టమాటోగింజల నూనె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

టమాటో మొక్క సొలనేసి కుటుంబానికి చెందిన మొక్క. టమాటోలను కూరలలో పులుపు రుచికై వాడెదరు. వృక్షశాస్త్రనామం: లైకొపెసికొన్ ఎస్కులంటమ్ (Lycopesicon esculantum). మరియొక రకం లైకొపెసికొన్ లైకొపెర్సికమ్ (lycopesicon lycopersicum). టమాటో మొక్క మూల/ఆది పుట్టుక స్థానం దక్షిణ అమెరికా యొక్క పశ్చిమప్రాంతమందలి కొలంబియా, ఈక్వడార్పెరు, చిలీ, బొలీవియా పశ్చిమ అర్ధభాగం, ఇంకయు ఈక్వెడోరు సమీపంలోని గాలఫోగ ద్వీపసముదాయం[1]

మొక్క
పుష్పాలు
పళ్ళు
కాయ అడ్డుకోత-గింజలు

భారతదేశ ఇతరభాషలలోని పేరు[2][మార్చు]

దేశంలో టమాటోఅధికంగా సాగులోవున్న రాష్ట్రాలు[మార్చు]

ఇంచుమించు టమాటో దేశంలోని అన్నిప్రాంతాలలో సాగవుతున్నప్పటికి ఈదిగువ రాష్ట్రాలలలో అధిక విస్తీర్ణంలో సాగులో ఉంది. అవి; మహారాష్ట్ర, బీహరు, కర్నాటక, ఉత్తర ప్రదేశ్, ఒడిస్సా, ఆంధ్ర ప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం.

టమాటో గింజలు[మార్చు]

కూరలలో నేరుగా వాడే టమాటో పండ్ల నుండి గింజలను సేకరించటం వీలుకాదు. అయితే టమాటో జ్యూస్ (Tomato juice) టమాటోసాస్ (Tomato sauce), టమాటో కెచఫ్ (Tomato ketup) లు తయారు చేయు ఆహర పదార్ధాల ఉత్పత్తి పరిశ్రమలనుండి టమాటో గింజలను పొందవచ్చును. ఆపరిశ్రమలలో టమాతో పండ్లనుండి గింజలను తొలగించిన తరువాత మాత్రమే పైన పెర్కోన్న ఆహరపదార్ధాలను ఉత్పత్తి చేయుదురు. అలాగే లైకొపెన్ (lycosene, బిటా కెరొటెన్ (Beta carotene) తయారు పరిశ్రమల నుండి కూడా టమాటో గింజలు లభిస్తాయి. టమాటో పండులో గింజలు 0.5% మాత్రమేవుండును.

టమాటోగింజలలోని పదార్ధాలు [2]

పదార్ధము శాతం
తేమ 8.0-9.0
నూనె (fat) 24-25
మాంసకృత్తులు 27-28
పీచు పదార్థం 13-14
లెసిథిన్ (Lecithin) 0.56
N-free Extract 21

నూనె[మార్చు]

టమాటో గింజలనూనె ఎరుపుగా వుండి, ఘటైన వాసన కల్గి వుండును.

టమాటో గింజల నూనెలోని కొవ్వు ఆమ్లాల శాతం[3]

కొవ్వు ఆమ్లాలు శాతం
పామిటిక్ ఆమ్లం 13-14%
స్టియరిక్ ఆమ్లం (C18:0) 4.0-6.0% వరకు
ఒలిక్ ఆమ్లం (C18:1) 22-25% వరకు
లినొలిక్ ఆమ్లం (C18:2) 50-54% వరకు
లినొలెనిక్ ఆమ్లం (C18:3) 2-3%

టమాటో గింజల నూనె భౌతిక లక్షణాల పట్టిక[3]

భౌతిక లక్షణాలు మితి
వక్రీభవన సూచిక 400Cవద్ద 1.466-1.4677
ఐయోడిన్ విలువ 122-124
సపనిఫికెసను విలువ 186-198
అన్‌సఫొనిపియబుల్ పదార్థం 1.5% గరిష్ఠం
తేమశాతం 0.5% గరిష్ఠం
రంగు 1"సెల్, (y+5R) 30 (ముడినూనె)
విశిష్టగురుత్వం300/300C 0.917-0.925

నూనె ఉపయోగాలు[మార్చు]

  • నూనెను సలాడు (salad) నూనెల తయారిలో వాడవచ్చును.
  • సబ్బుల తయారిలో వాడవచ్చును
  • మార్గరిన్లను తయారుచేయుటలో ఉపయోగించవచ్చును.
  • రంగులలో (paints) వాడే అల్కైడ్స్‌ను తయారుచేయుటలో ఉపయోగం

ఇవికూడా చూడండి[మార్చు]

వనరులు/మూలాలు[మార్చు]

  1. "Tomatoes". whfoods.com. Retrieved 2015-03-09.
  2. 2.0 2.1 SEA Hand Book-2009by Solvent Extractors' Association of India
  3. 3.0 3.1 Evengelos s. Lozos,Jhon Tasaknis and Lalas,Grasasy Aceites,Vol.49.Fasc.5-6(1998)440-445
  • The Journal of industrial and engineering chemistry (American Chemical Society), 11 part 2, 1919: 850
  • [1]