Jump to content

పెకాన్ నూనె

వికీపీడియా నుండి
పెకాన్ చెట్టు

పెకాన్ నూనెను పెకాన్ గింజల నుండి తీస్తారు.పెకాన్ నూనె కొవ్వు ఆమ్లాలు వున్న ఒక అహారయోగ్యమైన శాకనూనె, ఔషధ గుణాలున్ననూనె.పెకాన్నూనె సహజ సిద్ధమైన మంచి వాసన కల్గి ఉంది.పెకాన్ నూనెలో వున్న సంతృప్త కొవ్వు ఆమ్లాలశాతం ఒలివ్ నూనె కన్నా తక్కువ.పెకాన్ నూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు 9.5% వరకు వుండును.ఒలివ్ నూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు 13.5% వరకు ఉన్నాయి.పెకాన్ నూనెను దేహ మర్దన నూనెగా, ఆరోమా తేరపిలో ఉపయోగిస్తారు.పెకాన్ నూనెలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువ శాతంలో వుందటం వలన ఈ నూనెను ఆరోగ్య ప్రదాయక నూనె అని పిలుస్తారు.

పెకాన్ చెట్టు

[మార్చు]

పెకాన్ చెట్టు జుగ్లాండెసి (Juglandaceae) కుటుంబానికి చెందిన చెట్టు.ప్రజాతి కార్య (carya).వృక్షశాస్త్ర పేరు కార్య ఇల్లినొఇనెంసిస్ (Carya illinoinensis).పెకాన్ చెట్టు పెద్దగా పెరుగు ఆకురాల్చుచెట్టు.20-40 మీటర్ల ఎత్తు పెరుగును.

నూనె సంగ్రహణ

[మార్చు]

పెకాన్ గింజల నుండి నూనెను యాంత్రిక, సాల్వెంట్ ఎక్సుట్రాక్సను పద్ధతిలో సంగ్రహిస్తారు.అయితే నూనెకున్న సహజ సిద్ద్గమైన వాసన కై యాంత్రిక విధానంలో (cold press) నూనెను ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు[1]

నూనె

[మార్చు]

నూనె పలుచగా లేత పసుపు రంగులో వుండును.గింజల్లో నూనె 68-77.0%వరకు ఉంది.చెట్లు పెరుగు ప్రాంతం బట్టి, గింజలో నూనె సాతంలో ఎక్కువ తక్కువ వుండును.నూనెలో గామా టొకోపెరల్స్ సంవృద్ధిగా ఉన్నాయి.గ్రాం నూనెలో 145 yg నుండి 300 wg వరకు ఉన్నాయి.నూనెలో ఒలిక్, లినోలిక్, పామిటిక్ ఆమ్లాలు ఉన్నాయి.[1]

నూనెలోని కొవ్వు ఆమ్లాలు

[మార్చు]

పెకాన్ నూనెలో ఏక ద్విబంధమున్న ఒలిక్ ఆమ్లం 52% మించి ఉంది.అలాగే రెండు ద్బిబంధాలున్నా లినోలిక్ ఆమ్లం 36% వరకు కల్గి ఉంది.మూడు ద్విబంధాలున్న లినోలినిక్ ఆమ్లం 1.5% వరకు లభించును.ఇక సంతృప్త ఆమ్లాల విషయానికి వస్తే పామిటిక్ ఆమ్లం 7.1% వరకు,, స్టియరిక్ ఆమ్లం 2.2% వరకు వుండును.సమతుల్య కొవ్వు ఆమ్లాలు కలిగి వున్న పెకాన్ నూనెలో డెన్సిట్ లిపోప్రోటీన్ (LDL) కొలెస్ట్రాల్ను తక్కువగా కల్గి ఉంది.

నూనెలోని కొవ్వు ఆమ్లాల పట్టిక [2]

వరుస సంఖ్య కొవ్వు ఆమ్లం శాతం
1 పామిటిక్ ఆమ్లం 5.59
2 స్టియరిక్ ఆమ్లం 2.21
3 అరచీడిక్ ఆమ్లం 0.09
4 పామిటోలిక్ ఆమ్లం 0.04
5 ఒలిక్ ఆమ్లం 66.01
6 లినోలిక్ ఆమ్లం 34.56
7 లినోలినిక్ ఆమ్లం 1.13

భౌతిక గుణాలు

[మార్చు]

నూనె పలుచగా లేత పసుపురంగులో వుండును.స్మోక్ పాయింట్ 470o°F.అందువలన ఈ నూనెను వంట నూనెగా ఎక్కువ ఉష్ణోగ్రత వరకు వేడి చేయు ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. అయోడిన్ విలువ 90-108 వరకు ఉండును.

వినియోగం

[మార్చు]
  • మృదువైన నట్ (nut) కలిగి వున్నందున ఈ నూనెను సలాడ్లు తయారీలో ఉపయోగిస్తారు. వెన్న, ఇతర వంట నూనెలకు మంచి ప్రత్యాన్మయ నూనె పెకాన్ నూనె. బేకింగ్ పదార్థాలు చేయుటకు అనువైన నూనె.
  • దేహ మర్దన నూనెగా ఉపయోగిస్తారు.
  • ఆరోమా థెరపీలో ఉపయోగిస్తారు.
  • కాస్మోటిక్స్‌లలో ఉపయోగిస్తారు
  • జీవ ఇంధనంగా ఉపయోగిస్తారు
  • చర్మరక్షణకు, చుండ్రు నివారనకు ఉపయోగిస్తారు.[1]
  • ఇతర ఆవశ్యకనూనెలతో కలిపి కేశ నూనెగా ఉపయోగిస్తారు[1]
  • చర్మం మీది మొటిమలను దురదలను తొలగిస్తుంది.[3]
  • సబ్బుల తయారిలో ఉపయోగిస్తారు.పగిలినపెదాలకు ఉపయోగిస్తారు.చర్మలేపనంగా ఉపయోగిస్తారు.[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "Benefits of pecan oil". botanical-online.com. Archived from the original on 2016-08-21. Retrieved 2018-11-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "6-Mean-Content-of-the-Major-Fatty-Acids-of-Pecan-Oil-of-Different-Cultivars_". researchgate.net. Archived from the original on 2018-11-24. Retrieved 2018-11-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. 3.0 3.1 "Pecan Oil Organic Pure Cold Pressed". amazon.co.uk. Archived from the original on 2018-11-24. Retrieved 2018-11-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)