పెద్ద జీలకర్ర నూనె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెద్ద జీలకర్ర (fennel) మొక్క
పెద్ద జీలకర్ర (fennel) మొక్క
పెద్ద జీలకర్ర (fennel)

'పెద్ద జీలకర్ర నూనె లేదా తీపి సోంపు/సోపు గింజల నూనె ఒక ఆవశ్యక నూనె, ఒక సుగంధ తైలం.అంతియే కాకుండా ఓషధ గుణాలున్ననూనె. పెద్ద జీలకర్ర గింజలను ఎన్నో ఏళ్ళగా మానవుడు వుపయోగిస్తున్నాడు. పెద్ద జీలకర్ర గింజలు జీర్ణకారిగా పనిచేయును. పెద్ద జీలకర్ర నూనెను ఆరోమాపతిలో ఉపయోగిస్తారు.పెద్ద జీలకర్ర మొక్క అంబెల్లిఫెరా (ఆపియేసి) కుటుంబానికి చెందిన మొక్క.పెద్ద జీలకర్రను తీపి సోంపు అనికూడా ఆంటారు. పెద్ద జీలకర్రను ఆంగ్లంలో fennel seed అంటారు. ఒకరకపు పెద్ద జీలకర్ర మొక్క వృక్షశాస్త్ర పేరు ఫొనికలమ్ వాల్గర్ వర్ డూల్కే. పెద్ద జీలకర్రలో రెండు రకాలు ఉన్నాయి.పెద్ద జీలకర్ర నూనెను దేహ మర్దన నూనెగా ఉపయోగిస్తారు.

పెద్దజీలకర్ర మొక్క[మార్చు]

పెద్ద జీలకర్ర మొక్క అంబెల్లిఫెరా (ఆపియేసి) కుటుంబానికి చెందిన మొక్క.పెద్ద జీలకర్రను తీపి సోంపు అనికూడా ఆంటారు. పెద్ద జీలకర్రను ఆంగ్లంలో fennel seed అంటారు. ఒకరకపు పెద్ద జీలకర్ర మొక్క వృక్షశాస్త్ర పేరు ఫొనికలమ్ వాల్గర్ వర్ డూల్కే.పెద్ద జీలకర్ర మొక్క ద్వివార్షిక మొక్కలేదా బహువార్షిక ఓషధి మొక్క.పచ్చని అతిసన్నమైన ఆకులు, బంగారుపు పసుపు రంగు పూలనుకల్గి ఉంది.ఈ మొక్క 2 రెండు మీటర్ల (6 అడుగులఎత్తు) పెరుగును.పెద్ద జీలకర్ర యొక్క వ్యవహార పేరు ఫెన్నెల్ (fennel).ఈ పదం లాటిన్ పదం ఫొనుమ్ (foenum) నుండి ఏర్పడినది. ఫొనుమ్ అనగా గడ్డి అని అర్థం.[1]

మధ్యయుగ కాలంలో పెద్ద జీలకర్రను Fenkleఅని పిలిచేవారు పెద్ద జీలకర్ర ఓషధిగా పురాతన చైనాలో ప్రసిద్ధి, ఈజిప్టులు, రోమనులు పెద్ద జీలకర్ర ఆయుస్సు పెంచునని, ధైర్యాన్ని, బలాన్ని కల్గిస్తుందని నమ్మేవారు. అంతేకాదు ఆత్మలనుండి కాపాడుతుందని నమ్మకం. పెద్ద జీలకర్రను దృష్టివృద్ధికే కాకుండా పామూకాటుకు,, కుక్కల మీద వుండే గోమార్లు/ fleas నివారణకు పెద్ద జీలకర్రను ఉపయోగించేవారు.[1] పెద్ద జీలకర్ర మూల స్థానం మధ్యధరా ప్రాంతంగా భావిస్తారు.అయితే ప్రపంచమంతటా పెద్ద జీలకర్ర పంటను సాగు చేస్తారు.కొందరు పెద్ద జియాల్కర్ర గింజలను సోపు /anise గింజలుగా పొరపాటుపడతారు.పెద్ద జీలకర్ర గింజలను వంటలో వాడతారు.[2] పెద్ద జీలకర్ర క్యారెట్ లేదా ఫార్స్లే కుటుంబానికి చెందిన మొక్క.

నూనె సంగ్రహణం[మార్చు]

పెద్ద జీలకర్ర విత్తనాల నూనెను నలగ గొట్టబడిన పెద్ద జీలకర్ర గింజలనుండి ఆవిరి స్వేదనక్రియ/స్టీము డిస్టీలేసను ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేస్తారు. పెద్ద జీలకర్ర గింజలనుండి నూనె దిగుబడి 2-4% వరకు వుండును.నూనెలో రెండు రకాలు.ఒకటి స్వీట్ ఫెన్నెల్ ఆయిల్ (మధుర పెద్ద జీలకర్ర నూనె), మరొకటి బిట్టరు ఫెన్నెల్ ఆయిల్ (చేదు పెద్ద జీలకర్ర నూనె).ఆరోమాపతిలో, చర్మం పై రాయుటకు చేదు పెద్ద జీలకర్ర నూనెను వాడరు.

