ఉమ్మెత్త
ఉమ్మెత్త | |
---|---|
![]() | |
Datura stramonium | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | దతుర |
జాతులు | |
|
ఉమ్మెత్త (ఆంగ్లం Datura) సొలనేసి కుటుంబానికి చెందిన చిన్న పుష్ప జాతి మొక్క.దత్తూర అనే ఈ మొక్క ఉమ్మెత్త వృక్షానికి చెందింది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమంలో ఈ ఆకు ఐదవది.
దత్తురా ఫాస్టుయొసా మరో రకంగా డెవిల్స్ ట్రంపెట్ లేదా మెటల్ అని అంటారు. ఒక పొద లాంటి శాశ్వత మూలిక. ఈ మొక్కలు ప్రపంచంలోని అన్ని వెచ్చని అడవి ప్రాంతాల్లో పెరుగుతాయి. దినిని మొట్టమొదటచ లిన్నియస్ కనుగొన్నారు. ఈ మొక్క మూడు అడుగులు పెరిగే వార్షిక హెర్బ్.వీటి కాండాలు వంకాయి రంగులో వుండి ఆకులు గుండ్రంగా కాండాలకు అత్తుకుని ఉంటాయి.పువ్వులు 6 నుండి 8 వరకు ఉండి సువాసనను వెదజల్లుతాయి. వీటి పువ్వుల రంగులు క్రీమ్ తెలుపు పసుపు, ఎరుపు,, వైలెట్ మొదలుకుని ఉంటాయి. దత్తురా ఫాస్టుయొసాని దాదాపు వెంట్రుకలు లేని ఆకులు, వృత్తాకారంలో ఉంటాయి.బిరుసైన పండ్లు కలిగి ఉంటాయి. వీటి మొక్కలు పెద్ద, నిటారుగా, బలిసిన హెర్బ్, ఈ మొక్కలకు బ్రాంచ్డ్ టాప్ రూట్ వ్యవస్థను కలిగి వుంటుంది. వీటి ఆకులు సింపుల్, ప్రత్యామ్నాయంగా ఉంటాయి. మొత్తం లేదా లోతుగా తమ్మెలను వెంట్రుకలు లేకుండా కనిపిస్తాయి.
భౌతిక లక్షణాలు
[మార్చు]ఈ ఆకు ముదురు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం సూదికొనలతో నక్షత్ర ఆకారంలో ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు గుబురుచెట్టుగా పెరుగుతుంది. దీని పుష్పాలు తెల్లగా, ఊదారంగు కలగలసి పొడవుగా సన్నగా ఉంటాయి.
శాస్త్రీయ నామం
[మార్చు]ఈ పత్రి చెట్టు శాస్త్రీయ నామం Datura metal (Family:Solanaceae).
ఉపయోగాలు
[మార్చు]ఈ పత్రి ఔషధ గుణాలు
[మార్చు]- వ్యాధిగ్రస్తునికి శిరోముం డనం చేయించి ఈ ఆకుల రసాన్ని రెండు నెల లపాటు రోజూ మర్ధన చేస్తే వ్యాధి తగ్గుతుంది.
- ఆస్తమాను తగ్గిస్తుంది
- ఊపిరితిత్తుల సంబంధ సమస్యలను తగ్గిస్తుంది
- మానసిక వ్యాధి నివారణకు ఇది అద్భు తంగా పనిచేస్తుంది.[1]
హిందువులు
[మార్చు]- వినాయక చవితి రోజు ఉమ్మెత్తను వినాయక వ్రత కల్ప విధానం లోని గణేశ పత్రపూజలో ఉపయోగిస్తారు.[1]
- ఉమ్మెత్తలో చాల రకాలున్నాయి. తెల్ల ఉమ్మెత్త/ నల్ల ఉమ్మెత్త అన్ని ఉమ్మెత్తలు విషపూరితాలవలె చాల దుర్వాసన కలిగి వుంటాయి. వీటి కాయలు పెద్ద నిమ్మకాయంత పరిమాణం వుండి కాయ చుట్టు దట్టమైన ముళ్ళు కలిగి వుంటుంది. ఈ కాయలను కొన్ని ఔషదాలలో వుపయోగిస్తారు.
ఇతర విశేషాలు
[మార్చు]ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది.
- ఉమ్మెత్తలో రెండు రకాలు గలవు. 1. తెల్ల ఉమ్మెత్త, 2. నల్ల ఉమ్మెత్త. నల్ల ఉమ్మెత్త వైద్యములో ఎక్కువగా ఉపయోగిస్తారు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "వినాయకుడి పత్రిలతో కరోనా సంహారం!". web.archive.org. 2021-10-04. Archived from the original on 2021-10-04. Retrieved 2021-10-04.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
చిత్రమాలిక
[మార్చు]-
ఉమ్మెత్త చెట్టు
-
ఉమ్మెత పూవు
వెలుపలి లింకులు
[మార్చు]