మల్లెపూల నూనె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మల్లెపూల నూనె
Common Jasmine.jpg
జాస్మినం అఫిసినేల్—సాధారనజాస్మిన్
Scientific classification
Kingdom:
ప్లాంటే
(unranked):
ఆంజీయో స్పెర్మ్స్
(unranked):
యూడికోట్స్
(unranked):
ఆస్టెరిడ్స్
Order:
Family:
ఓలియేసియే
Tribe:
Genus:
జాస్మినమ్

Type species
Jasminum officinale
L.
Species

More than 200, see List of Jasminum species[1][2]

Synonyms[3]
 • Jacksonia hort. ex Schltdl
 • Jasminium Dumort.
 • Menodora Humb. & Bonpl.
 • Mogorium Juss.
 • Noldeanthus Knobl.

మల్లెపూల నూనె లేదా మల్లెల నూనె ఒక ఆవశ్యక నూనె.ఆంగ్లంలో జాస్మిన్ ఆయిల్ అంటారు.పూల నుండి ఉత్పత్తి చెయ్యడం వలన మల్లెపూల నూనె లేదా మల్లెల నూనె అంటారు. మల్లెపూల సుగంధ తైలం అనికూడా అంటారు. మల్లె పూలను పులదండల తయారీలో ఉపయోగిస్తారు, దేవతార్చనకు ఉపయోగిస్తారు. ముఖ్యంగా భారత దేశంలో మహిళలు మల్లె పూల దండలను సిగలో మక్కువగా ధరిస్తారు. మల్లెపూల నూనె ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలు వున్నవి. సౌందర్య సాధనాలు, ద్రవ్యాలు(కాస్మోటిక్సు)లలో విరివిగా వాడతారు. సబ్బులతయారిలో ఉపయోగిస్తారు.మల్లెమొక్కగుబురుగా పొడలా పెరుగును.మల్లె మొక్కలో పలు రకాలు వున్నవి. మల్లె పువ్వుల్లో చాలా రకాలు ఉన్నాయి. గుండు మల్లె, జాజి మల్లె, దొండు మల్లె, తీగ మల్లి, గుబురు మల్లెలు లాంటివి మంచి సువాసన వెదజల్లుతాయి.[4]

మల్లె మొక్క[మార్చు]

మల్లె మొక్క ఓలేసియే(ఆలివ్) కుటుంబానికిచెందిన మొక్క. మల్లె వృక్షశాస్త్ర పేరు జాస్మినం లాటినం. జాస్మినమ్ గ్రాడిఫ్లోరా (జాస్మినమ్ ఒఫ్ఫిసినెల్ అనికూడా అంటారు) నుండి ఎక్కువగా మల్లె నూనె తీస్తారు.మల్లెమొక్కలో 12 రకాలు వున్నవి[5] మల్లె సతత హరిత మొక్క,ఎగబాకే పొద,ముదురు ఆకుపచ్చిని ఆకులను కలిగి దాదాపు 10 మీటర్ల ఎత్తువరకు పెరుగును. పూలు నక్షత్రం ఆకారంలో పూలరెమ్మలను/రెక్కలను కల్గి, పూలను సాధారణంగా రాత్రి పూట సేకరిస్తారు. సాధారణంగా మల్లె మొక్కలను నాటిన 6 నెలల తర్వాత పూత ప్రారంభ మయ్యి, మొక్క పెరిగే కొద్ది పూత కూడా ఎక్కువై దిగుబడులు కూడా పెరుగుతాయి. ఎర్ర గరప నేలలు ఎంచుకుని మొక్కలు నాటుకోవాలి. నల్ల బంక నేలల్లో శాఖీయ పెరుగుదల బాగానే ఉంటుంది. కానీ పూల దిగుబడి అంతగా రాదు. చౌడు నేలలు, నీరు ఎక్కువగా నిల్వ ఉండే నేలలు మల్లె సాగుకు పనికిరావు. మల్లె సాగును జూన్ - డిసెంబర్ వరకు ఎప్పుడైనా మనం చేపట్టవచ్చు. నాటేటప్పుడు చల్లని వాతావరణం ఉండేలాగా అనగా సాయంత్రం పూట నాటడం వలన మొక్క బాగా అతుక్కుని నిలదొక్కుకుంటాయి. వరుసల మధ్య, మొక్కల మధ్య 1.25-2.00 మీటర్ల దూరం ఉండేలాగా అంటు మొక్కలను నాటుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చు.[6]

మొక్క ఆవాసం[మార్చు]

