Jump to content

కాప్రిక్ ఆమ్లం

వికీపీడియా నుండి
కాప్రిక్ ఆమ్లం (డెకనోయిక్ ఆమ్లం)
Skeletal formula
Ball-and-stick model
పేర్లు
IUPAC నామము
Decanoic acid
ఇతర పేర్లు
Capric acid[1]
n-Capric acid
n-Decanoic acid
Decylic acid
n-Decylic acid
C10:0 (Lipid numbers)
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [334-48-5]
పబ్ కెమ్ 2969
డ్రగ్ బ్యాంకు DB03838
కెగ్ C01571
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:30813
SMILES O=C(O)CCCCCCCCC
  • InChI=1/C10H20O2/c1-2-3-4-5-6-7-8-9-10(11)12/h2-9H2,1H3,(H,11,12)

ధర్మములు
C10H20O2
మోలార్ ద్రవ్యరాశి 172.26 g/mol
స్వరూపం White crystals with strong smell
సాంద్రత 0.893 g/cm3, ?
ద్రవీభవన స్థానం 31.6 °C (304.8 K) [2]
బాష్పీభవన స్థానం 269 °C (542 K)
immiscible
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు Medium toxicity
May cause respiratory irritation
May be toxic on ingestion
May be toxic on skin contact
R-పదబంధాలు R36 R38
S-పదబంధాలు మూస:S24 మూస:S25 S26 S36 S37 మూస:S39
సంబంధిత సమ్మేళనాలు
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

కాప్రిక్ ఆమ్లం (Decanoic acid, or capric acid) ఒక సంతృప్త కొవ్వు ఆమ్లం. దీని రసాయన ఫార్ములా : CH3 (CH2) 8COOH. ఈ ఆమ్లపు లవణాలు, ఎస్టర్లను డెకనేట్లు (decanoates) అంటారు. కాప్రిక్ అనే పదం లాటిన్లో మేక అర్ధాన్నిస్తుంది. వీనికి మేకపాల వాసన మూలంగా ఈ పేరు వచ్చింది.[3]

కాప్రిక్ ఆమ్లం కొబ్బరి నూనె, పామ్ కెర్నెల్ నూనె, వివిధ జంతువుల పాలలో ఉంటుంది.[2]

దీనిని పెర్ఫ్యూమ్స్, కందెన, రబ్బరు, రంజకాలు, ప్లాస్టిక్, మందులు మొదలైన వాటి తయారీలో ఉపయోగిస్తారు.[4]

మేక పేరున్న రెండు ఇతరఆమ్లాలు: కాప్రోయిక్ ఆమ్లం, కాప్రిలిక్ ఆమ్లం. ఈమూడు కొవ్వు ఆమ్లాలు కలిపి మేకపాలలో 15 శాతంవరకు ఉంటాయి.

కాప్రిక్‌ ఆమ్లం

[మార్చు]

కాప్రిక్‌ ఆమ్లం సంతృప్త కొవ్వు ఆమ్లం. 10 కార్బనులున్న ద్విబంధాలులేని, మధ్యస్తపొడవైన హైడ్రొకార్బను శృంఖలమువున్న మోనోకార్బక్షిలిక్‌ ఆమ్లం. కొన్నిజంతు పాలకొవ్వులలో,, శాకగింజల నూనెలలో కాప్రిక్‌ ఆమ్లం కన్పించును. మొక్కలు పెరుగుతున్నప్పుడు, కణనిర్మాణ సమయంలో, ఎదుగుదలకు అవసరమైన శక్తిని అందించుటకు కొవ్వు ఆమ్లాలు తొడ్పడుతాయి. మొక్క ఎదుగుదల సమయంలో కాప్రిక్ అమ్లం అవసరంఅంతగా లేదో, లేక ఎదుగుదల సమయంలో మొక్కలు లిపొసెస్ వలన గ్లైకొల్‌ నుండి కాప్రిక్‌ ఆమ్లాన్ని తయారుచేసుకుంటాయా? అన్నది ఇంకను నిర్ధారణ కాలేదు. కొవ్వుల నుండి వేరుచేసిన కాప్రిక్‌ ఆమ్లం తెల్లని స్పటికరూపంలో ఘనరూపంలో వుండును. 400C మించి వేడిచేసిన పారదర్శకంగా మారును. అల్కహల్‌, ఈథరు, బెంజెన్, క్లొరోఫారం, ఇతర హైడ్రొకార్బను ద్రావణులలో కరుగును.

లభ్యం

[మార్చు]

ఆవు, మేక పాలకొవ్వులలో, కొబ్బరినూనె,, పామ్‌ కెర్నల్‌ నూనెలలో లభించును. ఇతర నూనెలలో అంతగా కన్పించదు.

