రిసినోలిక్ ఆమ్లం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రిసినోలిక్ ఆమ్లం
పేర్లు
IUPAC నామము
(9Z,12R)-12-Hydroxyoctadec-9-enoic acid
ఇతర పేర్లు
R12-Hydroxy-9-cis-octadecenoic acid
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [141-22-0]
పబ్ కెమ్ 643684
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:28592
SMILES O=C(O)CCCCCCC\C=C/C[C@H](O)CCCCCC
 • InChI=1/C18H34O3/c1-2-3-4-11-14-17(19)15-12-9-7-5-6-8-10-13-16-18(20)21/h9,12,17,19H,2-8,10-11,13-16H2,1H3,(H,20,21)/b12-9-/t17-/m1/s1

ధర్మములు
C18H34O3
మోలార్ ద్రవ్యరాశి 298.461 g/mol
స్వరూపం చిక్కటి గోధుమ రంగు ద్రవం
సాంద్రత 0.940
ద్రవీభవన స్థానం 5.5°C
బాష్పీభవన స్థానం 245°C
ఆల్కహాల్,ఇథరు,క్లొరోఫారం,నీటిలో 10% వరకు
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

రిసినోలిక్ ఆమ్లం ఒక అసంతృప్త కొవ్వు ఆమ్లం.ఇది కేవలం కొన్నిరకాల మొక్కల గింజల నూనెలలో లభ్యమగు కొవ్వు ఆమ్లం.ఇది నూనెలలో గ్లిజరిన్తో కలిసి గ్లిజరాయిడ్ (glyceride) రిసినోలిక్ ఆమ్లం ఒక మోనోకార్బోక్సిల్ ఆమ్లం.అనగా ఆమ్లంయొక్క హైడ్రోకార్బను గొలుసు యొక్క ఒక చివర మిథైల్ (CH3) సమూహం వుండగా, రెండో చివర ఒక కార్బోక్సిల్ (COOH) సమూహాన్ని మాత్రమే కలిగి ఉంది.

రిసినోలిక్ ఆమ్లం వునికి-చరిత్ర

[మార్చు]

రిసిలోనిక్ ఆమ్లం ఆముదంలో 75-80% వరకు గ్లిజరాయిడ్ రూపంలో ఉంది.భారతదేశంలో పురాతన కాలంనుండి వైద్యపరంగా వినియోగిస్తూ వుండినట్లు తెలుస్తున్నది. ఆముదం నూనెనుఇండియా, ఈజిప్టు, చైనా, పెర్షియా, ఆఫ్రికా, గ్రీసుదేశాలల్లో 4 వేల సంవత్సరాల క్రితమే వైద్య సంబంధపరంగా వాడినట్లు తెలుస్తున్నది[1]

రిసినోలిక్ ఆమ్ల నిర్మాణం-సాంకేతిక వివరాలు

[మార్చు]

రిసినోలిక్ ఆమ్లం 18 కార్బనులను కలిగి వున్న, ఒక ద్విబంధాన్ని 9 వకార్బను వద్ద కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం.రిసినోలిక్ ఆమ్లం ఒలిక్ ఆమ్లం లా 18 కార్బనులను,9 వ కార్బనువద్ద ఒకద్విబంధాన్ని కలిగి వున్నప్పటికి భిన్నమైన అణునిర్మాణాన్ని కలిగివున్నది.రిసినోలిక్ ఆమ్లం ద్విబంధానికి అదనంగా 12 వకార్బను వద్ద ఒక హైడ్రోక్సిల్ (OH) సమూహాన్ని కలిగి ఉంది.అందువలన దీనిని 12-హైడ్రోక్సిఒలిక్ ఆమ్లమని కూడా పిలుస్తుంటారు.రిసినోలిక్ ఆమ్లంయొక్క శాస్త్రీయ పేరు 12- హైడ్రోక్సి-9-ఆక్టాడెసినోయిక్ ఆమ్లం (12-Hydroxy-9-octadecenoic acid).

