవలసిన కొవ్వు ఆమ్లంగా భావిస్తారు.[24]
భౌతిక ధర్మాలపట్టిక[25]
లక్షణం | విలువమితి |
అణుపార్ముల | C18H30O2 |
అణుభారము | 278.43 గ్రాం.మోల్. |
ద్రవీభవన ఉష్ణోగ్రత | -11.00C |
వక్రీభవన సూచిక n20/D | 1.480 |
సాంద్రత,250Cవద్ద | 0.914 |
భద్రపరచవలసిన ఉష్ణోగ్రత | -2000C |
ఈకొవ్వు ఆమ్లం ఆవాల నూనెలో వున్నప్పటికి, కొద్ది నూనెలలో మాత్రమే అధిక ప్రమాణములో కన్పించును. అవిసెనూనె(linseed)లో 45-50%,పెరిల్ల నూనె(perilla))లో65%వరకు వుండును.జంతు కొవ్వు నిల్వలలో(animal fat depot)1.0% వరకు వుండును.అయితే గుర్రం కొవ్వులో 15% వరకు ఈకొవ్వు ఆమ్లం కలదు. చియా(chia)లో 65%,కివి ఫ్రూట్‌సీడ్(kiwi fruit seed)నూనెలో 62%,రేప్‌సీడ్(rape seed)లో10%,సోయాలో 8%వరకు ఈకొవ్వు ఆమ్లం వున్నది.లినోలినిక్ ఆమ్లంను 3-ఒమేగా కొవ్వు ఆమ్లం అంటారు.ఈకొవ్వు ఆమ్లం మానవ ఆహరములో తప్పని సరిగా వుండవలసిన 'ఆవశ్యక(essential)కొవ్వు ఆమ్లం.మానవ దేహ జీర్ణవ్యవస్తకు బహుబంధాలున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలను, ముఖ్యంగా ఒమేగా3-కొవ్వు ఆమ్లాలను ఉత్పత్తి చేసుకునే సమర్దత లేదు.
α-ఈలయ స్టియరిక్ ఆమ్లం(α-eleastearic acid)
[మార్చు]ఈకొవ్వు ఆమ్లం18 కార్బనులను కలిగివుండి,లినొలెనిక్ ఆమ్లంవలె 3 ద్విబంధాలను కలిగివున్నది.అయితే ఈ ద్విబంధాలు 9,11,13 కార్బనుల వద్ద కంజుగెటెడ్‍గా కలిగి వున్నది. దీని శాస్త్రీయనామము 9,11,13-అక్టాడెక ట్రైనొయిక్‌ఆసిడ్(9,11,13-octa decatrienoic acid)ఇది లినొలెనిక్ ఆమ్లం యొక్క కంజుగెటెడ్ బంధాలున్న ఐసోమర్ కొవ్వుఆమ్లం.సాధారణంగా బహుద్విబంధాలున్నకొవ్వు ఆమ్లాలలో ద్విబంధాలమధ్య 3 కార్బనులు వుండును. అలా కాకుండగా 3 కార్బనులకన్న తక్కువగా వున్నచో వాటిని కంజుగెటెడ్ ఆసిడ్లు అందురు.ఈకొవ్వు ఆమ్లం టంగ్(tung)[26] లేదా ఛైనావుడ్ ఆయిల్‌లో 85% వరకు వున్నది.యుపొర్బెసియె, కుకుర్బిటెసియే కుటుంబ మొక్కల నూనెలో ఈకొవ్వు ఆమ్లం యొక్క వునికిని గుర్తించారు. కంజుగెటెడ్‌బంధాలు కలిగివున్న కారణం వలన ఈకొవ్వు ఆమ్లం త్వరగా పాలిమరైజెసన్(polymerization)చెందును.
