సంతృప్త కొవ్వు ఆమ్లం

వికీపీడియా నుండి
(సంతృప్త కొవ్వు ఆమ్లాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కొవ్వు ఆమ్లం లోని హైడ్రొకార్బను గొలుసులోని కార్బను-కార్బనుల మధ్య ఎటువంటి ద్విబంధం లేని కొవ్వుఆమ్లంలను సంతృప్త కొవ్వుఆమ్లం[1] (Saturated Fatty Acid) లందురు. కొవ్వుఆమ్లం ఒక చివర మిథైల్ (CH3), రెండో చివర కార్బొహైడ్రొక్షిల్ (COOH) వుండి, ప్రతి కార్బను రెండు హైడ్రొజనులతో, రెండుకార్బనులతో ఎకబంధం కల్గివుండును. సంతృప్త కొవ్వుఆమ్లాలు శాకనూనెల కన్న జంతుదేహ కొవ్వులలో అధికంగా వుండును. ఆలాగే క్షీరదంల పాలలో కూడా అధికమొత్తంలో వుండును.

సంతృప్త కొవ్వుఆమ్లాలు[మార్చు]

బుట్రిక్ ఆమ్లం/బ్యుటిరిక్ ఆమ్లం:[మార్చు]

బ్యుటిరిక్ ఆమ్లం, a పొట్టిగొలుసు కొవ్వు ఆమ్లం

బ్యుటిరిక్ ఆమ్లం (Butyric acid) నాలుగు కార్బనులను కలిగివున్నది. క్షీరదాల (mammals) పాలలలో 2-4% వరకు వుండును.[2] ఈ కొవ్వు ఆమ్లాన్ని పొట్టిగొలుసు (శృంఖలం) కొవ్వుఆమ్లం రకానికి చెందినది.8 లోపు కార్బనులను కలిగిన ఆమ్లాలను చిన్న శృంఖాయుత కొవ్వుఆమ్లాలంటారు.

లక్షణము విలువలమితి
సౌష్టవ ఫార్ములా CH3 (CH2) 2COOH
అణుఫార్ములా C4H8O2
అణుభారము 88.11 గ్రాం./మోల్
సాంద్రత 959.5 గ్రాం./లీ
ద్రవీభవన ఉష్ణోగ్రత -7.90C
మరుగు ఉష్ణోగ్రత 163.50C
స్నిగ్ధత 0.1529cp
(auto ignition temparature) 520C

బ్యుటిరిక్ ఆమ్లం నీటిలో కలుస్తుంది. 'బుటిరో' అనగా వెన్న (Butter) అని అర్ధము. యిది వెన్నలో ఎక్కువగా వుండటం వలన దీనికి బుట్రిక్/బుటిరిక్ ఆమ్లం అనేపేరు వచ్చింది.బుటిరిక్ ఆమ్లం వెగటువాసన (unpleasant smell), రుచి (taste) కలిగి వుండును[3]. నీటిలోను, ఇథనాల్ లోను (ethanol), ఇథరులో కరుగును. బుట్రిక్ ఆమ్లం 2-మిథైల్ ప్రొపేనొయిక్ ఆసిడ్ (2-methyl pro panoic acid) అనే ఐసోమర్ రూపములో కూడా లభిస్తుంది. బుటిరిక్ ఆమ్లాన్ని బుటనోట్ ఎస్టరు ల తయారిలో ఉపయోగిస్తారు.

కాప్రోయిక్ ఆమ్లం[4][మార్చు]

కాప్రోయిక్ ఆమ్లం నిర్మాణం.

కాప్రోయిక్ ఆమ్లం (Caproic acid) 6 కార్బనులను కలిగివున్న సంతృప్త కొవ్వు ఆమ్లం.

లక్షణము విలువలమితి
పార్ముల CH3 (CH2) 4COOH.
శాస్త్రీయ నామము హెక్సానొయిక్ ఆసిడ్ (hexanoic acid)
అణుభారము 116.158గ్రాం./మోల్
సాంద్రత (density) 920గ్రాం./లీ
మెల్టింగ్‌పాయింట్ -3.40C
బాయిలింగ్‌పాయింట్ 202-2030C

కాప్రొయిక్ ఆమ్లం పాలకొవ్వులలో 1-3% వరకు, కొబ్బరినూనె, పామ్‌కెర్నల్ నూనెలలో3-10% వరకు వుండును.లాటిన్ భాషలో కాప్రిక్ అనే పదము మేకకు (Goat) సంబంధించిన పదము.కాప్రిక్ ఆమ్లం మేకపాల వాసన[5] కలిగివుండటం వలన 6-10 కార్బనులను కలిగిన కొవ్వు ఆమ్లముల పేర్లు 'కాప్రి'తో మొదలగును. మేకపాలలో6-10 కార్బనులున్న కొవ్వు ఆమ్లాలు 15% వరకు ఉన్నాయి. ఈకొవ్వు ఆమ్లముల లవణములను (salts), ఎస్టరులను హెక్షనొఎట్స్ (hexanoates) కాప్రొఏట్స్ (caproates) అంటారు.

