మరువం నూనె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మరువము
Secure
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
O. majorana
Binomial name
Origanum majorana
మరువం నూనెలోని రసాయనాలు
మరువం నూనెలోని రసాయనాలు

మరువం నూనె ఒక ఆవశ్యక నూనె. మరువం నూనెను మరువం సుగంధ తైలం అనికూదా అంటారు.మరువం ఆకులనుంది, పూలగుత్తులనుండి నూనెను ఉత్పత్తి చేస్తారు. ఆవశ్యక నూనెలు సువాసన కల్గి వున్నందున వీటిని సుగంధ తైలాలు అనికూడా అంటారు.మరువం నూనె వైద్యంలో మందుగా ఉపయోగిసారు.అలాగే సుగంధ ద్రవ్యాల (perfumes) తయారిలో ఉపయోగిస్తారు.మరువం నూనెను ఆస్త్మా,, శ్వాసకోశ ఇబ్బందులకు పనిచేయును.మానసికఉద్రేకాన్ని అదుపులోకితెచ్చును.

మరువం మొక్క

[మార్చు]

మరువం మొక్క లాబీయేటే కుటుంబానికి చెందిన మొక్క.వృక్షశాస్త్ర పేరు ఒరిగనమ్ మరోరానా, ఒరిగనమ్ హోర్టెంసిస్.మరువము (ఆంగ్లం Marjoram) సువాసనలు చిందే చిన్న మొక్క. వీటిని సువాసన కోసం వివిధ రంగుల పూలతో దండ గుచ్చి ధరించడానికి ఇష్టపడతారు. ఇవి కుండీలలో సుళువుగా పెంచుకోవచ్చును. మరువక పత్రి మరువక వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదమూడవది.ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం అస్తవ్యస్తంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు చిన్న మొక్కగా పెరుగుతుంది.

మరువం బాహువార్షిక ఓషధీ మొక్క.కాని ఏక వార్షిక మొక్కగా నూనె తీయుటకై సాగుచేస్తారు.దాదాపు రెండు అడుగులఎత్తువరకు పెరుగును.ముదురు ఆకుపచ్చని ఆండాకారపు ఆకులను కల్గి వుండును.కాండం మీద కేశముల వంటి భాగాలు వుండును. చిన్న పింకు లేదా తెల్లని పూలను పుష్పించును.మరువం మూలస్థానము మధ్యధర ప్రాంతం. మరువం ఆంగ్ల పదంలోని ఒరిగనమ్ అనే పదం గ్రీకు భాషలోని ఒరోస్ గనోస్ పదంవ్నుండి ఏర్పడినది. ఒరోస్‌గనోస్ అనగా పర్వత ఆనందకరం. కొత్తగా పెళ్ళయిన దంపతులకు అదృష్ట సూచకంగా మరువం పూలగుత్తులను ఇచ్చేవారు.గ్రీకులకు ఇది ప్రాశస్త మున్నమొక్క.మరువాన్ని వైద్యంలో, సుగంధ ద్రవ్యాల్లో ఉపయోగించేవారు.16 వశతాబ్దిలో దుర్గాంధాన్ని తగ్గించుటకు మరువాన్ని నేలమీద చల్లేవారు.[1]

నూనె సంగ్రహణం

[మార్చు]

మరువం ఆవశ్యక నూనెను తాజా ఆరబెట్టిన ఆకులు, పూలగుత్తుల/పూస్పించే ఉర్ద్వభాగాల (flowering tops) నుండి స్టీము డిస్టీలేసను/నీటి ఆవిరి స్వేదన క్రియ పద్ధతిలో ఉత్పత్తి చేస్తారు.దిగుబడి 0.5 - 3 %. వరకు వుండును.ఆకులను పూలగుత్తులను కొన్ని రోజులు ఆరబెట్టిన తరువాత నూనె సంగ్రహణం చేస్తారు.[2]

మరువం నూనె

[మార్చు]