- అణుభారం:278.43[27]
- ద్రవీభవన ఉష్ణోగ్రత:-490C
అసౌష్టవ కొవ్వుఆమ్లాలు
[మార్చు]మొక్కలలో వుండు కొవ్వు ఆమ్లాలు సాధారణంగా సరళ శృంఖల హైడ్రొకార్బను గొలుసును కల్గివుండి, ఒక చివర కార్బొక్షిల్ సమూహం (COOH)ను రెండోచివర మిథైల్(CH3) సమూహన్ని కలిగివుండి ఎటువంటి శాఖలను కలిగివుండవు. వంటనూనెలలోవున్న సంతృప్త, అసంతృప్త కొవ్వుఆమ్లాలు ఈ రకంనకు చెందినవే. అంతేకాదు ఈ కొవ్వు ఆమ్లాలన్ని సరిసంఖ్యలో కార్బనులను కలిగివుండును (ఉదా: 4,6,8,10,12,14,16,18,20,22,24). అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో ద్విబంధాలు అసంధిగ్ధబంధాలను(non conjugated)కలిగివుండును.
అసంధిగ్ధబంధంఅనగా రెండుద్విబం ధా ల మధ్య కనీసం 3కార్బనుల ఎడంవుండును. అలా కాకుండా రెండు కార్బనులు మాత్రమే ఎడం వున్నప్పుడు ఆబంధాలను సంధిగ్ధబంధాలు (conjugated) అందురు.
అసంధిగ్ధ బంధంనమూనా:C-C=C-C-C=C-C
సంధిగ్ధ బంధం నమూనా:C-C=C-C=C-C
పై విధంగా కాకుండగా బేసి సంఖ్యలో కార్బనులున్న హైడ్రోకార్బను గొలుసును కలిగివున్న లేదా కొమ్మలు కలిగివున్నను, సంధిగ్ధ బంధాలనుకలిగివున్నను, లేదాహైడ్రోకార్బను గొలుసులో అధనంగా హైడ్రోక్సిల్, మిథైల్ సమూహలు,లేదా ఆరోమాటిక్ వలయాలున్న కొవ్వుఆమ్లాలను అసౌష్టవ కొవ్వుఆమ్లాలు(asymmetrical or unusual structure )అందురు.ఇలాంటి కొవ్వుఆమ్లాలను కొన్ని శాకనూనెలలో జంతు కొవ్వులలో అతి తక్కువ పరిమాణంలో గుర్తించారు. ఇవి అతి తక్కువ పరిమాణంలో వుండటంవలన నూనె ఉత్పత్తిదారులకు ప్రాముఖ్యం లేనప్పటికి, జీవ, నూనెల శాస్త్రవేత్తలకు వారి దృష్టికోణం నుండి ప్రాముఖ్యమైనవే వాటిపై పరిశోధనలు చేస్తున్నారు.
1.టరరిక్ ఆమ్లం(Tararic acid):18 కార్బనులను కలిగివున్నది.7, 8 వకార్బను వద్ద త్రిబంధంకల్గివున్నది.
2.లికనిక్ ఆమ్లం(Licanic acid):18 కార్బనులను కల్గివున్నది.4-కెటొ 9:10,11:12,13:14అక్టాడెక టైయినొయిక్‌ఆమ్లం
3.హిడ్నొకార్పిక్ ఆమ్లం(hydnocarpic acid):16 కార్బనులను కలిగి వుండి,హైడ్రొకార్బను గొలుసు చివరన 5 కార్బనులున్నమూసివున్న వలయాన్ని(5member closed ring)కల్గివున్నది.
4.చౌల్‌ముగ్రిక్ ఆమ్లం(chaulmoogric acid):18కార్బనులను కలిగివుండి.హైడ్రొకార్బను గొలుసు చివర 5కార్బనులున్న మూసివున్న వలయాన్ని కలిగివుండును.
5.రిసినొలిక్ ఆమ్లం(Ricinolic acid):18 కార్బనులను కలిగివున్న,12 వకార్బను వద్ద హైడ్రొక్సిన్(HO) కలిగివుండును
రిసినోలిక్ ఆమ్లం (Ricinoleic acid)
[మార్చు]ఇది 18 కార్బనులను కలిగివున్న ,ఏక ద్విబంధమున్నద్రవరూపంలో లభ్యమగు అసంతృప్త కొవ్వు ఆమ్లం.కొవ్వు ఆమ్లంలోని హైడ్రొకార్బనుశృంఖలంలో12కార్బను ఒకఆక్సిజను పరమాణువును అధికంగాకల్గివుండును.
