లినోలినిక్ ఆమ్లం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
α-లినోలినిక్ ఆమ్లం
ALAnumbering.svg
Linolenic-acid-3D-vdW.png
పేర్లు
IUPAC నామము
(9Z,12Z,15Z)-9,12,15-Octadecatrienoic acid
ఇతర పేర్లు
ALA; Linolenic acid; cis,cis,cis-9,12,15-Octadecatrienoic acid; (9Z,12Z,15Z)-octadeca-9,12,15-trienoic acid;[1] Industrene 120
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [463-40-1]
పబ్ కెమ్ 5280934
డ్రగ్ బ్యాంకు DB00132
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:27432
SMILES O=C(O)CCCCCCC\C=C/C\C=C/C\C=C/CC
ధర్మములు
C18H30O2
మోలార్ ద్రవ్యరాశి 278.44 g·mol−1
ద్రవీభవన స్థానం -11°C
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
YesY verify (what is YesYN ?)
Infobox references

లినోలినిక్ ఆమ్లం (Linolenic acid) ఒక కొవ్వు ఆమ్లం.ఇదిఒక మోనో కార్బోక్సిలిక్ ఆమ్లం.ఒకటికన్న ఎక్కువగా ద్విబంధమున్న కొవ్వుఆమ్లం.దీనిని బహుద్విబంధయుత అసంతృప్త కొవ్వుఆమ్లం అంటారు (poly unsaturated fatty acid=PUFA).క్లుప్తంగా ఫ్యూఫా (PUFA) అందురు. దీనిని ఆల్ఫా-లినోలినిక్ ఆమ్లం అనికూడా అంటారు.లినోలినిక్ ఆమ్లం మొక్కల నూనెగింజలలోను మరియు జల జీవుల (marine animals) కొవ్వులలో మరియు నూనెలలో లభ్యమగును.లిలోలినిక్ ఆమ్లం ఒక ఆవశ్యక కొవ్వు ఆమ్లం.లినోలినిక్ ఆమ్లాన్నీలినొలినిక్ ఆమ్లమని కూడా ఉచ్చరించెదరు [2].

లినోలినిక్ ఆమ్ల చరిత్ర[మార్చు]

లినోలినిక్ కొవ్వుఆమ్లం యొక్క ఉనికిని మొదటగా 1942 లో గుర్తించారు. ఇది చీయా (Chia), ఫ్లాక్సు/అవిసె (Flax/linseed), కనోలా (canola, హేంప్ (Hemp) మొక్కల గింజలలో లభ్యమవుతుంది [3]. దీనిని రోల్లెట్ట్ (Rollett) మొదటిగా 1942లో గుర్తించినట్లు తెలుస్తున్నది[4]

లినోలినిక్ ఆమ్లం యొక్క నిర్మాణ ,సౌష్టవ వివరాలు[మార్చు]

లినొలినిక్ ఆమ్లం 18 కార్బనులను కలిగి, మూడు ద్విబంధాలను కలిగివున్న అసంతృప్త కొవ్వుఆమ్లం. లినొలినిక్ కొవ్వుఆమ్లం రంగులేని ద్రవరూపంలో వుండును. లినోలినిక్ కొవ్వు ఆమ్లాన్ని α- లినోలినిక్ ఆమ్లమనియు, ఒమేగా-3 కొవ్వుఆమ్లమనియు కూడా పిలుస్తారు.ఈ పేర్లన్నియు సాధారణ పేర్లు.లినొలినిక్ కొవ్వుఆమ్లం యొక్క శాస్త్రీయ పేరు సిస్.సిస్, సిస్, -9,12,15-ఆక్టాడెసిట్రైయినోయిక్ ఆమ్లం ( 9,12,15-octadecatrienoic acid).లినొలినిక్ ఆమ్లం మూడు ద్విబంధాలను వరుసగా 9,12,15 కార్బనులవద్ద (COOHసమూహం వైపునుండి లెక్కించిన) కలిగివుండును.లినొలినిక్ ఆమ్లం యొక్క మిథైల్ (CH3) సమూహం నుండి లెక్కించిన వరుసగా 3,6,9 కార్బనులవద్ద ద్వింధాలున్నట్లు కనిపిస్తుంది.మిథైల్ సమూహంనుండి లెక్కించినప్పుడు మొదటి ద్వింబంధం 3 వకార్బను వద్ద వుండటం వలన దీనిని ఒమేగా-3 కొవ్వుఆమ్లమని పిలుస్తారు.దీని సాధారణ ఎంఫిరికల్ ఫార్ములా: C17H29COOH.ఎక్కువ ద్విబంధాలను కలిగివుండటం వలన సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఈ ఆమ్లం ద్రవరూపంలో వుండును. జీవచర్యలో లినోలిక్ ఆమ్లం నుండి ఏర్పడు గామా లినొలినిక్ ఆమ్లం ఆల్ఫా లినొలినిక్ ఆమ్లం యొక్క ఐసోమరు రూపం.