మరువం నూనె రంగులేని నూనె.లేదా లేత పసుపు రంగులో వుండును.మరువమావశ్యక నూనె ప్రత్యేకమైన స్పైసీ సువాసన కల్గి ఉంది.మరువం ఆవశ్యక సుగంధ నూనెలో పలు ఆల్క్హహాలులు, టెర్పేనులు, కీటోనులు, పినోలులు, అల్డిహైడులు ఉన్నాయి. అలాగే కార్బీకి ఆమ్లాలు కూడా స్వల్ప పరిమాణంలో ఉన్నాయి.నూనె కొన్నిముఖ్యమైన రసాయన సమ్మేళనాలు సబినెన్, ఆల్ఫా టెర్పినేఁ, గామా టెర్పినేన్, పై (p) సైమెన్, టెర్పినోలెన్, లినలూల్, సీస్ సబినేన్ హైడ్రేట్, లినలైల్ ఆసిటెట్, టెర్పినేన్-4-ఒల్,, గామా టెర్పినియోల్.ఈ నూనె లావెండరు, దేవదారు యూకలిప్టస్ మరిటు తేయాకు నూనె వంటి నూనెలతో మిశ్రమం అవుతుంది[2]

నూనె భౌతిక గుణాల పట్టిక[3]

వరుస సంఖ్య గుణం విలువ
1 సాంద్రత 0.892-0.922
2 వక్రీభవన సూచిక 1.470-1.479
3 ఆసిడ్ విలువ 1.4-2.8
4 దృశ్య భ్రమనం +140-+320
5 సపోనిఫికేసను సంఖ్య 30-60

మరువం నూనెలోని కొన్నిముఖ్య రసాయనాలు

[మార్చు]

కొన్నిముఖ్యమైన రసాయన సమ్మేళనాలు సబినెన్, ఆల్ఫా టెర్పినేఁ, గామా టెర్పినేన్, పై (p) సైమెన్, టెర్పినోలెన్, లినలూల్, సీస్ సబినేన్ హైడ్రేట్, లినలైల్ ఆసిటెట్, టెర్పినేఁ-4-ఒల్,, గామా టెర్పినియోల్ నూనెలో టెర్పినేఁ-4-ఒల్ 38.4% వరకు, సీస్-సబినెన్ హైడ్రేట్ 15% వరకు, p-సైమెన్ 7% వరకు y-టెర్పినేన్ 6.9%వరకువుండును.[4]

వైద్యంలో నూనె ఉపయోగాలు

[మార్చు]
  • ఇది బాధానాశకౌషధముగా, శూలరోగమును పోగొట్టే మందుగా, ధాతుక్షయకరముగా, యాంటి సెప్టిక్ గా, బాక్టిరియా నాశనిగా, వాయుహరమైన ఔషధముగా, మూత్రవర్ధకముగా పనిచేయును[5]

నూనె వాడకంలొ తీసుకో వలసిన జాగ్రత్తలు

[మార్చు]
  • మరువం నూనె కొందరిలో అలెర్జీ రియాక్షనులు కల్గించవచ్చు.అలాగే హైపరు టెంసను కల్గించవచ్చును.
  • మరువం నూనె విషగుణ రహితం. అయితే గర్భవతిగావున్నప్పుడు లోపలికి తీసుకోరాదు.[1]
  • ఎమోషన్స్‌ను స్థిమిత పరచును.ఆతురత/వ్యాకులతను తగ్గించును.కండరాలను సడలించును.కీళ్ళవాత నొప్పులను తగ్గించును.వాచిన కీళ్ళ వలన కల్గు నొప్పులను తగ్గించును.[1]

ఇతర ఉపయోగాలు

[మార్చు]

బయటి లింకుల వీడియాలు

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Marjoram essential oil". essentialoils.co.za. Archived from the original on 2018-01-25. Retrieved 2018-08-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. 2.0 2.1 "Used for Thousands of Years, Sweet Marjoram Oil Offers Many Benefits". articles.mercola.com:80. Archived from the original on 2017-08-26. Retrieved 2018-08-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Marjoram oil, its characteristics and application" (PDF). chemikinternational.com. Archived from the original on 2018-08-18. Retrieved 2018-08-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Chemical composition of the essential oil of marjoram". sciencedirect.com. Archived from the original on 2012-02-08. Retrieved 2018-08-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Used for Thousands of Years, Sweet Marjoram Oil Offers Many Benefits". articles.mercola.com. Archived from the original on 2017-08-26. Retrieved 2018-08-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)