భౌతిక రసాయనిక ధర్మాలు

[మార్చు]

కాప్రిక్‌ ఆమ్లం భౌతిక రసాయనిక ధర్మాల పట్టిక

భౌతిక, రసాయనిక దర్మం విలువల మితి
అణుఫార్ములా CH3 (CH2) 8COOH
అణుభారం 172.27 గ్రాం.మోల్.
సాంద్రత (350C 0.8884
వక్రీభవన సూచిక (400C) 1.4288
ద్రవీభవన ఉష్ణోగ్రత 320C
మరుగు ఉష్ణోగ్రత 2700C ( at760mm/Hg Pr.)
మరుగు ఉష్ణోగ్రత 1520C (at 10mm/Hg Pr.)
స్నిగ్థత mPa.s (700C) 2.88
విశిష్ణ ఉష్ణోగ్రత (35/650ఛ్) 2.09
వెలుగుఉష్ణోగ్రత (Flash point) >1000C
వెపరుసాంద్రత 5.9 (గాలి=1)

ఉత్పత్తి

[మార్చు]
  • కాప్రిక్‌ ఆమ్లం ఒకకార్బొక్షిలిక్‌ కొవ్వుఆమ్లం. అల్డిహైడులను ఆక్సికరణ (oxidation) చేయడం వలన కార్బొక్షిలిక్‌ ఆమ్లాలను ఉత్పత్తి చెయ్యవచ్చును. అల్డిహైడులు (aldehyde), ప్రైమరి అల్కహల్‌లను ఆక్సికరించడం ద్వారా ఏర్పడును. ప్రైమరి ఆల్కహలులు ప్రైమరి కార్బనుకు ఒకహైడ్రొక్సిల్ (Hydroxyl) రాడికల్‌కు అనుసంధానించడం వలన ఏర్పడును. ఉదాహరణకు ఇథనొల్, బుటనొల్‌లు. కాప్రిక్‌ ఆమ్లాన్ని అసిటొన్ ద్రావణంలో, క్రొమియం ట్రైఅక్సైడ్ (chromium trioxide (CrO3) ను ఆక్సిడెంట్ గా వినియోగించి డెకనొల్‌ (Decanol) అల్కహల్‌ను అక్సికరణనొందించడం వలన కాప్రిక్‌ ఆమ్లం ఏర్పడును. ఇలా ఏర్పడిన కాప్రిక్‌ ఆమ్లం92-94% శుద్ధత కలిగివుండును.
  • కాప్రిక్‌ ఆమ్లాన్ని కలిగివున్న కొవ్వుల కొవ్వుఆమ్లాలను పాక్షిక/అంశీకణ స్వేదనం చెయ్యడం వలన కాప్రిక్‌ ఆమ్లాన్ని ఉత్పత్తి చెయ్యవచ్చును.

ఉపయోగాలు

[మార్చు]
  • కాప్రిక్‌ ఆమ్లం మితమైన పొడవున్న హైడ్రొకార్బను గొలుసును కలిగివుండటం వలన, జీర్ణ వ్యవస్దలో త్వరగా విచ్ఛిన్నం చెందును. అందుచే త్వరగా శోషింపబడును.
  • కాప్రిక్‌ ఆమ్లం యాంటి వైరల్‌, యాంటి మైక్రిబైయల్‌ గుణాలు కల్గివున్నది. కాప్రిక్‌ ఆమ్లం దేహంలో మోనొకాప్రిక్‌గా మారును. మోనొకాప్రిక్‌ దేహంలో వైరస్, బాక్టిరియా, యీస్ట్ కాన్డిడా అల్‌బికస్‌ను నియంత్రించును.
  • '1998 అమెరికన్‌ జొర్నల్ ఆఫ్‌ క్లినిక్‌ న్యూట్రిసన్' పరిశోధన సమాచారం ప్రకారం కాప్రిక్‌ ఆమ్లం అధికసాంద్రత లిపోప్రోటిన్సు (high density lipo proteins) (cholesterol) పెరుగుదలకు తొడ్పడును.
  • కాప్రిక్‌ ఆమ్లం రక్తంలోని ఇన్సులిన్‌ను అదుపులో వుంచును.
  • కాప్రిక్‌ అమ్లాన్ని గ్రీజులు, కందెనలు, ప్లాస్టికులు, రబ్బరులు, పరిమళ ద్రవ్యాల తయారిలోకూడా వినియోగిస్తారు.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-07-16. Retrieved 2020-10-22.
  2. 2.0 2.1 "Lexicon of lipid nutrition (IUPAC Technical Report)". Pure and Applied Chemistry. 73 (4): 685–744. 2001. doi:10.1351/pac200173040685.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-09-05. Retrieved 2011-09-17.
  4. http://www.chemicalland21.com/industrialchem/organic/CAPRIC%20ACID.htm