మల్లె జన్మ స్థానం ఉత్తర భారతదేశము, చైనా.అక్కడి నుండి మొదట అరబ్బులు/ఒకరకమైన తురకలు వలన స్పెయిన్ తీసుకోపోబడినది.అక్కడి నుండి ఫ్రాన్స్,ఇటలీ,మొరాకో,ఈజిప్టు,జపాన్,టర్కీ దేశాలకు విస్తరించి,ప్రస్తుతం పైన పేర్కోన్న దేశాలలో విస్తారంగా సాగులో వున్నది.[7]మల్లెను ఆంగ్లంలో జాస్మిన్ అంటారు.జాస్మిన్ అనే మాట పెరిసియన్ భాష యాస్మిన్ పదంనుండి పుట్టినది. భారతీయులు,చైనా వారు, మల్లెను వైద్యపరంగా వాడారు. ముఖ్యంగా వీర్యవర్ధనిగా (శృంగార కోరికలు పెంచే) ఓషధిగా ఉపయోగించారు.టర్కీలో మల్లె కాండాన్ని తాళ్ళుగా పేనేవారు.చైనాలో జాస్మిమమ్ సంబక్ అనే రకపు మల్లెల నుండి చేసే టీ అందరికి ఇష్టమైన టీ. ఇండోనేషియాలో మల్లెను అలంకరణకు ఉపయోగిస్తారు.

నూనె సంగ్రహణ[మార్చు]

మల్లెపూల నూనె సంగ్రహణ మిగతా ఆవశ్యక నూనెల సంగ్రహణ కన్న కాస్త భిన్నమైన క్లిష్టమైనది.మిగతా నూనెలను హైడ్రో డిస్టిలేసన్(నీటిని నేరుగా కలిపి వేడి చేయడం ద్వరా) లేదా స్టీము డిస్టిలేసను(నీటిఆవిరి స్వెదనక్రియ)లేదా సాల్వెంట్ ఎక్సుట్రాక్సను పద్ధతిలో నేరుగా ఉత్పత్తి చెయ్యవచ్చును.మల్లెపూల నూనె ను సాల్వెంట్ పద్ధతిలో ఉత్పత్తి చేసినప్పటికి ఒకే దఫా కాకుందా రెండు మూడు అంచెలలో ఉత్పత్తి చేస్తారు. మొదట సాల్వెంట్ సంగ్రహణ పద్ధతిలో పూలనుండి కాంక్రీట్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తారు.ఈ కాంక్రీట్ నుండి ఆల్కహాల్ నుపయోగించి అబ్సొలుట్ (absolute)ను వేరు చేస్తారు.అబ్సొలుట్ లోని ఆల్కహాల్ ను వేరుచేసి మల్లెపూల నూనెను చివరిగా తయారు చేస్తారు.

 • వెయ్యి పౌండ్ల పూలనుండి ఒక పౌండు(0.45 కిలో)కాంక్రీట్ వస్తుంది.

మల్లె ఆవశ్యక నూనెలో దాదాపు 100 వరకు ఆరోమాటిక్ రసాయన సమ్మేళనాలు ఉన్నప్పటికి వాటిలో ప్రధానమైనవి బెంజైల్ ఆసిటేట్,లినలూల్,బెంజైల్ ఆల్కహాల్,ఇండోల్,బెంజైల్ బెమ్జోయేట్,సీస్-జాస్మోన్, జెరానియోల్,మైథైల్ అంత్రానీలేట్ వుండగా స్వల్ప ప్రమాణంలో పి.క్రెసోల్,ఫార్నెసోల్,సీస్-3-హెక్సెనైల్, బెంజోయేట్,యూజెనోల్,నేరోల్, ,బెమ్జోయిక్ ఆమ్లం,బేంజాల్డిహైడ్,y-టెర్పినోల్,నేరోలిడోల్,ఐసోహైటొల్,పైటోల్ తదితరాలు ఉన్నవి.

మల్లెపూల నూనె[మార్చు]

మల్లెపూల నూనె మంచి మోహనకరమైన సువాసన కల్గి వుండును.

మల్లెపూల నూనె బౌతిక గుణాల పట్టిక

వరుస సంఖ్య గుణం విలువమితి
1 అణుఫార్ములా C10H16[8]
2 అణుభారం 136.238 గ్రా/మోల్[8]
3 విశిష్ట గురుత్వం 27°C వద్ద 0.9784173[9]
4 వక్రీభవన సూచిక27°C వద్ద 1.645-1.650 [9]
5 ద్రావణీయత 70%ఆల్కహాల్ లో 3:1 నిష్పత్తిలో[9]

నూనెలోని సమ్మేళన పదార్థాలు[మార్చు]