కాప్రిలిక్ ఆమ్లం[మార్చు]

CH3 (CH2) 6COOH కాప్రిలిక్ ఆమ్లం (Caprylic acid) 8 కార్బనులను కలిగివున్న సంతృప్త కొవ్వు ఆమ్లం.

లక్షణము విలువలమితి
శాస్త్రీయ నామము ఆక్టనొయిక్ (octanoic) ఆసిడ్.
ఆణుపార్ములా C8H16O2,
అణుభారము 144.21 గ్రాం./మోల్[6]
సాంద్రత 910గ్రాం./లీ
మెల్టింగ్‌పాయింట్ 16.70C
బాయిలింగ్‌పాయింట్ 2370C

ఈఆమ్లము రంగులేని జిడ్డు (oily) ద్రవము.క్షీరదాలపాలలో 3-6%, కొబ్బరి, పామ్‌కెర్నల్ నూనెలలో 3-5% వరకు ఉంది.[7] ఈకొవ్వు ఆమ్లం జిడ్డులా వుండటం వలన నీటిలో అంతగా కరుగదు. కాప్రిలిక్ ఆమ్లాల ఈస్టరులను పరిమళద్రవ్యాల (perfumery) తయారి, రంగుల (dye) తయరిలో వాడెదరు. ఈకొవ్వు ఆమ్లాన్ని క్రీమినాశినిగా (disinfectant), ఆల్గే, ఫంగస్ శీలింధ్ర నాశినిగా కూడా ఉపయోగిస్తారు.[8]

కాప్రిక్ ఆమ్లం [మార్చు]

కాప్రిక్ ఆమ్లం నిర్మాణం.

CH3 (CH2) 8COOH

కాప్రిక్ ఆమ్లం (Capric acid) 10 కార్బనులను కలిగి వున్నది[9] .

లక్షణము విలువలమితి
శాస్త్రియనామము డెకనొయిక్ (decanoic) ఆసిడ్.
అణుపార్ములా C10H20O2.
అణుభారము 172.26 గ్రాం.మోల్.
సాంద్రత 893 గ్రాం./లీ
మెల్టింగ్‌పాయింట్ 31.60C
బాయిలింగ్‌పాయింట్ 269.0C

నీటిలో కరగదు. ఘాటైన వాసనతో స్పటిక (crystal) రూపములో వుండును. ఈకొవ్వు ఆమ్లము కొబ్బరి, పామ్ కెర్నల్‌ నూనెలలో 4-8% వరకు, మేకపాలలో 2-4% వరకు లభించును[10]. మిగతా నూనెలలో అంతగా కన్పించదు. ఈమ్ (elm) చెట్టు విత్తననూనెలో40-50% వరకు ఉంది. కాప్రిక్ ఆమ్లాన్ని పరిమళ ద్రవ్యాల (perfumes), కందెనల (lubricants), రంగుల (dyes), రబ్బరు, ప్లాస్టిక్, ఔషదాల (pharmaceuticals) తయారిలో ఉపయోగిస్తారు.

కాప్రిక్‌ ఆమ్లం ఒకకార్బొక్షిలిక్‌ కొవ్వుఆమ్లం. అల్డిహైడులను ఆక్సికరణ (oxidation) చేయడం వలన కార్బొక్షిలిక్‌ ఆమ్లాలను ఉత్పత్తి చెయ్యవచ్చును. అల్డిహైడులు (aldehyde), ప్రైమరి అల్కహల్‌లను ఆక్సికరించడం ద్వారా ఏర్పడును. ప్రైమరి ఆల్కహలులు ప్రైమరి కార్బనుకు ఒకహైడ్రొక్సిల్ (Hydroxyl) రాడికల్‌కు అనుసంధానించడం వలన ఏర్పడును. ఉదాహరణకు ఇథనొల్, బుటనొల్‌లు. కాప్రిక్‌ ఆమ్లాన్ని అసిటొన్ ద్రావణంలో, క్రొమియం ట్రైఅక్సైడ్ (chromium trioxide (CrO3) ను ఆక్సిడెంట్ గా వినియోగించి డెకనొల్‌ (Decanol) అల్కహల్‌ను అక్సికరణనొందించడం వలన కాప్రిక్‌ ఆమ్లం ఏర్పడును. ఇలా ఏర్పడిన కాప్రిక్‌ ఆమ్లం92-94% శుద్ధత కలిగివుండును. కాప్రిక్‌ ఆమ్లాన్ని కలిగివున్న కొవ్వుల కొవ్వుఆమ్లాలను పాక్షిక/అంశీకణ స్వేదనం చెయ్యడం వలన కాప్రిక్‌ ఆమ్లాన్ని ఉత్పత్తి చెయ్యవచ్చును.

