కుట్టు మిషను

వికీపీడియా నుండి
(కుట్టుమిషను నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కుట్టు ఎలా పడుతుంది

ఆధునిక యుగంలో కుట్టు మెషిన్ (ఆంగ్లం Sewing Machine) లేని జీవితం ఊహించ లేము. మొదట్లో కుట్టు పని అంతా చేతితోనే జరిగేది. కుట్టు మెషిన్ ను కనిపెట్టిన తరువాత ముఖ్యంగా దర్జీ పని వారి జీవితాలు ఎంతో సుఖమయమయ్యాయి.

ఐజాక్ మెరిట్ సింగర్ (అక్టోబరు 27, 1811 – జూలై 23, 1875) ఈ రోజు మనం వాడుతున్న కుట్టు మెషిన్ రూపకర్తగా చెప్పుకొవచ్చు. మెరిట్ కన్నా ముందుగా కుట్టు మిషన్ కనిపెట్టింది ఎలియాస్ హోవే అని అమెరికా పేటెంట్ల చట్టం తీర్పు ఇచ్చినా హోవే మిషను కన్నా ఎంతో సులువైన మిషను కనిపెట్టింది మాత్రం నిస్సందేహంగా సింగరే.

సింగర్

[మార్చు]
ఐజాక్ మెరిట్ సింగర్ ( 1811 అక్టోబరు 27, - 1875 జూలై 23)

ఐజాక్ సింగర్, అమెరికా, న్యూయార్క్ రాష్ట్రం లోని పిట్స్ టవున్ అనే వూళ్ళో, 1811, అక్టోబరు 27 న ఆడమ్ సింగర్, రూత్ బెన్సన్, అనే జర్మనీ నుండి వలస వచ్చిన యూదు దంపతులకు ఆఖరి బిడ్డగా జన్మించాడు. ఈయన జీవితంలో మొత్తం మూడు పెళ్ళిళ్ళు చేసుకుని, 18 మంది పిల్లల్ని కన్నాడు. ఎక్కడా నిలకడగా ఉండేవాడు కాదు. మొదట్లో ఆయన దాయాదుల వద్ద పనిచేసినప్పుడు నేర్చుకున్న యంత్రాల విషయాలతో బాగా సంపాదించాడు. ఈయన కనిపెట్టిన వాటిలో రాళ్ళకి బెజ్జాలు వేసే మర, రంపపు కోత మిషను, కుట్టు మిషను ఉన్నాయి.

కుట్టు మిషను రకాలు

[మార్చు]

కుట్టు మెషిన్ అనేది అసలు కనిపెట్టిన తర్వాత, దాంట్లో రకరకాలు కని పెట్టటం మొదలైంది. లాక్ స్టిచ్ మామూలుగా మన ఇళ్ళల్లో వాడే మిషను ఈ రకానికి చెందింది. దీంట్లో రెండు దారాలు వాడతారు. ఒక దారం పైన ఉంటుంది. రెండవది కింద బాబిన్ లో ఉంటుంది.

గొలుసు కుట్టుమన ఇళ్ళల్లో ఆడవాళ్ళు గుడ్డ మీద బొమ్మలు కుట్టటానికి వాడతారు. దీన్ని కుట్టటానికి ఒకటి లేదా రెండు దారాలు వాడతారు. ఈ రకం మెషిన్లు, సిమెంటు, ధాన్యం, పాకేజీ సంచులు కుట్టటానికి ఎక్కువగా వాడతారు. ఈ రకం మిషన్ని తయారు చేసింది మొదట జేమ్స్ ఎడ్వర్డ్ అల్లన్ గిబ్స్ {1829-1902

ఓవర్ లాక్ మనం ప్యాంట్లు కుట్టిచ్చు కున్నప్పుడు లోపల కచ్చు దారాలు విడిపోకుండా ఒక రకం కుట్టు వేస్తారు. అదే ఓవర్ లాక్. ఈ మిషన్ని ప్రతీ దర్జీ దగ్గరా చూడవచ్చు. జోసెఫ్.ఎమ్.మెర్రో 1877లో మొదటి ఓవర్ లాక్ మిషన్ తయారు చేశాడు.

కవర్ కుట్టు ఈ రకం మిషన్లు పెద్ద పెద్ద బట్టలు కుట్టే పాక్టరీలలో కనిపిస్తాయి. వీటిలో ఆరు అంతకన్నా ఎక్కువ సూదులు కూడా ఉంటాయి. జిగ్ జాగ్ ఈ రకం కుట్టు కుట్టె మిషన్లు మనం ఆడవాళ్ళ దర్జీల దగ్గర చూస్తుంటాం. చీరల అంచులూ అవీ కుట్టటానికి వాడతారు.

గుడ్డని జరిపే విధానాలు

[మార్చు]

మిషనులో సూది, బాబిన్, లూపర్ కాకుండా కుట్టు పడేటప్పుడు, గుడ్డ ముందుకు జరగడానికి పాదం ఉంటుంది. ఇలా గుడ్డ జరగే పద్ధతిని ఫీడింగ్ అంటారు. అవి సుమారు నాల్గు రకాలు.

డ్రాప్ ఫీడ్ ఇక్కడ గుడ్డ కింది భాగంలో డాగ్స్ అనేవి గుడ్డని జరుపుతుంటాయి. మన ఇళ్ళల్లో వాడే మిషన్లన్నింటికీ ఇదే పద్ధతి.

నీడిల్ ఫీడ్ ఇక్కడ గుడ్డ జరుపటానికి సూదులనే ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఫాక్టరీలలో జారిపోయే తత్వం ఉన్న మెటీరియల్ని, కుట్టటానికి ఈ పద్ధతి ఉపయోగిస్తారు.

వాకింగ్ ఫుట్ ఇక్కడ గుడ్డని జరుపటానికి ఒకటి లేదా రెండు పాదాలు ఉంటాయి. ఈ పద్ధతి హెవీ డ్యూటీ మిషన్లలో వాడతారు.

మాన్యువల్ ఫీడ్ఎంబ్రాయిడరీ పని వాళ్ళు ఎక్కువగా ఈ పద్ధతిని ఉపయొగిస్తారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]