సూది
Appearance
సూది (ఆంగ్లం: Needle) ఒక చిన్న పరికరం. ఇవి సన్నగా మొనదేలి, వివిధ పరిమాణాలలో ఉంటాయి. కుట్టుపనిలోను, శస్త్రచికిత్సలో ఉపయోగించే సూదులకు ఒకవైపు దారం ఎక్కించడానికి చిన్న రంధ్రం ఉంటుంది.
సూదులలో రకాలు
[మార్చు]- తిన్నటి సూది
- వంపు తిరిగిన సూది
- పెద్ద సూది
- పలక సూది
- గుండు సూది
- పిన్నీసు
- దబ్బలం
ఉపయోగాలు
[మార్చు]కుట్టుపనిలో
[మార్చు]- బట్టలు, తోలు మొదలైనవి కుట్టడానికి ప్రత్యేకమైన కుట్టుమిషను ఉపయోగించి సూదులతో కుడతారు.
- చాలా పదార్ధాలను రవాణా చెయ్యడానికి సంచులలో వేసి దబ్బలం (పెద్ద సూది) తో కుడతారు.
వైద్యంలో
[మార్చు]- ఆకుపంక్చర్, ఒకరకమైన నొప్పిని తగ్గించే చైనా వైద్య చికిత్సలో సూదులుపయోగిస్తారు.
- ఇంజక్షన్ ద్వారా మన శరీరంలోనికి మందులు ఎక్కించడాన్ని సూదిమందు అంటారు.
- శస్త్రచికిత్సలో కోసిన శరీర భాగాల్ని తిరిగి కుట్టడానికి వివిధ రకాల సూదుల్ని వాడతారు.
నొప్పించని సూది
[మార్చు]చర్మంలో కలిసిపోయే సూదులు శాస్త్రవేత్తలు రూపొందించారు. దీన్ని చర్మానికి అతికించుకుంటే చాలు ఔషధం లోనికి వెళ్తుంది. దీంట్లో సూదులు కొన్ని వందలుంటాయి. అవన్నీ అత్యంత సూక్ష్మంగా శరీరంలో గుచ్చుకున్నా నొప్పి తెలియని విధంగా ఉంటాయి. ఔషధంతోపాటు ఈ సూదులు కూడా చర్మంలో కరిగిపోతాయి.
ఇతరత్రా
[మార్చు]- పువ్వులు, ఆకులు, పూసలు, మొదలైనవి హారంగా గుచ్చడానికి సూది, దారం వాడతారు.
- పచ్చబొట్లు పొడవడానికి ప్రత్యేకమైన సూదులు ఉపయోగిస్తారు.
- శరీరంలోని వివిధ భాగాలకు సూదులతో రంధ్రాలు చేసి ముక్కుపుడక, చెవిరింగులు వంటి కొన్ని ఆభరణాలు ధరిస్తారు.
- గ్రామోఫోన్ రికార్డుల్ని ఉపయోగించడానికి కొన్ని సూదుల్ని వాడేవారు.