లారిక్ ఆమ్లం[మార్చు]

లారిక్ ఆమ్లం నిర్మాణం

CH3 (CH2) 10COOH లారిక్ ఆమ్లం (Lauric acid) 12 కార్బనులను కలిగి వున్న సంతృప్త కొవ్వు ఆమ్లం

లక్షణము విలువలమితి[11].
శాస్త్రీయ నామము డొడెకనొయిక్ ఆసిడ్ (dodecanoic acid).
అణుఫార్ముల C12H24O2
అణుభారము 200.317 గ్రాం./మోల్
సాంద్రత 880గ్రాం./లీ
మెల్టింగ్‌పాయింట్ 43.20C
బాయిలింగ్‌పాయింట్ 298.90C

బేఆయిల్ (bay oil) వాసన కలిగి, తెల్లనిపౌడరు రూపములో వుండును. చాలానూనెలలో, కొవ్వులలో ప్రముఖముగా కన్పించే మూడు సంతృప్త కొవ్వు ఆమ్లములలో లారిక్ ఆమ్లం ఒకటి. మిగతా రెండు పామిటిక్, స్టియరిక్ ఆమ్లాలు. లారెల్ (Laurel) కుటుంబానికి చెందిన విత్తననూనెలలో ఈకొవ్వు ఆమ్లం విస్తృతముగా వుండటం వలన ఈకొవ్వు ఆమ్లానికి లారిక్ ఆమ్లం అనే పేరు వచ్చింది. లారిక్ ఆమ్లం కొబ్బరి, పామ్‌కెర్నల్, బబసు (babassu butter) లో 40-50% వరకు ఉంది. అలాగే పాలలో కూడా 2-8% వరకు లభ్యము. ఆవుపాలలో2.9%, మేకపాలలో3.1% మానవపాలలో6-7% (పాలలోని కొవ్వుశాతములో) ఈకొవ్వు ఆమ్లము ఉంది. లారిక్‌ఆమ్లాన్ని ప్రత్యైక వాసన, రుచి (flavourings) యిచ్చు పదార్థములలో, కొకొబట్టరు, మార్గరిన్, సబ్బులు, శ్యాంపోల తయారిలో వాడెదరు. ప్రత్యైక కందెనలు (lubricants) తయారిలో ఉపయోగించెదరు[12]. లారిక్‌ఆమ్లం అధికమొత్తంలో కొబ్బరినూనె, పామ్‌కెర్నల్‌ నూనెలో వుండును[4]. ఈఆమ్లం లారెల్‌కుటుంబానికి (Laureceae) చెందిన లారెసియవిత్తనంలో (laurus nobilis) ఈ కొవ్వుఆమ్లాన్ని మొదటగా 1849లో మరిస్సొన్‌ట్టి గుర్తించడం వలన లారిక్‌ఆసిడనే పేరువచ్చింది. ఎక్కువకాలం పాడవ్వకుండ నిల్వవుండే గుణంకల్గివున్నది. పామెటిక్‌, స్టియరిక్‌ సంతృప్త ఆమ్లాల తరువాత ఎక్కువగా నూనెలలోవుండు సంతృప్త అమ్లం లారిక్‌ఆసిడ్. దాల్చినచెక్కనూనెలో కూడా 75-80% వరకు లారిక్‌ ఆమ్లం ఉంది. అంబెల్లిఫెర కుటుంబమొక్కలవిత్తననూనెలో కూడా ఈకొవ్వు ఆమ్లం వునికిని గుర్తించడం జరిగింది. కొబ్బరినూనె, పామ్‌కెర్నల్‌నూనెలలో 45-60% వరకు ఉంది. తల్లిపాలలో (5.8%పాలలోని కొవ్వులో), ఆవుపాలలో2.2%, మేకపాలలో4.5% వరకు లారిక్‌ ఆమ్లం ఉంది. బాబాస్సు/జొజొబ (Babassu) బట్టరులో కూడా 40-50% వరకు లారిక్‌ ఆమ్లంవున్నది. పోకచెక్క (Betel nut) లో9.0%, ఖర్జురపునట్‌లో 2-5%, వైల్డ్‌నట్‌మెగ్ (virola surinamensis) లో7-11.5% వున్నది,

మిరిస్టిక్ ఆమ్లం [మార్చు]

మిరిస్టిక్ ఆమ్లం నిర్మాణం.

మిరిస్టిక్ ఆమ్లం (Myristic acid) 14 కార్బనులను కలిగివున్నది.