లినోలినిక్ ఆమ్లంయొక్క రసాయనిక, భౌతిక ధర్మాల పట్టిక [5]

గుణము విలువల మితి
రూపం పారదర్శకమైన పసుపు వర్ణం
అణుభారం 278.43
కరుగు (ద్రవీభవన) ఉష్ణోగ్రత -11°C
భాష్ఫీభవన ఉష్ణోగ్రత 230°C/1 మి.మీ/పాదరసం పీడనం వద్ద
విశిష్ట గురుత్వం 0.91.092
వక్రీభవన సూచిక 1.479-1.481
నీటిలోకరుగుదల లేదు

లినోలిక్ ఆమ్లాన్నికలిగిన కొన్ని నూనెల జాబితా[మార్చు]

Common name Alternate name Linnaean name % ALA ref.
Chia chia sage Salvia hispanica 64% [6]
Kiwifruit seeds Chinese gooseberry Actinidia chinensis 62% [6]
Perilla shiso Perilla frutescens 58% [6]
Flax linseed Linum usitatissimum 55% [6]
Lingonberry cowberry Vaccinium vitis-idaea 49% [6]
Camelina camelina Camelina sativa 35-45%
Purslane portulaca Portulaca oleracea 35% [6]
Sea buckthorn seaberry Hippophae rhamnoides L. 32% [7]
Hemp cannabis Cannabis sativa 20% [6]
ఆవ నూనె canola Brassica napus 10%
సోయా నూనె సోయా Glycine max 8%
  average val

లినోలినిక్ ఆమ్లం ఉపయోగాలు[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

  1. http://www.chemicalland21.com/lifescience/foco/alpha-LINOLENIC%20ACID.htm

మూలాలు[మార్చు]

  1. Loreau, O; Maret, A; Poullain, D; Chardigny, JM; Sébédio, JL; Beaufrère, B; Noël, JP (2000). "Large-scale preparation of (9Z,12E)-1-(13)C-octadeca-9,12-dienoic acid, (9Z,12Z,15E)-1-(13)C-octadeca-9,12,15-trienoic acid and their 1-(13)C all-cis isomers". Chemistry and physics of lipids. 106 (1): 65–78. doi:10.1016/S0009-3084(00)00137-7. PMID 10878236.
  2. "linolenic acid". thefreedictionary.com. Retrieved 2013-11-23.
  3. "What Is Alpha-Linolenic Acid?". wisegeek.com/. Retrieved 2013-11-22.
  4. Rollett, A. (1909). "Zur kenntnis der linolensäure und des leinöls". Z. Physiol. Chem. 62 (5–6): 422. doi:10.1515/bchm2.1909.62.5-6.422.
  5. "alpha-LINOLENIC ACID". chemicalland21.com. Retrieved 2013-11-23.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 6.5 6.6 Seed Oil Fatty Acids – SOFA Database Retrieval
  7. Li, Thomas S. C. (1999). "Sea buckthorn: New crop opportunity". Perspectives on new crops and new uses. Alexandria, VA: ASHS Press. pp. 335–337. Archived from the original on 22 September 2006. Retrieved 2006-10-28.