Jump to content

మెంతుల ఆవశ్యక నూనె

వికీపీడియా నుండి
మెంతి ఆకులు
మెంతులు

మెంతుల ఆవశ్యక నూనె ఒక సుగంధ తైలం.మెంతుల ఆవశ్యక నూనె ఒక ఓషధి గుణాలున్న నూనె. మెంతుల నూనెను మెంతి గింజల నుండి ఆవిరి స్వేదనక్రియ/స్టీము డిస్టిలేసను ప్రక్రియ ద్వారా సంగ్రహిస్తారు.లేత మెంతి ఆకులను కూరలలో ఉపయోగిస్తారు. అలాగే మెంతులను ఆయుర్వేద వైద్యంలో, వంటల్లో ఉపయోగిస్తారు. మెంతుల వలన, మెంతి నూనె వలన పలు ఔషధ ఉపయోగాలు ఉన్నాయి. మిగతా ఆవశ్యక, సుగంధ లైలాల వలె ప్రముఖంగా ఈ నూనె పేరు వినపడనప్పటికి మెంతి నూనె వలన పలు ప్రయోజనాలు ఉన్నాయి. మెంతి ఆవశ్యక నూనెలో ఆల్కహాలు లు, టెర్పెనులు, పైనేన్ వంటి వృక్షసంబంధిత రసాయన సమ్మేళనాలతో పాటు, కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. ఆవిరి స్వేదన క్రియ ద్వారా కేవలం ఆవశ్యక నూనెకు సంబంధింన రసాయన సమ్మేళనాలు సంగ్రహించబడగా, సాల్వెంట్ ఎక్సుట్రాక్సను/ద్రావణి సంగ్రహణ ప్రక్రియ ద్వారా మెంతి గింజల్లోని కొవ్వు ఆమ్లాలను పొందవచ్చు. కానీ మెంతుల్లో తక్కువ ప్రమాణంలో కొవ్వు ఆమ్లాలు వున్నందున, వాటిని ఉత్త్పత్తిని వాణిజ్య పరమ్గా చెయ్యడం లేదు. మెంతులను ఆహారంలో వాడటంవలన, మెంతుల్లోని కొవ్వు ఆమ్లాలు పొందవచ్చును. మెంతులను పురాతన కాలంనుండి కూడా వంటల్లో, వైద్యంలో ఉపయోగించేవారు.

మెంతి మొక్క

[మార్చు]

మెంతులను ఆంగ్లంలో ఫెను గ్రీక్ (Fenugreek) అంటారు. మెంతి మొక్క చిన్న పొద లా పెరుగును. ప్రతి మొక్క 10-20 విత్తనాలను యిస్తుంది.విత్తనాలు ఘాటైన వాసన కల్గి వుండును.అలాగే చేదు రుచిని కల్గి వుండును.మెంతి మొక్క ఫాబేసియే కుటుంబాబికి చెందిన మొక్క.మెంతిమొక్క ఏకవార్షిక మొక్క. ఆకుపచ్చని ఆకులనుకల్గి ఉంది.

తుతన్ఖమూన్ సమాధిలో మెంతులను లభించాయి. పురాతన వైద్యగ్రంధాల్లో మెంతుల వినియోగంగురించి పేర్కోన్నారు.మెంతి గింజల్లో ప్రోటీన్లు 20-25 % (మాంసకృత్తులు), నూనె 6-8%, ఆహారయోగ్యమైన పీచు పదార్థం 45-50%,2-5%, స్టెరాయిడల్ సపోనిన్ ఉన్నాయి.

నూనె సంగ్రహణ

[మార్చు]

మెంతుల నుండి మెంతుల ఆవశ్యక నూనెను నీటి ఆవిరి స్వేదన క్రియ/స్టీము డిస్టిలేసను ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేస్తారు.మెంతుల్లో కొవ్వు ఆమ్లాలు కూదా ఉన్నాయి. కొవ్వు ఆమ్లాలు కావాలంటే సాల్వెంట్ డిస్టిలేసను ద్వారా సంగ్రహించవచ్చు.మెంతుల్లో ఆవస్యకనూనె శాతం 5-6% వరకు ఉండును.