లక్షణము విలువలమితి
శాస్త్రీయ నామము టెట్రాడెకనొయిక్‌ఆసిడ్ (tetra decanoic acid)
అణుపార్ముల (molecular formula) C14H28O2.
అణుభారము (molecular weight) 228.37గ్రాం./మోల్
సాంద్రత (Density) 862.2 గ్రాం./లీ
మెల్టింగ్‌పాయింట్ (melting point) 54.40C
బాయిలింగ్‌పాయింట్ (boiling point) 250.50C (100mmHg ప్రసరు వద్ద)

మిరిస్టిక ఫ్రాగ్నన్స్ (myristica fragrance) అనబడే జాజికాయ (nutmeg) విత్తననూనెలో దాదాపు 75% వుండటం వలన ఈఆమ్లానికి మిరిస్టిక్ ఆమ్లం అనేపేరు స్దిరపడినది. నట్‌మెగ్ నూనెలో మిరిస్టిక్‌ ఆమ్లం అధికశాతము సింపుల్‌ ట్రైగ్లిసెరైడ్ (trimyristin) గా కన్పిస్తుంది.స్పెర్మ్ తిమింగలము తలనూనెలో మిరిస్టిక్ ఆమ్లం 15% ఉంది.అధికముగా (excess) మిరిస్టిక్ ఆమ్లాన్ని ఆహారములో తీసుకున్నఫ్లాస్మా కొలెస్ట్రాల్‌ పెరిగే ప్రమాదము ఉంది. సంతృప్త కొవ్వు ఆమ్లాలలో మిరిస్టిక్‌ ఆమ్లం మాత్రమే కణమాంసకృత్తుల (cellular proteins) లో అమైడ్‌లింకు ఏర్పరచగలదు. పాలకొవ్వులలో ఈఆమ్లం 8-12% వరకు ఉంది. కొబ్బరి, పామ్‌కెర్నల్‌ నూనెలలోకూడా 1-5% వరకు వుండును[13] . ఈకొవ్వు ఆమ్లంనుండి మిరిస్టెట్ (miristate) అనే ఈస్టరును తయారుచెయ్యుదురు. ఐసోప్రొఫైల్‌ మిరిస్టెట్‌ను సౌందర్యలేపనము (cosmatics) తయారు చెయ్యుటకు ఉపయోగించెదరు[14]. మిరిస్టిక్ ఆమ్లాన్ని క్షయికరణచర్య (reduction) కు గురికావించి మిరిస్టి అల్డిహైడ్ (myristyl aldehyde), మిరిస్టిల్‌ అల్కహల్ (myristyl alcohol) ను ఉత్పన్నం చెయుదురు.

పామిటిక్‌ ఆమ్లం[మార్చు]

పామిటిక్ ఆమ్లం నిర్మాణం.

పామిటిక్‌ ఆమ్లం (Palmitic acid) లో 16 కార్బనులు ఉన్నాయి.

లక్షణము విలువలమితి[15]
శాస్త్రీయనామము హెక్సాడెకనోయిక్‌ ఆసిడ్, (hexadecanoic acid)
అణుపార్ములా C16H32O2.లేదా CH3 (CH2) 14COOH
సాంద్రత 853గ్రాం/లీ 620Cవద్ద
మెల్టింగ్‌పాయింట్ 62.50C
బాయిలింగ్‌పాయింట్ 3520C, (215C-15mm/Hg వద్ద)