నూనెలో కీటోన్లు,టెర్పీనోల్,ఆల్కహాల్ లు.ఈస్టరులు, పెనోల్స్,అల్కలాయిడులు, ఆరోమాటిక్ సమ్మేళనాలు వున్నవి.నూనెలో దాదాపు 100 రసాయన సమ్మేళనాలు వున్నవి.ఆల్కహాల్లు:లినలూల్,నెరోల్,టెర్పీనోల్,కీటోన్లు:జాస్మోన్(3-4%),ట్రాన్స్ మిథైల్ జాస్మోనేట్,జాస్మిక్ ఆసిడ్,జాస్మోల్ ఆక్టోన్,మిథైల్ డైహైడ్రోజాస్మోనేట్.సిస్, ట్రాన్స్ ఇథైల్ జాస్మోనెట్.ఆరోమాటిక్ సమ్మేళనాలు:యూజెనోల్,యూజెనైల్ ఆసిటేట్.ఇతర ఆల్కహాల్ ఈస్టరు కీటోనులు:బెంజైల్ అసిటేట్(4.5-25%),బెంజైల్ ఆల్కహాల్,పినైల్ అసిటిక్ ఆసిడ్,మైథైల్ హెప్టనోన్.పెనోల్స్:పి-క్రెసోల్.అల్కలాయిడులు:ఇండోల్(2.5-5%),మిథైల్ అంథ్రానిలెట్లు వున్నవి.[10]

మల్లెపూల నూనె ఉపయోగాలు[మార్చు]

 • మల్లె నూనె చర్మానికి తేమనందిస్తుంది. అంతేకాదు.. ఇది చర్మంలోని సాగేగుణాన్ని పెంచుతుంది. దాంతో చర్మం తాజాగా మారి, పొడిబారే సమస్య అదుపులో ఉంటుంది. చర్మంపై పేరుకునే రకరకాల మచ్చల్ని నివారించడంలోనూ ఈ నూనె కీలకంగా పనిచేస్తుంది.[11]
 • శృంగార సామర్ద్యాన్ని పెంచును.(నంపుసకత్వాన్ని తగ్గిస్తుంది.శీఘ్రస్కలనాన్ని తగ్గిస్తుంది).శృంగార జదత్వాన్ని పోగొట్టును.
 • రుతుస్రావంలోని ఇబ్బందులను తొలగించును.
 • అగరుబత్తులు,కాస్మొటిక్సు, సుగంధద్రవ్యాలలో ఉపయోగిస్తారు.
 • సుఖప్రసవం అయ్యేందుకు సహాయపడును.

బయటి వీడియోల లింకులు[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Jasminum". Index Nominum Genericorum. International Association for Plant Taxonomy. Retrieved 2008-06-03.
 2. "10. Jasminum Linnaeus". Chinese Plant Names. 15: 307. Retrieved 2008-06-03.
 3. USDA, ARS, National Genetic Resources Program. "Jasminum L." Germplasm Resources Information Network, National Germplasm Resources Laboratory. Archived from the original on 2012-01-26. Retrieved November 22, 2011. Italic or bold markup not allowed in: |publisher= (help)CS1 maint: multiple names: authors list (link)
 4. "ఇది మల్లెల మాసమని". prajasakti.com. https://web.archive.org/web/20180323201233/http://www.prajasakti.com/Article/Chitoor/2021100. Retrieved 17-08-2018. 
 5. "Classification for Kingdom Plantae Down to Genus Jasminum L.". plants.usda.gov. https://web.archive.org/web/20170628071555/https://plants.usda.gov/java/ClassificationServlet?source=display&classid=JASMI. Retrieved 17-08-2018. 
 6. "పూల మొక్కలు". te.vikaspedia.in. https://web.archive.org/web/20180113124535/http://te.vikaspedia.in/agriculture/crop-production/c2ac42c32-c2ec4ac15c4dc15c32c41. Retrieved 17-08-2018. 
 7. "Jasmine essential oil information". essentialoils.co.za. https://web.archive.org/web/20180126083913/https://essentialoils.co.za/essential-oils/jasmine.htm. Retrieved 17-08-2018. 
 8. 8.0 8.1 "Jasmine Oil". pubchem.ncbi.nlm.nih.gov. https://web.archive.org/save/https://pubchem.ncbi.nlm.nih.gov/compound/92043553. Retrieved 17-08-2018. 
 9. 9.0 9.1 9.2 "physical and chemical properties". piaessentialoil.files.wordpress.com. https://web.archive.org/web/20180817083830/https://piaessentialoil.files.wordpress.com/2013/05/analisis-jasmine.jpg. Retrieved 17-08-2018. 
 10. "Jasmine". centerchem.com. https://web.archive.org/web/20170108060925/https://www.centerchem.com/Products/DownloadFile.aspx?FileID=6447. Retrieved 17-08-2018. 
 11. "మల్లె చేసే మేలెంతో...!". amb16.blogspot.com. https://web.archive.org/save/http://amb16.blogspot.com/2016/08/blog-post_45.html. Retrieved 17-08-2018.