దేవదారు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దేవదారు
Cedrus-deodare-habit.JPG
A young tree in cultivation
Scientific classification
Kingdom
Division
Class
Order
Family
Genus
Species
C. deodara
Binomial name
Cedrus deodara

దేవదారు లేదా దేవదారువు (ఆంగ్ల భాష Deodar) వివృతబీజాలలో పైన్ జాతికి చెందిన వృక్షం.

దేవదారు వృక్షం

ఈ పత్రి దేవదారు వృక్షానికి చెందినది. ఇది ఎక్కువగా అరణ్యాల్లో పెరుగుతుంది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు పదమూడవది. పార్వతీ దేవికి మహా ఇష్టమైనది. చల్లని ప్రదేశంలో, ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వృక్షం. దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి, తరువాత ఆ ఆకులను నునెలో వేసి కాచి, చల్లార్చిన తరువాత నూనె తలకి రాసుకుంటే మెదడు ,కంటి సంబంధ రోగాలు దరిచేరవు. దేవదారు మాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడినీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి.

భౌతిక లక్షణాలు[మార్చు]

ఈ ఆకు ఎలప్పుడు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం సూదికొనలతో ఉంటుంది. పరిమాణం పెద్దది. ఈ చెట్టు మహావృక్షం గా పెరుగుతుంది.

శాస్త్రీయ నామం[మార్చు]

ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం Cedrus deodara.

ఔషధ గుణాలు[మార్చు]

ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :

  • దేవదారు పత్రాల చిగుళ్లు మేహశాంతిని కలిగిస్తాయి.
  • దీని ఆకులతో కాచిన తైలం కళ్లకు చలువజేస్తుంది.
  • ఈ చెట్టు ఆకులు, పువ్వులు కూడా మంచి ఔషధులే.

సువాసన గుణం[మార్చు]

ఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది.

ఇతర ఉపయోగాలు[మార్చు]

ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు : ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. దేవదారు శరీర వేడిని తగ్గిస్తుంది.

ఆయుర్వేదంలో[మార్చు]

ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది చర్మ వ్యాదులు,చిన్న చిన్న దెబ్బలు మానడానకి ఉపయోగపడుతుంది.
మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=దేవదారు&oldid=2990353" నుండి వెలికితీశారు