పామిటిక్‌ ఆమ్లం తెల్లని స్పటీకములు (crystals) గా వుండును. పామ్‌ ఆయిల్‌లో ఈకొవ్వు ఆమ్లం 45-50% వరకు వుండటంవలన ఈఆమ్లాన్ని పామిటిక్‌ ఆమ్లం అనిపిలిచెదరు. సా.శ.1840లో మొదటగా ఎడ్మండ్ ఫ్రెమి (edmond fremy) ఈఆమ్లాన్ని పామ్‌ ఆయిల్‌లో గుర్తించాడు. అన్నినూనెలలో ఎంతో కొంత శాతము (5-10%) కన్పించే సంతృప్త కొవ్వు ఆమ్లం పామిటిక్‌ ఆమ్లం. కొబ్బరి, పామ్‌కెర్నల్‌ నూనెలలో ఉంది. లార్డ్ (lard), టాలో (tallow), కొకొబట్టరు (cocoa butter) లలో25-45% వరకు ఉంది. సముద్ర జల జీవుల (marine) కొవ్వులలో కూడా అల్పస్దాయిలో పామిటిక్ ఆమ్లాన్ని గుర్తించడం జరిగింది. వేరుశనగ (peanut) ), సోయాబీన్ (soya bean), మొక్కజొన్న (corn) తవుడు (Rice bran) పత్తిగింజల (cotton seed) నూనెలలో10-20% వరకు ఈకొవ్వు ఆమ్లం ఉంది. లిపొజెనెసిస్ (lipogenesis) అనగా కొవ్వు ఆమ్లముల ఉత్పన్నసమయములో మొదట పామిటిక్ ఆమ్లం ఏర్పడి, దానినుండి పొడవైన హైడ్రొకార్బనుగొలుసు (long chained hydrocarbons) వున్నకొవ్వు ఆమ్లాలు 'మలోనిల్్‌కొ ఎంజైమ్' (malonyl-CoA) చర్య వలన తయారగును[16] . జీవొత్పత్తి (biosynthesis) సమయములో అసెటైల్ కొ ఎంజైమ్ ( acetyl-CoA) నుండి ఉత్పత్తి అయిన మలోనిల్ కొ ఎంజైమ్ కొవ్వు ఆమ్లముల హైడ్రొకార్బను గొలుసు (hydrocarbonchain) కు మిధైలెట్ (CH2) గ్రూపును చేర్చి కొవ్వు ఆమ్లముల ఛైన్‌పొడవును పెంచును. పామిటిక్‌ ఆమ్లాన్ని క్షయికరించిన సెటైల్‌ అల్కహల్ (cetyl alchol) ఏర్పడును. పామిటిక్‌ ఆమ్లలవణములను (salts), ఈస్టరులను పామిటెట్స్ (palmitates) అంటారు. లిపొజెనెసిస్ చర్యలో ఎసెటైల్ కొ-ఎంజైమ్‌ A (acetyl CoA) వలన ఏర్పడు మొదటికొవ్వు ఆమ్లం పామిటిక్ ఆమ్లం. ఆతరువాత అసెటైల్ కో-ఎంజైమ్‌A రెండుకార్బను సమూహలను (carbon groups) లను చేర్చుతూ పోవడంవలన మిగతా కొవ్వుఆమ్లాలు ఏర్పడును. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తన పరిశోధన నివేదికలో పామిటిక్‌ ఆమ్లంవున్న నూనెలను అధికంగా తీసుకోవడంవలన హృదయ సంబంధిత (cardiovascular) వ్యాదులకు త్వరగాగురై ఆవకాశమున్నదని చెప్పింది. కాని మరికొందరుచేసిన పరిశోధన సమాచారం ప్రకారం లినొలిక్ ఆమ్లంతో పాటు (పామిటిక్ ఆమ్లం% కన్న లినొలిక్‌ ఆమ్లం 4.5% ఎక్కువగా వుండాలి) తీసుకున్న ప్రమాదం అంతగాలేదని తెల్చాయి.

స్టియరిక్ ఆమ్లం[మార్చు]

స్టియరిక్ ఆమ్లం నిర్మాణం.

స్టియరిక్ ఆమ్లం (Stearic acid) 18 కార్బనులను కలిగి, పొడవైన శృంఖలం కలిగివున్న సంతృప్త కొవ్వు ఆమ్లం.[17]

లక్షణము విలువల మితి[18]
శాస్త్రీయ నామము అక్టడెకనొయిక్‌ ఆసిడ్ (octadecanoic)
అణుపార్ముల C18H36O2, లేదా CH3 (CH2) 16COOH
అణుభారము 284.48 గ్రాం/మోల్
సాంద్రత 847గ్రాం/లీ (700Cవద్ద)
మెల్టింగ్‌పాయింట్ 69.60C
బాయిలింగ్‌పాయింట్ 3830 C

గ్రీకులో స్టియరో అనగా టాలో (tallow) అని అర్దము. దీనిని మొదటగా టాలోలో గుర్తించడం వలన స్టియరిక్‌ ఆమ్లం ఆనేపేరు స్దిరపడినది[19] . స్టియరిక్ ఆమ్లం మైనము (wax) లాంటి ఘన (solid ) రూపంలో వుండును. స్టియరిక్‌ ఆమ్లం కూడా పలునూనెలలో జంతుకొవ్వు (animal fat) లలో తప్పనిసరిగా వుండు కొవ్వు ఆమ్లం. శాకనూనెలలో (vegetable oils) 1-5% ఉంది. కొకొ (cocoa), షీయా (shea) బట్టరు కొవ్వులలో 28-45% వరకు ఉంది. 18 కార్బనులను కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలను పూర్తిగా హైడ్రొజనెసన్ (Total hydrogenation) చేసినప్పుడు అవి స్టియరిక్ ఆమ్లంగా మార్పుచెందును. స్టియరిక్‌ ఆమ్లాన్ని కొవ్వొత్తులు (candles), సబ్బులు, ప్లాస్టికులు, సౌందర్య లేపనము (cosmetics) లు, షీవింగ్‌ క్రీములు తయారుచెయ్యుటకు ఉపయోగిస్తారు. బాణాసంచ (fire works) తయారిలోవాడు అల్యుమినియం, ఐరన్‌ లోహాలు ఆక్షీకరణ చెందకుండ ఎక్కువకాలము నిల్వవుండుటకై పైపూతగా స్టియరిక్‌ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు. ప్లాస్టరు కాస్టింగ్‌లో స్టియరిక్‌ ఆమ్లాన్ని పార్టింగ్‌ కాంపౌండ్ (parting com pound) గా వాడెదరు. ఇంజెక్షను మౌల్డింగ్‌లో (injection moulding), సెరమిక్‌ పౌడరును (ceramic powder) ను ప్రెస్సింగ్ చెయ్యుటకు స్టియరిక్‌ ఆమ్లాన్ని లూబ్రికెంట్‌/కందెనగా వాడెదరు. అలాగే మిఠాయి (candy, చాకోలెట్‌ల తయారిలో కూడా స్టియరిక్‌ ఆమ్లాలను ఉపయోగిస్తారు[20].