మెంతి నూనె

[మార్చు]

మెంతి ఆవశ్యక నూనె లేత పసుపు రంగులో, బ్రౌన్ రంగు చాయను కల్గి వుండును.ప్రత్యేకమైన మెంతుల వంటి వాసన ఉంది.కొద్దిగా చేదు రుచి కల్గి ఉంది.[1]

నూనెలోని రసాయానాలు

[మార్చు]

నూనెలోని ముఖ్యమైన రసాయనాలలో ω–కాడినేన్ (27.6%) వరకు ఉంది. మిగిలినవి α –కాడినోల్, γ –యూడెస్మోల్,, α – బిసబొలోల్.కోల్డ్ ప్రెస్ పద్ధతిలో తీసిన నూనెలో స్టియరిక్ ఆమ్లం, పామిటిక్ ఆమ్లం, బెహెనిక్ ఆమ్లం,, ఆరాచీడిక్ ఆమ్లం ఉన్నాయి. అంతేకాక ఒలిక్ ఆమ్లం, లీనోలిక్ ఆమ్లం కూడా ఉన్నాయి.[2] మెంతిగింజల నుగ్యాస్ క్రోమెటో గ్రపీ ద్వారావిశ్లేశించి కనుగొన్న నూనెలోని వొలటైల్, ఫిక్సెడ్ నూనెలల సమ్మేళనాలు (రసాయన పదార్థాలు) 1,5- ఆక్టాడైఎన్-3-1:3-ఐసో ప్రొఫైల్-2-మేథోక్సీ పైరజోన్:ఆసిటిక్ ఆమ్లం,3-ఐసో బుటైల్-2 మేథోక్సీ పైరజోన్, లినలూల్, బూటనోయిక్ ఆమ్లం:ఐసో వలేరిక్ ఆమ్లం:కాప్రోయిక్ ఆమ్లం:యూజనోల్,3-అమినో-4,5 డై మీదైల్-3,4-డై హైడ్రో2 (5హెచ్) ఫురనోన్, :సోటోలోన్ తదితరాలు ఉన్నాయి.మెంతి నూనె ఘటైన వాసనకు కారణం 2,5-డైమిథైల్ పైరజోన్, β-పైనేన్,3-ఆక్టేన్2-ఒన్, కాంపర్, టెర్పినేఁ -4-ఒల్,4-ఐసో ప్రొఫైల్ –బెంజాడీహైడ్, నేరైల్ అసిటేట్,, β- కారియో పిల్లేన్లు.[3]

ద్రావణి సంగ్రహణ పద్ధతిలో ఉత్పత్తి చేసిన మెంతుల నూనె లోని కొవ్వు ఆమ్లాలు-భౌతిక ధర్మాలు

[మార్చు]

మెంతులనుండి సబ్ క్రిటికలు బూటెన్ ఎక్సుట్రాక్సను విధానంలో మెంతుల నుండి నూనెను సంగ్రహించి, గ్యాస్ క్రోమోటోగ్రపీ ద్వారా విశ్లేషించి అందులోని కొవ్వు ఆంలాల శాతాన్ని లెక్కించారు.వాటి వివరాలు దిగువ పట్టికలో పొందు పరచడమైనది.

వరుస సంఖ్య కొవ్వు ఆమ్లం శాతం
1 మిరిస్టిక్ ఆమ్లం 0.14±0.01
2 పామిటిక్ ఆమ్లం 10.0±0.16
3 స్టియరిక్ ఆమ్లం 4.71±0.13
4 ఒలిక్ ఆమ్లం 14.24±0.08
5 లినోలిక్ ఆమ్లం 42.80±0.11
6 అరచిడిక్ ఆమ్లం 1.33±0.03
7 లినోలినిక్ ఆమ్లం 26.15±0.20
8 బెహెనిక్ ఆమ్లం 0.63±0.01
  • భౌతిక ధర్మాల పట్టిక [4]
వరుస సంఖ్య భౌతిక గుణం విలువల మితి
1 వక్రీభవన సూచిక 1.464-1.479
2 సాంద్రత 0.922
3 ఆమ్ల విలువ 4.75-6.4
4 అయోడిన్ విలువ 148.564
5 సపోనిఫికేసన్ విలువ 190-195
6 ఆన్ సపోనిఫియబుల్ మేటరు 3.79
7 పెరాక్సైడ్ విలువ 0.627
8 ఆల్ఫా టోకోపెరోల్ (mg_100 g􀀀1) 16.46

మెంతి నూనె ఓషధ గుణాలు- ఉపయోగాలు

[మార్చు]

