కామోమైల్ నూనె
కామోమైల్ నూనె ఒక ఆవశ్యక నూనె.ఔషదగుణాలు దండిగా వున్న నూనె.కామోమైల్ మొక్కలో పలు రకాలు ఉన్నాయి. కామోమైల్ నూనెను ప్రధానంగా రెండు రకాల మొక్కల నుండి తీస్తారు. కామోమైల్ మొక్కలు ఆస్టరేసి కుటుంబానికి చెందినవి. ఒక్కప్పుడు ఈ మొక్కలను కంపోసిటే కుటుంబంలో వుంచారు. రోమన్ కామోమైల్ ఆవశ్యక నూనెను అంతేమిస్ నోబిలిస్ (కామేమి లన్ నోబిల్) మొక్క నుండి ఉత్పత్తి చేస్తారు. ఈ మొక్కను ఇంగ్లీసు కామోమైల్, స్వీట్ కామోమైల్, గార్డన్ కామోమైల్ అనికూడా అంటారు.అలాగే జర్మన్ కామోమైల్ ఆవశ్యక నూనెను మార్టికరియా కామోమిల్ల (మార్టికరియా రేకుటిక) మొక్క నుండి ఉత్పత్తి చేస్తారు.[1] మొక్కలలను తెలుగులో రెక్క చామంతి అంటారు.
కామోమైల్ మొక్క
[మార్చు]జర్మనీ కామోమైల్ ను ఎక్కువగా హంగేరి, ఈజిప్టు, ఈస్టరన్ ఐరోపా, ఫ్రాన్స్ లలో సాగు చేస్తారు. రోమన్ కామోమైల్ ను జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, మొరాకో లలో ఎక్కువగా సాగు చేస్తారు. రోమన్ కామోమైల్ మొక్క బహువార్షిక ఓషద మొక్క . కాండం వెంట్రుకల వంటి నిర్మాణాలు కల్గి ఆకులు చీలి వుండును. ఆకులు నునుపుగా లేలికగా వుండును. మొక్క 25 సెం.మీ ఎత్తు పెరుగును.పూల రెమ్మలు తెల్లగా వుండును. జర్మన్ కామోమైల్ మొక్క 60 సెం.మీ ఎత్తు పెరుగును. వెంట్రుకల వంటి నిర్మాణాలులేని కాండం, కొమ్మలు కల్గి వుండును.ఆకులు ఈఁకలతో కప్పఁబడిన తేలికగా వుండును.పూలు తెల్లగా ఏక కాండం మీద వుండును. జర్మనీ కామోమైల్ అజులెన్ అను యాంటీ ఇన్ఫ్లమేటరీ కారకాన్ని కల్గి ఉంది.నీలి రంగు ఈ స్పటికం మొక్కలో కాక నూనెలో ఉంది.[1] కామోమైల్ ను సంస్కృతంలో కర్పూరపుష్ప అంటారు.హిందీలో బాబున (babuna) లేదా బాబూన (baboon) అంటారు.జర్మన్ కామోమైల్ నూనెను ఆయుర్వేదంలో చాలాఏళ్ళుగా వాడబడుచు ఉంది.
నూనె సంగ్రహణ
[మార్చు]కామోమైన్ నూనెను మొక్క యొక్క పూల నుండి నీటిఆవిరి స్వేదనక్రియ/స్టీము డిస్టీలేసను పద్ధతిలో సంగ్రహిస్తారు.తాజా పులనుండి నూనెను సంగ్రహిస్తారు. రోమన్ కామోమైల్ పూలలో 1.7% వరకు, జర్మనీ కామోమైన్ పూలలో 0.2-0.4% వరకు నూనె లభించును.[1]
నూనె
[మార్చు]రోమన్ కామోమైల్ నూనె తియ్యని, ఆపిల్ వంటి సువాసన కలిగిన నూనె. లేత నీలి రంగులో వుండును.అలాగే నీళ్ళ వంటి స్నిగ్ధత కల్గి వుండును.జర్మన్ కామోమైల్ నూనె తియ్యని, స్ట్రా వంటి వాసన కల్గి ముదురు నీలి రంగులో వుండును. జిగట /స్నిగ్ధత మధ్యస్థంగా వుండును.[1]
నూనెలోని రసాయన పదార్థాలు
[మార్చు]రోమన్ కామోమైల్ నూనెలో ఆల్ఫా –పైనేన్, కాంపెన్, బీటా పైనేన్, సబినేన్, మైర్సేన్, 1,8-సినీయోల్, y-టేర్పినేన్, ప్రోపైల్ అంజిలేట్ కారియో పైల్లెన్, బుటైల్ అంజిలేట్ ప్రధానంగా ఉన్నాయి. ఇక జర్మనీ కామోమైల్ నూనెలో ప్రధానంగా కామజులోన్, ఆల్ఫా-బిసబోలోల్, బిసబోలోల్ ఆక్సైడ్ బి, బిసబోలోల్ ఆక్సైడ్-A ఉన్నాయి.[1] జర్మనీ కామోమైల్ నూనెలో 52 రకాల రసాయన సమ్మేళనాలు వున్నట్లు గుర్తించారు.అందులో బీటా- ఫార్నెసేన్ 29.8%, ఏఎల్‌ఎఫ్‌ఏఏ- బిసబొలోల్, దాని ఆక్సైడులు 15.7%, కమజులెన్ 6.4% జెర్మాక్రేన్ D 6.2%,, స్పిరో ఈథర్ 5.6% వరకు ఉన్నట్లు గుర్తించారు.[2]
నూనెభౌతికగుణాలు
[మార్చు]కామోమైల్ నూనె భౌతిక గూణాల పట్టిక[3]
వరుస సంఖ్య | భౌతిక గుణం | విలువల మితి |
1 | రంగు | గాఢ నీలి రంగు |
2 | విశిష్ట గురుత్వం 25C వద్ద | 0.91300 to 0.95300 |
3 | ఫ్లాష్ పాయింట్ | 125F |
4 | ద్రావణీయత | నీటిలో కరగదు.ఆల్కహాల్ లో కరుగును |
నూనె ఒషద గుణాలు
[మార్చు]రోమన్ కామోమైల్ నూనె అనాల్దిక్, యాంటీ-స్పాస్మోడిక్, యాంటీ సెప్టిక్, యాంటీ బయోటిక్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఇన్ఫెక్షియస్, యాంటీ డిప్రెసెంట్, యాంటీ- న్యూరాలజిక్, యాంటీ ఫ్లోజిస్టిక్, బాక్టరిసిడల్, కార్మినేటివ్, కొలోగోగు వంటీ ఔషదాగుణాలు కల్గి వున్నది[1]
ఇవి కూడా చూదండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Camomile essential". essentialoils.co.za. Archived from the original on 2018-05-04. Retrieved 2018-11-26.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Chemical Composition, Antioxidant and Antimicrobial Activity of Chamomile Flowers Essential Oil (Matricaria chamomilla L.)". tandfonline.com. Retrieved 2018-11-26.
- ↑ "matricaria chamomilla flower oil". thegoodscentscompany.com. Archived from the original on 2018-10-05. Retrieved 2018-11-27.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)