జంతు కొవ్వులలో స్టియరిక్‌ ఆమ్లం ట్రైస్టియరిన్‌గా వుండును. అందుచే జంతుకొవ్వులను 'హైడ్రొలిసిస్' చెయ్యడం వలన స్టియరిన్‌ ఆమ్లం ఉత్పత్తి అగును. అయితే ఇందులో అల్పప్రమాణంలో ఇతర కొవ్వుఆమ్లాలు వుండును. స్టియరిక్‌ ఆమ్లం అధికశాతంలో కలిగివున్న శాకకొవ్వుల నూనెలోని కొవ్వుఆమ్లాలను, హైడ్రొలిసిస్ ద్వారా కొవ్వు ఆమ్లాలుగా విడగొట్టి, కొవ్వుఆమ్లాలను అంశిక స్వేదనం (fractional distillation) చెయ్యడం ద్వారా స్టియరిక్‌ ఆమ్లాన్ని ఉత్పత్తి చెయ్యవచ్చును. నూనెలోని కొవ్వుఆమ్లాల కార్బనుల సంఖ్య తేడా 2 గా వుండటం వలన వాటిమరుగు ఊష్ణోగ్రత లో తేడా తగినంతగా వుండటం వలన అంశీక స్వేదనం వలన వేరు చెయ్యవచ్చును. సులభంగా స్టియరిక్‌ ఆమ్లాన్ని తయారుచేయు మరో పద్థతి 'ఉదజనీకరణ' (hydrogenation). ఒలిక్‌ ఆమ్లమును సంపూర్ణ ఉదజనీకరణ (Total hydrogenation) చేయడం వలన ఒలిక్‌ ఆమ్లంలోని ద్విబంధం, హైడ్రొజను సంయోగం వలన తొలగింపబడును. శుద్ధీచేసిన ఒలిక్‌ ఆమ్లంకు, నికెల్‌ కెటలిస్ట్ సమక్షంలో, వత్తిడిలో హైడ్రొజను కలిపిన, ఉదజనికరణ జరిగి ఒలిక్‌ ఆమ్లం స్టియరిక్‌ అమ్లంగా మారును. పారిశ్రామిక రంగంలో వంటకు వుపయుక్తం కాని శాకనూనెలను నూనెలను ఉదజనీకరణ చేసి తయారైన ఉదజనికృత కొవ్వు (hydrogenated fat) ను స్టియరిక్‌ ఆమ్లం పేరుతో అమ్మకం చేస్తారు. ఉదజనీకరణ వలన ఏర్పడిన స్టియరిక్‌ ఆమ్లం తెల్లగా, గట్టిగా ముద్దగా వుండును. దీనిని పౌడరుగా, లేదా ఫ్లేక్స్‌గా చేసి బస్తాలలో నింపెదరు.

అరచిడిక్ ఆమ్లం[మార్చు]

అరచిడిక్ ఆమ్లం నిర్మాణం.

అరచిడిక్ ఆమ్లం (Arachidic acid) 20 కార్బనులను కలిగివున్నది.పొడవైన హైడ్రోకార్బను గొలుసును కలిగిన సంతృప్తకొవ్వు ఆమ్లం.

లక్షణము విలువల మితి[21]
శాస్త్రీయనామము ఎయ్‌కొసనొయిక్ ఆసిడ్ (eicosanoic acid)
అణుపార్ములా C20H40O2లేదాCH3 (CH2) 18COOH
అణుభారము 304.47గ్రాం/మోల్
ద్రవీభవన ఉష్ణోగ్రత 75.40C
సాంద్రత 0.922

ఈ కొవ్వు అమ్లము అపరాల (legumes) కు చెందిన నూనెలలో కన్పించును. వేరుశెనగ నూనెలో1-2% వరకు వున్నది[22] .సహాజంగా చేపనూనెలో లభిస్తుంది.ఈ కొవ్వుఆమ్లాన్ని సౌందర్యద్రవ్యాలు, సబ్బులు, మందులతయారిలో ఉపయోగిస్తారు.[23]

బెహెనిక్ ఆమ్లం[మార్చు]

