బృహతీ పత్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ పత్రి బృహతీ వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రపూజ క్రమములో ఈ ఆకు 21వది.

బృహతీ పత్రం

భౌతిక లక్షణాలు[మార్చు]

ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆకారం తెల్లని చారలుం డే గుండ్రని పళ్లతో ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు గుబురుచెట్టుగా పెరుగుతుంది.దీనిలో తెలుపు, నీలిరంగు పువ్వులు పూసే రెండు రకాలుంటాయి.దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి. తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో వుంటాయి.

శాస్త్రీయ నామం[మార్చు]

ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం solanum surattense.

ఔషధ గుణాలు[మార్చు]

ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :

  1. దీనిని నీళ్ళలో కాచి, ఆకులను ఉప్పుతో కలిపి నూరి ఒక గుడ్డలో తీసుకొని కీళ్ళనొప్పులు ఉన్న చోట కట్టుకడితే.. ఉపశమనం కలుగుతుంది.
  2. బృహతీపత్రం చూర్ణం దురదలకు, నొప్పులకు పనిచేస్తుంది.
  3. బృహతీ పత్రం యొక్క కషాయంతో నోటిని శుభరపరచుకుంటే నోటి దుర్వాసన తొలగిపోతుంది. రక్తశుద్ధి చేయగల శక్తి బృహతీపత్రానికి ఉంది.

సువాసన గుణం[మార్చు]

ఈ పత్రి దుర్వాసనతో కూడి ఉంటుంది.

ఇతర ఉపయోగాలు[మార్చు]

ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :

  • 1.ఇది కంఠరోగాలను, శరీర నొప్పులను నయం చేస్తుంది
  • 2.ఈ ప‌త్రాలు లేదా కాయలు శ్వాస‌కోశ వ్యాధుల‌కు విరుగుడుగా ప‌ని చే్స్తాయి.
  • 3.గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.

ఆయుర్వేదంలో[మార్చు]

ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది దీనిని నీళ్ళలో కాచి, ఆకులను ఉప్పుతో కలిపి నూరి ఒక గుడ్డలో తీసుకొని కీళ్ళనొప్పులు ఉన్న చోట కట్టుకడితే.. ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా వేడి గడ్డలపెై ఈ మిశ్రమాన్ని కట్టుకడితే.. త్వరగా తగ్గిపోతాయి, దగ్గు, ఉబ్బసం వంటివి తగ్గుముఖం పడతాయి. హృదయానికి చాలా మంచిది. వీర్యవృద్ధిని కలుగజేస్తుంది. మూత్రం సాఫీగా కావడానికి, తాప నివారణకు, హృద్రోగ శాంతికి నేల మునగాకు సహకరిస్తుంది, రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.

వనరులు[మార్చు]