గడొలిక్ ఆమ్లం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గడొలిక్ ఆమ్లం
పేర్లు
IUPAC నామము
(9Z)-9-Icosenoic acid
ఇతర పేర్లు
cis-9-Eicosenoic acid
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [29204-02-2]
పబ్ కెమ్ 5282767
SMILES O=C(O)CCCCCCC\C=C/CCCCCCCCCC
  • InChI=1/C20H38O2/c1-2-3-4-5-6-7-8-9-10-11-12-13-14-15-16-17-18-19-20(21)22/h11-12H,2-10,13-19H2,1H3,(H,21,22)/b12-11-

ధర్మములు
C20H38O2
మోలార్ ద్రవ్యరాశి 310.52 g·mol−1
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
Infobox references

గడొలిక్ ఆమ్లం (ఆంగ్లం: Gadoleic acid) అనునది ఒక అసంతృప్త కొవ్వు ఆమ్లం. కొవ్వు అమ్లాలను మోనోకార్బోక్సిలిక్ ఆమ్లమని కూడా అంటారు. కొవ్వు ఆమ్లాలు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మూలకాల సమ్మేళనం వలన ఏర్పడును. కొవ్వుఆమ్లం యొక్క అణువులో కార్బన్, హైడ్రోజన్ పరమాణువులు ఒక గొలుసువలె ఒకదానికొకటి అనుసంధానింపబడి వుండును. గొలుసులోని ప్రతి కర్బన్ పరమాణువు మరో రెండు కార్బన్ పరమాణువులతో, రెండు హైడ్రోజన్ పరమాణువులతో బంధం ఏర్పరచుకొని వుండును. ఈ విధమైన కర్బన ఉదజని గొలుసు యొక్క ఒకచివర మిథైల్ (CH3) సమూహం, రెండోచివర కార్బోక్సిల్ (COOH) సమూహం వుండును. కార్బన్-హైడ్రోజన్ యొక్క శృంఖలంలోని (రెండు అంచులవద్ద నున్న కార్బనులను మినహాయించి, (CH3, COOH) మిగతా కార్బనులు, ఇతర కార్బనులతో ఏక బంధం కల్గివున్నచో ఆమ్లాన్ని సంతృప్త కొవ్వు ఆమ్లామని అంటారు. అలా కాకుండాగా హైడ్రోకార్బన్ శృంఖలంలోని ఎదైన కార్బన్ పరమాణువు మరో కార్బన్ పరమాణువుతో రెండు బంధాలను కలిగివున్నచో దాన్ని అసంతృప్త కొవ్వు ఆమ్లమని అంటారు. ఆమ్లంలో కేవలం ఒక ద్విబంధం మాత్రమే వున్నచో దానిని ఏకద్విబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లమనియు, ఒకటికన్న ఎక్కువ ద్విబంధాలున్నచో అట్టి కొవ్వుఆమ్లాలను బహుద్విబంధ కొవ్వు ఆమ్లాలని అంటారు. ఆంగ్లంలో వీటిని పాలి అన్‌సాచ్యురెటెడ్ ఫ్యాటి ఆసిడ్లు (poly unsaturated fatty acids) అంటారు. క్లుప్తంగా ఫ్యూఫా (PUFA) అంటారు.

అమ్ల సౌష్టవం- గుణగణాలు[మార్చు]