బెహెనిక్ ఆమ్లం 22 కార్బనులుండి పొడవైన హైడ్రొకార్బను గొలుసును కలిగివున్న సంతృప్త కొవ్వుఆమ్లం. సరళమైన, శాఖలులేని శృంఖలంనుకలివున్న కొవ్వు ఆమ్లం. బెహెనిక్‌ ఆమ్లం శాకనూనెలలో తక్కువప్రమాణంలో వున్నఆమ్లం. శాస్త్రీయ నామం: n-డొకసనొయిక్‌ ఆమ్లం. ఫార్ములా C21H43COOH. తెల్లగా లేదా క్రీమ్‌రంగులో స్పటికరూపంలో వుండును. మొరింగేసి కుటుంబానికి చెందిన బెన్ లేదా బెహెన్ (Moringo oleifera) అనగా మునగ విత్తననూనెలో మొదటగా గుర్తించారు. అందుచే ఈఅమ్లానికి బెహెనిక్‌ అనేపేరు రూడి అయ్యింది. బెన్ విత్తననూనెలో కాకుండగా వేరుశెనగ నూనె, ఆవాల నూనె (mastard or canola) లో అతికొద్దిశాతంలో కన్పించును. ఈనూనెలలో 1-2% వరకు మాత్రమే ఉంది. వేరుశనగ విత్తనం పైపోరలో బెహెనిక్‌ ఆమ్లం ఎక్కువగా నిక్షిప్తమైవున్నది.. బెహెనిక్ ఆమ్లం యాంటిఅక్క్షిడెంట్‌ గుణాలను కలిగివున్నది. అయితే బెహనిక్‌ ఆమ్లానికి కొలెస్ట్రాల్‌ను పెంచుగుణం కూడా ఉంది. బెహెనిక్‌ ఆమ్లం జీర్ణవ్యవస్దలో అంతత్వరగా శోషింపబడదు. బెహెనిక్‌ అమ్లాన్ని క్షయికరించిన (reduction) బెహెనిక్‌ అల్కహాల్‌ ఏర్పడును.

బెహెనిక్ ఆమ్లం నిర్మాణం.
లక్షణము విలువల మితి[24]
శాస్త్రీయనామము డొకసనొయిక్‌ఆసిడ్ ( docosanoic acid)
మోలిక్యులర్‌పార్ముల C22H44O2 లేదా CH3 (CH2) 20COOH
అణుభారము 340.58 గ్రాం/మోల్
ద్రవీభవన ఉష్ణోగ్రత 800C
మరుగు ఉష్ణోగ్రత 3060C

తెల్లగా లేదా క్రీమ్‌ రంగులో స్పటికరూపములో లేదా పౌడరు రూపములో వుండును. ఈకొవ్వు ఆమ్లాన్ని మొదటగా బెహెన్‌ ట్రీ (moringo oleifera) (మునగ) ఆయిల్‌లో గుర్తించారు. వేరుశనగ, ఆవాలు (mustard) నునెలో 1-2% వరకు గుర్తించారు. బెహెనిక్‌ అమ్లాన్ని హెయిర్‌ కండిషనరులలో ఉపయోగిస్తారు[25].

లిగ్నోసెరిక్ ఆమ్లం[మార్చు]

లిగ్నోసెరిక్ ఆమ్లం నిర్మాణం.

లిగ్నోసెరిక్ ఆమ్లం (Lignoceric acid) 24 కార్బనులను కలిగివున్న కొవ్వు ఆమ్లం.సంతృప్త కొవ్వుఆమ్లాలలో అతిపొడవైన కర్బనపు-ఉదజని గొలుసుకలిగిన కొవ్వుఆమ్లం.

లక్షణము విలువల మితి[26]
శాస్త్రీయనామం టెట్రకొసనొయిక్‌ఆసిడ్.
ఆణుఫార్ములా C23H47COOH
అణుభారం 368.63
ద్రవీభవన ఉష్ణోగ్రత 80- 820C
మరుగు (boiling) ఉష్ణోగ్రత 2720C (10 mm/pr)

వేరుశనగ నూనెలో1.1-2.2% వరకు వుండును. లిగ్నిన్‌ను తయారుచెయ్యునప్పుడు ఉపఉత్పత్తిగా, లిగ్నొసెరిక్‌ ఆమ్లం ఏర్పడును[27]. అల్కహలసిస్‌ ద్వారా లిగ్నొసెరిల్ అల్కహల్ తయారుచేయుదురు.

సంతృప్త కొవ్వు ఆమ్లాల జాబితా[మార్చు]