మెంతి నూనె ఓషధ గుణాలు కల్గి ఉంది.[1]

  • ఆరోమాపతి వైద్యంలోదాల్చిన ఆవశ్యక నూనెతో మెంతి నూనెను కలిపి మిశ్రమంచెసి ఉపయోగిస్తారు.గృహావైద్యంలో కూడా మెంతి ఆవశ్యక నూనెను విరివిగా ఉపయోగిస్తారు.
  • మెంతి నూనె సుఖ విరేచనం ఆగుటకు సహకరించును.దోమ లార్వాలను నాశనం చేయును.
  • దేహ మర్ధన నూనెగా మెంతి నూనెను ఉపయోగించవచ్చును.
  • మెంతి నూనె వైరస్ నాశక గుణాలు కలిగి ఉంది.క్యాన్సరు నిరోధక గుణం కల్గి ఉంది.
  • యాంటీ ఆక్సిడెంట్ ధర్మాలు కల్గి ఉంది.
  • బ్లడ గ్లూకోస్ ను తగ్గిస్తుంది.
  • రక్త ప్రసరణను వృద్ధి పరుస్తుంది.
  • చర్మము మీద కల్గ్గు నొప్పులను మంటను తగ్గిస్తుంది
  • నాడీ వ్యవస్థ రక్షించి ప్రభావంచూపి, నాడీ ప్రసరణను మెరుగు పరచును.

ఆరోగ్య సంరక్షణలో మెంతి నూనె వాడకం

[మార్చు]
  • మొటిమలను వాటివలన కలిగే ఇతర ఇబ్బందులను నయంచేస్తుంది.5 చుక్కల మెంతి నూనెను,5 మిల్లీ లీటర్ల మరో ఆధార/మూల నూనె (జోజోబా నూనె వంటివి) తో కలిపి ముఖానికి, మొటిమ లపై రాసిన, మొటిమలను, మొటిమ వలన ఏర్పడిన ఎర్రదనాన్ని తగ్గించును.అలాగే చర్మం ఎర్రబడటం వలన వచ్చిన నొప్పిని తగ్గించును.[1]
  • సెగ కురుపుల/సెగగడ్డలను కూడా తగ్గించును.
  • దేహ మర్ధన నూనెగా మెంతి నూనెను ఉపయోగించవచ్చును.
  • కపమును తగ్గించును.పది చుక్కల మెంతి నూనెను మరుగు చున్న నీటీలోవేసి ఆవిరి పీల్చిన కఫాన్ని తొలగిస్తుంది.[1]
  • మధు మేహాన్ని నియంత్రించడంలో మెంతి నూనె ఉపయోగపడును. మెంతినూనె గ్లూకోస్ ఇంటాలరెన్స్‌ను పెంచి, రక్తంలో గ్లూకోజ్ స్టాయిని తగ్గించును. మెంతి నూనె ఇన్సులిన్‌ను క్రియాశీలం చేస్తుంది. 2-3 చుక్కల మెంతి నూనెను ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనెతో కలిపి తీసుకొన్నమధుమేహం నియంత్రణలో వుండును.మూత్రపిండాల ఆరోగ్యస్థితిని మెంతి నూనె మెరుగు పర్చును.[1]

వాడునపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

[మార్చు]
  • ఇది కేవలము సుగంధ తైలం అందువలన ఇతర నూనెలలో వీలీనం చెయ్యకుండా, నేరుగా గాఢ నూనెను నేరుగా వొంటికి రాయడం కాని కడుపు లోకి తీసుకోవడం చేయరాదు. అందువలన విలీన నూనెను మాత్రమే వాడవలెను.
  • గర్భవతులు ఉపయోగించరాదు.
  • ఏదేమైనా డాక్టరు సలహా తీసుకుని మెంతి నూనెను ఉపయోగించడం మంచిది.

బయటి వీడియోల లింకులు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Fenugreek Oil". oilhealthbenefits.com. Archived from the original on 2018-02-18. Retrieved 2018-09-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Benefits Of Fenugreek Oil And Its Side Effects". lybrate.com. Archived from the original on 2018-09-06. Retrieved 2018-09-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "A Review on the Functional Properties, Nutritional Content, Medicinal Utilization and Potential Application of Fenugreek" (PDF). omicsonline.org. Archived from the original on 2018-07-23. Retrieved 2018-09-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "The chemical composition of fenugreek oil". researchgate.net. Retrieved 2018-09-07.