రిసినోలిక్ ఆమ్ల భౌతిక గుణగణాల పట్టిక [28]
శాస్రీయ నామం | 12-హైడ్రొక్షి-9-అక్టాడెసెనొయిక్‌ఆసిడ్. |
ఆణు ఫార్ములా | C18H34O3. |
అణు భారం | 378.52 |
ద్రవీభవన ఉష్ణోగ్రత | 5.50C |
మరుగు ఉష్ణోగ్రత | 2450C |
ఫ్లాష్ పాయింట్ | 2240C |
సాంద్రత | 0.940 |
వక్రీభవన సూచికnD20 | 1.4716 |
ఈ కొవ్వు ఆమ్లం ఆముదం నూనెలో85-90% వరకు వున్నది[29] .ఎర్గొట్ నూనెలో 35%వున్నది.
- రిసినోలిక్ ఆమ్లాన్ని సబ్బుల తయారి,జవుళీ పరిశ్రమకు అవసరమైన పదార్థాలను తయారు చేయుటలో వాడెదరు[30]
మూలాలు
[మార్చు]- ↑ http://www.wisegeek.com/what-are-triglycerides.htm
- ↑ http://www.diffen.com/difference/Cis_Fat_vs_Trans_Fat
- ↑ http://medical-dictionary.thefreedictionary.com/cis+fatty+acid
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-24. Retrieved 2013-10-26.
- ↑ http://www.heart.org/HEARTORG/GettingHealthy/FatsAndOils/Fats101/Monounsaturated-Fats_UCM_301460_Article.jsp
- ↑ http://www.tuscany-diet.net/lipids/fatty-acid-index/caproleic/
- ↑ http://pubchem.ncbi.nlm.nih.gov/summary/summary.cgi?sid=7849909&viewopt=PubChem
- ↑ http://www.tuscany-diet.net/lipids/fatty-acid-index/lauroleic/
- ↑ http://www.sigmaaldrich.com/catalog/product/sigma/m3525?lang=en®ion=IN
- ↑ http://www.sigmaaldrich.com/catalog/product/sigma/p9417?lang=en®ion=IN
- ↑ https://www.caymanchem.com/app/template/Product.vm/catalog/10009871
- ↑ http://www.sigmaaldrich.com/catalog/product/sial/o1008?lang=en®ion=IN
- ↑ http://www.wisegeek.org/what-is-oleic-acid.htm
- ↑ http://www.merriam-webster.com/dictionary/gadoleic%20acid
- ↑ 15.0 15.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-05-09. Retrieved 2013-10-27.
- ↑ http://medical-dictionary.thefreedictionary.com/erucic+acid
- ↑ 17.0 17.1 http://www.chemicalland21.com/industrialchem/organic/ERUCIC%20ACID.htm
- ↑ http://www.matreya.com/productinfo.aspx?productid=1264
- ↑ http://www.sigmaaldrich.com/catalog/product/sigma/e3385?lang=en®ion=IN
- ↑ http://www.news-medical.net/health/Linoleic-Acid-What-is-Linoleic-Acid.aspx
- ↑ http://www.sigmaaldrich.com/catalog/product/sigma/l1376?lang=en®ion=IN
- ↑ http://www.chm.bris.ac.uk/motm/linoleic/linh.htm
- ↑ http://www.mstrust.org.uk/atoz/linoleic_acid.jsp
- ↑ http://www.thefreedictionary.com/linolenic+acid
- ↑ http://www.sigmaaldrich.com/catalog/product/sigma/l2376?lang=en®ion=IN
- ↑ http://www.merriam-webster.com/dictionary/eleostearic%20acid
- ↑ http://www.chemicalbook.com/ChemicalProductProperty_EN_CB5141104.htm
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-06-14. Retrieved 2013-10-27.
- ↑ https://www.caymanchem.com/app/template/Product.vm/catalog/10009729
- ↑ http://www.thefreedictionary.com/ricinoleic+acid
1.A.E.Bailey's 'industrial oil&fat products