నీటి ఆవిరి స్వేదన క్రియ/స్టీము డిస్టిలేసను పద్ధతి ప్రధాన వ్యాసం ఆవశ్యక నూనెల ఉత్పత్తి- నీటి ఆవిరి ద్వారా స్వేదనక్రియ చదవండి

నూనె[మార్చు]

పెద్ద జీలకర్ర నూనె, పెద్ద జీలకర్ర వంటి వాసన కలిగిన పారదర్శక నూనె.ఇది aniseed (ఒక రకమైన సోపు) నూనె వలె వుండును.పెద్ద జీలకర్ర ఆకులనుండితీసిన నూనెలో (అరన్ జూఏజ్ ప్త్రాంపు మొక్కల ఆకులు-ఏప్రిలు, జూన్) మిథైల్ చావికోల్ 12.3 నుండి 12,1% వరకు, ఆల్ఫా-పెల్లాన్డ్రెన్ 9.4 నుండి 27.2% లిమోనెన్ 25.3 నుండి 18% వరకు ఫెన్చొన్ 19.4 నుండి 18,3% వరకు ప్రధాన రసాయనాలుగా ఉన్నాయి.మొక్క కాండం నుండి సంగ్రహించిన నూనెలో (E) -అనేథోల్ 17.4 నుండి3.3% వరకు, ఆల్ఫా పైనేన్ 9.7 నుండి14.4% వరకు, ఆల్ఫా పెల్లాన్డ్రేన్24.3నుండి 31.4% వరకు, p- సైమెన్ 11.5నుండి15.2%వరకు, లిమోనెన్ 11.6నుండి15% వరకు, ఫెన్చోన్9.1నుండి17.5%వరకు ఉన్నాయి.[3]

నూనెలోని రసాయన సమ్మేళనాలు[మార్చు]

నూనెలో పలు ఆల్కహాలులు, టెర్పెనులు, పైనేను/పినేనులు, అల్డిహైడులు, కీటోనులు ఉన్నాయి.వాటిలో ముఖ్యమైనవి ఆల్ఫా-పైనేన్, మైర్సేన్, ఫెన్చొన్, ట్రాన్-అనతోల్, మిథైల్ చావికోల్, లిమోనేన్, 1,8-సినేఓల్,, ఎనిసిక్ అల్డిహైడ్‌లు[1]

నూనె bhoutika guNaalu[మార్చు]

భౌతిక గుణాల పట్టిక[4]

వరుస సంఖ్య భౌతిక గుణం విలువల మితి
1 అణుభారం 448.647
2 రంగు లేత పసుపు
3 వాసన పెద్ద జీలకర్ర గింజల వాసన
4 సాంద్రత 25 deg C వద్ద 0.953-0.973
5 వక్రీభవన సూచిక,20 deg C వద్ద 1.5280-1.5380
6 ద్రావణీయత నీటిలో కరుగదు.
క్లోరోఫారమ్ లో కరుగును.
7 ఆపీటికల్ రొటేసన్ +11 to +24 deg,20 deg Cవద్ద

నూనె లోని వైద్యము చికిత్సధర్మాలు-ఓషధ గుణాలు[మార్చు]

