పిన్నీసు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పిన్నీసు

ఏవైనా రెండు బట్టలను కలిపి పట్టుకోవడానికి పిన్నీసు (Safety pin) ని ఉపయోగిస్తారు. మామూలు సూదిని వాడితే మనకు గుచ్చుకొనే అవకాశం ఉంటుంది. పిన్నీసుతో అలా జరుగదు. నిత్యజీవితంలో ఉదాహరణలు: ఆడవారు చీర పైటకు జాకెట్టు కలిపి పట్టుకొవడానికి, చొక్కా బొత్తాములు ఊడిపోయినప్పుడు ఆపద్దర్మంగా.

పుట్టుక[మార్చు]

పిన్నీసు పుట్టుక క్రీ. పూ. 14 వ శతాబ్ధానికి చెందిన మైసేనియన్ గ్రీకు నాగరికతలో జరిగింది. పిన్నీసులను గ్రీకులు ఫిబులే (ఏక వచనం ఫిబుల) అని పిలిచేవారు. క్రీ. పూ. 13, 14 శతాబ్ధాలకు చెందిన ఫిబులె దాదాపు ప్రస్తుతమున్న పిన్నీసు వలే ఉండేది. బ్లింకెన్ బర్గ్ యొక్క Fibules grecques et orientales అనే 1926 పుస్తకములో ఫిబులే పుట్టుక గురించి వివరంగా వ్రాయబడింది.

జులై 1849లో వాల్టర్ హంట్ పిన్నీసుని తిరిగి ఆవిష్కరించాడు. దీని హక్కులను 400 డాలర్లకు అమ్మారు.[ఆధారం చూపాలి]

వాడుక[మార్చు]

గుండుసూదిని ఇంగ్లీషులో pin అనిన్నీ, పిన్నీసుని safety pin అనిన్నీ అంటారు. ఈ గుండుసూది, పిన్నీసు అన్న తెలుగు మాటలు ఎలా పుట్టేయో తెలియదు కాని, గుండుసూదిని విశాఖపట్నం జిల్లాలో 'అల్పీ' అంటారు. పిన్నుకి 'ఈసు' తోక తగిలించి పిన్నీసుని చేసిన విధంగా తెలుగులో ఇంకా ఏమైనా ఈసుతో అంతం అయే మాటలు ఉంటే వాటి ఉనికిని పాఠకులు తెలియజేయ గలరు.

పిన్నీసులను ఫంక్ సంస్కృతిలో కర్ణాభరణాలుగా ఉపయోగించటం

సంస్కృతి[మార్చు]

డిక్ హిబ్‌డిజ్ ప్రకారం 1970 దశకము మధ్యలో బ్రిటన్‌లో ఫంక్ ఉపసంస్కృతిలో యుద్ధానంతర శ్రామికవర్గ యువత యొక్క వేషములో కరుకుదనాన్ని సూచించటాని కోసం పిన్నీసును విరివిగా ఉపయోగించారు.

ఇవికూడా చూడండి[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పిన్నీసు&oldid=2122733" నుండి వెలికితీశారు