రిసినోలిక్ ఆమ్లం-12చ కార్బను వద్ద OH సముదాయం

రిసినోలిక్ ఆమ్లం యొక్క ఎంఫిరికల్ అణు ఫార్ములా: C18H34O3
ఆమ్లం యొక్క సాంకేతిక పదాల ఫార్ములా:CH3 (CH2) 5CH (OH) CH2CH=CH (CH2) 7COOH

ఆమ్లం యొక్క భౌతిక రసాయనిక దర్మాలు

[మార్చు]

భౌతిక రసాయనిక ధర్మాల జాబితా [2]

గుణము విలువల మితి
స్థితి ద్రవం
అణుభారం 298.46
సాంద్రత 0.940
వక్రీభవన సూచిక nD20 1.4716
ద్రవీభవన ఉష్ణోగ్రత 5.5 °C
బాష్పీభవన ఉష్ణోగ్రత 245 °C
సపోనిఫికెసను సంఖ్య 187.98
అయోడిన్ విలువ 85.05
హైడ్రోక్సిల్ విలువ 150 కనిష్ఠం[3]
ఫ్లాష్ పాయింట్ 224 °C[3]
ఆవిరి సాంద్రత 10.3[3]
 • రిసినోలిక్ ఆమ్లాన్ని ఆల్కహాలిసిస్ చెయ్యడం వలన రిసినోలిక్ ఆమ్లం యొజ్జ ఏస్టరులు ఏర్పడును.మిథైల్ ఆల్కహాల్ (మిథనాల్) తో రిసినోలిక్ ఆమ్లాన్ని చర్యనొందించడం వలన మిథైల్ రిసినోలెయేట్ (METHYL RICINOLEATE) అంటారు. శాస్త్రీయం నైనచో మిథైల్ 12-హైడ్రోక్సి ఒలియేట్ (METHYL 12-HYDROXYOLEATE) అనియు ఇంకనురిసినోలిక్ ఆసిడ్ మిథైల్ ఎస్టరు (RECINOLEIC ACID METHYL ESTER) అనియు పిలుస్తారు.ఈ ఎస్టరు యొక్క భౌతిక వ్లువలు సాంద్రత 0.925 కిలోలు/లీటరుకు, బాష్పీకరణ ఉష్ణోగ్రత;170 °C (1 మి.మీ/పాదరసం మట్టపు పీడనం వద్ద, ద్రవీభవన ఉష్ణోగ్రత -29 °C[4]
 • క్షారంలతోను వాటియొక్క హైడ్రాక్సైడులతోను చర్య జరుపును.ఆ చర్యను సపనీకెసను (saponification) అంటారు.

రిసినోలిక్ ఆమ్లం- ఉత్పత్తి

[మార్చు]
 • రిసినోలిక్ ఆమ్లాన్ని అధికంగా కలిగివున్న ఆముదం నూనె ఎర్గొట్ నూనెలను హైడ్రోలిసిస్ చర్యకు లోనుకావించిన రిసినోలిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది.
 • అముదం నూనెను సపనిఫికెసను చేయుటవలన ఏర్పడును.

ఆమ్లం యొక్క ఉపయోగాలు

[మార్చు]
 • మందుల (Drug) తయారిలోను, స్టబిలైజర్లు (stabilizers, సర్‌ఫ్యక్టంట్సు (Surfactants, ఎముల్సిఫైయిర్ (emulisifier) తయారు చెయ్యడంలో ఉపయోగిస్తారు[5]
 • యంత్రాల కందెనలు, గ్రీజుల తయారిలో ఉపయోగిస్తారు[6]

ఇవికూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు-ఆధారాలు

[మార్చు]

 1. "The Hidden Health Benefits of Castor Oil". greenster.com. Archived from the original on 2013-12-04. Retrieved 2013-11-23.
 2. "Ricinoleic Acid". drugfuture.com. Archived from the original on 2014-06-14. Retrieved 2013-11-23.
 3. 3.0 3.1 3.2 "RICINOLEIC ACID". chemicalland21.com/. Retrieved 2013-11-23.
 4. "METHYL RICINOLEATE". chemicalbook.com. Retrieved 2013-11-23.
 5. "Showing metabocard for Ricinoleic acid". hmdb.ca/. Retrieved 2013-11-23.
 6. "RICINOLEIC ACID". acme-hardesty.com. Retrieved 2013-11-23.