Jump to content

లారోలిక్ ఆమ్లం

వికీపీడియా నుండి

లారోలిక్ ఆమ్లం అనునది 12 కార్బనులను కలిగివున్న ఒక అసంతృప్త కొవ్వు ఆమ్లం.కొవ్వు ఆమ్లంలు అన్నియు మోనోకార్బోక్సిలిక్ ఆమ్లాలు.[1] కొవ్వుఆమ్లంలో కార్బను, హైడ్రోజన్, ఆక్సిజన్ పరమాణువులు ఒకదానితో నొకటి బంధాలేర్పరచుకొని పొడవైన గొలుసు/శృంఖలం వలె ఏర్పడి వుండును. ఈ హైడ్రో కార్బన్ పరమాణు సంకెల ఒక చివర ఒక కార్బోక్సిల్ (COOH) సమూహం అనుసంధానింప బడివుండటం వలన వీటిని మోనోకార్బీక్సిలిక్ ఆమ్లంలని అంటారు.హైడ్రోకార్బన్ గొలుసులోని కార్బన్-కార్బన్ మధ్య వున్న కొవ్వు ఆమ్లాలను సంతృప్త కొవ్వు ఆమ్లాలుఅని అంటారు. అలాకాకుండగా కార్బన్-కార్బన్ మధ్య ద్వింబంధం వున్నచో అటువంటి వాటిని అసంతృప్త కొవ్వు ఆమ్లాలని అంటారు. ఒక ద్విబంధమున్న ఆమ్లాలను ఏక ద్విబంధయుత కొవ్వు ఆమ్లం (Monounsaturated fatty acid) అంటారు.ఒకటికన్న ఎక్కువ ద్వింబంధాలున్న కొవ్వు ఆమ్లాలను బహు ద్వింబధయుత కొవ్వు ఆమ్లాలని (poly unsaturated fatty acid) అంటారు.

ఆమ్ల నిర్మాణం-గుణగణాలు

[మార్చు]

ఆమ్లంలోని హైడ్రోకార్బన్ శృంఖలంలో 12 కార్బనులను కలిగి వుండి, ఒకద్వింధాన్ని 9 వ కార్బను వద్ద (కార్బోక్సిల్ (COOH) సమూహాం నుంచి లెక్కించిన) ద్వింబంధాన్ని కలిగివున్న కొవ్వు ఆమ్లాన్ని లారోలిక్ ఆమ్లం అంటారు. ఈ ఆమ్లాన్ని సిస్ 9-లారోలిక్ ఆమ్లమని పిలుస్తారు.[2] 12 కార్బనులను కలిగివున్న లారిక్ ఆమ్లంకన్న రెండు హైడ్రోజన్ కార్బనులను తక్కువగా కలిగివుండును. 9 వకార్బన్ వద్ద ద్విబంధమున్న లారోలిక్ ఆమ్లం శాస్త్రీయ పేరు సిస్ 9-డో డెసెనోయిక్ ఆమ్లం (9-dodecenoic acid).12 కార్బనుల కలిగి వున్నప్పటికి 9 వ కార్బను వద్ద కాకుండగా వేరే కార్బను వద్ద ద్వింబంధమున్న ఆమ్లాలు ఈ ఆమ్లంయొక్క అమాంగతం (ఐసోమరు) లు.

సమాంగములు లేదా ఐసోమరులు

[మార్చు]

ఐసోమరులు అనగా ఒకే ఆణుసూత్రం కలిగివుండి భిన్నమైన సౌష్టవరూపంలో కన్పించు సమ్మేళానాలను మొదటి సమ్మేళనంయొక్క సమాంగములు లేదా ఐసోమరులు (isomers) అంటారు.9-డొడెసెనోయిచక్ ఆమ్లంనకు పలు సమాంగములు/ఐసీమరులు ఉన్నాయి. అవి;

  • 11-డొడెకెనోయిక్ ఆమ్లం:11 వ కార్బన్ వద్ద ద్విబంధమున్నది.
  • ట్రాన్స్10-డోడెకెనోయిక్ ఆమ్లం:10 వకార్బన్ వద్ద ద్విబంధం ఉంది.

ట్రాన్స్10-డోడెకెనోయిక్ ఆమ్లం భౌతిక గుణాల పట్టిక [3]

గుణము విలువల మితి
శాస్త్రీయ పేరు (10E) -10-Dodecenoic acid
అణుభారం 198.301
లాగ్P 4.364
వక్రీభవన సూచిక 1.464
తలతన్యత 33.935 dyne/cm
బాష్పీభవన ఉష్ణోగ్రత 269.886 °C at 760 mmHg
ఫ్లాష్ పాయింట్ 167.105 °C
సాంద్రత 0.923 g/cm3

ఉత్పత్తులు

[మార్చు]
  • ఆల్కహలిసిస్ చర్యద్వారా లారోలిక్ ఆమ్లం యొక్క అల్కహాల్ ఎస్టరులు తయారగును.9-లారోలిక్ ఆమ్లాన్ని మిథనాల్ తో ఎస్టరిపికేసన్ చెయ్యడం వలన 9-దోడేకెనోయిక్ ఆసిడ్, మిథైల్ ఎస్టరు ఏర్పడును.దీని అణు సూత్రం C13H24O2

ఉపయోగాలు

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. "Fatty acid". www.sciencedaily.com/. Archived from the original on 2013-10-20. Retrieved 2013-11-30.
  2. "Lauroleic acid". www.tuscany-diet.net/. Retrieved 2013-11-30.
  3. "(10E)-10-Dodecenoic acid". www.chemspider.com/. Retrieved 2013-11-30.