Common Name Systematic Name Structural Formula Lipid Numbers
Propionic acid Propanoic acid CH3CH2COOH C3:0
Butyric acid Butanoic acid CH3 (CH2) 2COOH C4:0
Valeric acid Pentanoic acid CH3 (CH2) 3COOH C5:0
కాప్రోయిక్ ఆమ్లం Hexanoic acid CH3 (CH2) 4COOH C6:0
Enanthic acid Heptanoic acid CH3 (CH2) 5) COOH C7:0
కాప్రిలిక్ ఆమ్లం Octanoic acid CH3 (CH2) 6COOH C8:0
Pelargonic acid Nonanoic acid CH3 (CH2) 7COOH C9:0
కాప్రిక్ ఆమ్లం Decanoic acid CH3 (CH2) 8COOH C10:0
Undecylic acid Undecanoic acid CH3 (CH2) 9COOH C11:0
లారిక్ ఆమ్లం Dodecanoic acid CH3 (CH2) 10COOH C12:0
Tridecylic acid Tridecanoic acid CH3 (CH2) 11COOH C13:0
మిరిస్టిక్ ఆమ్లం Tetradecanoic acid CH3 (CH2) 12COOH C14:0
Pentadecylic acid Pentadecanoic acid CH3 (CH2) 13COOH C15:0
పామిటిక్ ఆమ్లం Hexadecanoic acid CH3 (CH2) 14COOH C16:0
Margaric acid Heptadecanoic acid CH3 (CH2) 15COOH C17:0
స్టియరిక్ ఆమ్లం Octadecanoic acid CH3 (CH2) 16COOH C18:0
Nonadecylic acid Nonadecanoic acid CH3 (CH2) 17COOH C19:0
Arachidic acid Eicosanoic acid CH3 (CH2) 18COOH C20:0
Heneicosylic acid Heneicosanoic acid CH3 (CH2) 19COOH C21:0
బెహెనిక్ ఆమ్లం Docosanoic acid CH3 (CH2) 20COOH C22:0
Tricosylic acid Tricosanoic acid CH3 (CH2) 21COOH C23:0
లిగ్నోసెరిక్ ఆమ్లం Tetracosanoic acid CH3 (CH2) 22COOH C24:0
Pentacosylic acid Pentacosanoic acid CH3 (CH2) 23COOH C25:0
Cerotic acid Hexacosanoic acid CH3 (CH2) 24COOH C26:0
Heptacosylic acid Heptacosanoic acid CH3 (CH2) 25COOH C27:0
Montanic acid Octacosanoic acid CH3 (CH2) 26COOH C28:0
Nonacosylic acid Nonacosanoic acid CH3 (CH2) 27COOH C29:0
Melissic acid Triacontanoic acid CH3 (CH2) 28COOH C30:0
Henatriacontylic acid Henatriacontanoic acid CH3 (CH2) 29COOH C31:0
Lacceroic acid Dotriacontanoic acid CH3 (CH2) 30COOH C32:0
Psyllic acid Tritriacontanoic acid CH3 (CH2) 31COOH C33:0
Geddic acid Tetratriacontanoic acid CH3 (CH2) 32COOH C34:0
Ceroplastic acid Pentatriacontanoic acid CH3 (CH2) 33COOH C35:0
Hexatriacontylic acid Hexatriacontanoic acid CH3 (CH2) 34COOH C36:0

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-07-21. Retrieved 2013-10-26.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-10-28. Retrieved 2013-10-26.
  3. http://www.eastman.com/Products/Pages/ProductHome.aspx?Product=71069848&list=Chemicals
  4. http://pubchem.ncbi.nlm.nih.gov/summary/summary.cgi?cid=8892
  5. http://www.thefreedictionary.com/caproic+acid
  6. http://www.chemspider.com/Chemical-Structure.370.html
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-10-19. Retrieved 2013-10-26.
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-03. Retrieved 2013-10-26.
  9. http://www.chemicalbook.com/ChemicalProductProperty_EN_CB1669961.htm
  10. http://www.britannica.com/EBchecked/topic/94178/capric-acid
  11. http://www.chemicalbook.com/ChemicalProductProperty_EN_CB0357278.htm
  12. http://www.webmd.com/vitamins-supplements/ingredientmono-1138-LAURIC%20ACID. aspx?activeIngredientId=1138&activeIngredientName=LAURIC%20ACID
  13. http://pubchem.ncbi.nlm.nih.gov/summary/summary.cgi?cid=11005
  14. http://www.thefreedictionary.com/myristic+acid
  15. http://www.sigmaaldrich.com/catalog/product/sigma/p0500?lang=en&region=IN
  16. http://www.sigmaaldrich.com/life-science/cell-culture/learning-center/media-expert/palmitic-acid.html
  17. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-05-27. Retrieved 2013-10-26.
  18. http://www.chemicalland21.com/lifescience/foco/STEARIC%20ACID.htm
  19. http://www.scienceofcooking.com/stearic_acid.htm
  20. http://www.wisegeek.com/what-are-the-different-uses-of-stearic-acid.htm
  21. http://www.sigmaaldrich.com/etc/medialib/docs/Sigma/Product_Information_Sheet/a9673pis.Par.0001.File.tmp/a9673pis.pdf[permanent dead link]
  22. http://www.merriam-webster.com/medical/arachidic%20acid
  23. https://www.caymanchem.com/app/template/Product.vm/catalog/9000339
  24. http://www.chemicalland21.com/lifescience/foco/BEHENIC%20ACID.htm
  25. https://www.caymanchem.com/app/template/Product.vm/catalog/9000338
  26. http://www.chemicalbook.com/ChemicalProductProperty_EN_CB9333161.htm
  27. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2013-10-26.
  • 1. A. E. Bailey's 'industrial oil & fat products