 • నూనె యాంటి సెప్టిక్ (కుళ్లిపోకుండ నిలువరించు గుణం), కండర సంకోచ/ ముకుళన నిరోధిక గుణం, వాయుహరమైన ఔషధము (జీర్ణకారి), మూత్రవర్ధకం, కఫహరం (కఫాన్ని తొలగించడం), స్తన్యవృద్ధ్యౌషధము, విరేచనకారి, చురుకు పుట్టించెడు ఔషధం, ఆకలి పుట్టించే మందు, కడుపులోని పురుగులు పోవుటకు మందు గుణాలు, ప్లీహసంబంధ ఔషధగుణాలు కల్గి ఉంది.[1][5]
 • గాయాలునయమగును.నూనెలోని యాంటీ భయాటిక్ గుణం వలన గాయాలు త్వరగా మానును.అంతేకాదు బాక్టీరియా వలన గాయాలు పెరగకుండా చేయును.2018 లో రష్యా లోని సెయింట్ పేటర్బగ్ మెడికల్ అకాడమీ లోని చిన్న పిల్లల విభాగానికి (Department of Pediatrics) చెందిన పోస్ట్ డాక్టోరల్ ఎడ్యుకేసన్ వారు చేసిన పరిశోధనలో ప్రేగుకు సంబంధీన నొప్పులను తగ్గించునని, కొలిక్ వున్న చిన్న పిల్లల చిన్న ప్రేవుల్లోని కణాల కదలికను పెంచునని కనుగొన్నారు.పెద్ద జీలకర్ర నూనె ఏమల్షను వలన పిల్లల ప్రేవుల్లోని కడుపునొప్పి/ శూలనొప్పి తొలగింపబడింది.[2] యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రో బియాల్ గుణాలు కల్గి ఉంది.
 • మలబద్ధకం,, వాయు సంబంధ జబ్బులను నివారించును.జీర్ణ సంబంధమైన జబ్బులను తగ్గించును. నూనెను కడుపు మీద, అరికాళ్ళకు రాసిన అజీర్తి తగ్గును.
 • బరువు తగ్గించడంలో కూడా పెద్ద జీలకర్ర నూనె తోడ్పడును.ఏంtO కాలంగా పెద్దజీలకర్రను ఉపవాసం ఉన్నప్పుదూ ఆకలిని తగ్గించుటకు వాడటం రివాజు.ఆవశ్యక నూనె కూడా జీవక్రియ (metabolism) ను వృద్ధి పరచును.[2]
 • టూత్ బ్రస్ మీద ఒక చుక్క పెద్ద జీలకర్ర నూనె నూనెను వేసి పళ్ళు తోముకున్న దంత సంబంధ సమస్యలు నివారణ అగును.పళ్ల తీపులు తగ్గించును.ఒక గ్లాసు వేడి నీటిలో లేదా చేమంతి తేనీరులో రెండు చుక్కల పెద్ద జీలకర్ర తైలాన్ని వేసి తాగిన కడుపు లోని గడబిడ తగ్గును.[2]

పెద్ద జీలకర్ర తైలం ఇతర ఉపయోగాలు[మార్చు]

 • పెద్దజీలకర్ర నూనెను ఐస్ క్రీము, కాండిమెంట్స్, సాలాడ్స్,, తేనీరులో వాడతారు. అలాగే సుగంధ ద్రవ్యాలలో, సబ్బులల్లో, ఔషధాలలో,, కాస్మోటిక్స్ లలో ఉపయో గిస్తారు.టూత్ పేస్ట్, ఆల్కహాల్ రహిత పానీయాల్లో పెద్దజీలకర్ర నూనెను వాడతారు.
 • పెద్ద జీలకర్ర నూనెలో 50-60% వరకు లిక్రోస్ రుచివున్న అనేథోల్ ఉంది.ఇది పెద్ద జీలకర్ర గింజలల్లో నూనెలో కూడా అధికమొత్తంలోవున్నది. అనేథోల్ చక్కెర కన్నా 13 రేట్లు తీయ్యగా వుండటం వలన చాలా పదార్థాలలో పెద్దజీలకర్ర నూనెను ఉపయోగిస్తారు.[6]
 • తలవెంట్రుకలు రాలడం తగ్గించుటకు ఇతర ఆవశ్యక, వాహక (carrier) నూనెల్లో కలిపి తలకు రాసిన వెంట్రుకాలు రాలడం తగ్గును.

నూనె వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు[మార్చు]

 • పెద్ద జీలకర్ర నూనె, ఎక్కువ గాటైన గాఢత వున్న నూనె. అందువలన ఎక్కువ మోతాదులో వాడరాదు.గర్భవతిగా వున్న సమయంలో ఉపయోగించరాదు.అలాగే మూర్ఛరోగులు కూడా వాడరాదు.
 • అధిక ప్రమాణంలో ట్రాన్స్-అనెథోల్‌ను కల్గి వున్నందున పెద్ద జీలకర్ర నూనెను ఈస్ట్రోజెన్ సంబంధిత క్యాన్సరువున్న వ్యక్తులు, పిల్లలకు పాలిస్తున్న తల్లులు, గర్భవతులు, ఎండో మెరియో సీస్ తోబాధపడుతున్నస్ర్తీలు వాడరాదు.[1]
 • బిట్టరు/చేదు పెద్ద జీలకర్ర నూనెను ఆరోమాపతిలో వాడరాదు. అలాగే చర్మానికి పూయ పూయరాదు.[1]
 • పెద్ద జీలకర్ర నూనె వలన అతి అరుదుగా అలెర్జీ కలగ వచ్చు.గర్భవంతులు, చిన్న పిల్లౌ వాడక పోవడం మేలు.నూనెలోని ట్రాన్స్ అనేథోల్ రసాయనం దేహంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ను ఎక్కువ వృద్ధి చేయును. అందువలనఎక్కువ ప్రమాణంలో తీసుకున్న ఇది గర్భవతులకు, రొమ్ము క్యాన్సరు, గర్భకోశ క్యాన్సరు, కణతులు వున్న వారికి అపాయకరం.అలాగే మూర్ఛ రోగం వున్న వారు కూడా ఉపయోగించరాదు[2]

బయటి వీడియో లింకులు[మార్చు]

ఇవికూడా చదవండి[మార్చు]

మూలాలు[మార్చు]