గడోలిక్ ఆమ్లం ఒకే ద్విబంధమున్న కొవ్వుఆమ్లం.దీనిని ఆంగ్లంలో మోనో అన్‌స్యాచురెటెడ్ ఫ్యాటి ఆసిడ్ (mono unsaturated fatty acid) అంటారు. గడొలిక్ ఆమ్లం 20 కార్బనులను కలిగివున్నది. గడొలిక్ ఆమ్లం ద్విబంధాన్ని కార్బోక్సిల్ సమూహం నుండి లెక్కించిన 9-10 కార్బనులమధ్య కలిగివున్నది. ద్విబంధం సిస్ (cis) అమరికను కలిగి ఉంది. అందుచే దీన్ని సిస్,9-గడొలిక్ ఆమ్లమని పిలుస్తారు. గడొలిక్ ఆమ్లం అనేది సాధారణ వ్యవహారిక నామం. దీని శాస్త్రీయ పేరు. సిస్,9=ఐకోసెనోయిక్ ఆమ్లం (cis,9-Icosenoic acid). సంక్షిప్త సంకేత నామం : 20:1n-11. దీని వివరణ 20 కార్బనులున్నాయి, ఒకే ద్విబంధము ఉన్నది, అది 11 వకార్బన్ వద్ద (మిథైల్ (ch3) సమూహాం నుంచి లెక్కించిన) వున్నది.[2] గొడొలిక్ ఆమ్లం యొక్క అణుపార్ములా C19H37COOH, మరో రకంగా (C20H38O2).IUPAC (International Union Pure Applied Chemistry) విధానం ప్రకారమైనచో గడొలిక్ ఆమ్లాన్ని (Z) -icos-9-enoic acid అని పలుకవలెను. గొడొలిక్ ఆమ్లం అణుబారం 310.51 గ్రాం/మోల్. మిథైల్ సమూహంనుంచి లెక్కించినప్పుడు ద్విబంధం 11 వ కార్నన్ వద్ద ఉండటం వలన ఈ ఆమ్లాన్ని ఒమేగా -11 (ω-11) కొవ్వుఆమ్లమని కుడా పిలుస్తారు.

గొడొలిక్ ఆమ్లం యొక్క ద్విబంధస్థానాన్ని చూపించే అణు సంకేతం: CH3 (CH2) 9 CH = CH (CH2) 7COOH

గొడొలిక్ ఆమ్లానికి రంగు కలిగి వుండదు, స్పటిక రూపంలో వుండును. గొడొలిక్ ఆమ్లాన్ని మొదటగా గండుమీను (cod) కాలేయ నూనెలో గుర్తించారు (Bull H, Ber 1906, 39, 3570).[3]

ఆమ్లం యొక్క భౌతిక ధర్మాల పట్టిక [4]

గుణము విలువల మితి
అణు సంకేతం C19H37COOH
అణు భారం 310.51
సాంద్రత 0.895 గ్రాం/సెం.మీ3
బాష్పీకరణ ఉష్ణోగ్రత 402.7 °C
వాతావరణ పీడనం వద్ద
వక్రీభవన సూచిక 1.467
ఫ్లాష్‌ పాయింట్ 299.5 °C

లభ్యత : సా.శ..లో 1906 గండుమీను కాలేయ నూనెలో డా.బుల్ల్.ఎచ్ (bull, H) మొదటిసారి గొడొలిక్ ఆమ్లాన్ని గుర్తించారు. ఆమ్లంయొక్క ఆణునిర్మాణ వివరాలను 1933 లో తకనొ.ఎం (Takano M, ) వివరించాడు . ఇది ఇంకా కొన్ని రకాల చేపల నూనెలలో, సొరచేప (shark) కాలేయ నూనెలో, ఇంకా కొన్నిరకాల ఆవాల నూనెలో గుర్తించారు[2]. ఆ కొవ్వు ఆమ్లండా జొజొబా/హహోబా (Jojoba oil (70%) ) నూనెలో, Meadowfoam oil లో కూడా లభిస్తుంది.

ఉపయోగాలు[మార్చు]

  • గొడొలిక్ ఆమ్లాన్ని 70% వరకు కలిగివున్న జొజొబా/హహోబా నూనెను కేశ తైలంగా, చర్మరక్షణ నూనెగా ఉపయోగిస్తారు[5]

ఇవికూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

  1. https://web.archive.org/web/20121023071304/http://www.cyberlipid.org/fa/acid0002.htm

మూలాలు/ఆధారాలు[మార్చు]

  1. Vesely, V. (1930). "Sur les acides gadoléique et sélacholéique synthétiques". Collection of Czechoslovak Chemical Communications. 2: 95–107.
  2. 2.0 2.1 "Gadoleic acid". tuscany-diet.net. Archived from the original on 2014-05-09. Retrieved 2013-11-29.
  3. "MONOENOIC FATTY ACIDS". cyberlipid.org. Archived from the original on 2012-10-23. Retrieved 2013-11-30.
  4. "9-Eicosenoic acid". guidechem.com. Retrieved 2013-11-30.
  5. "Jojoba Oil Benefits for Skincare". thenakedchemist.com/. Archived from the original on 2014-05-22. Retrieved 2013-11-30.