గన్నేరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గన్నేరు
Nerium oleander flowers leaves.jpg
Nerium oleander in flower
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
విభాగం: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియోప్సిడా
క్రమం: జెన్షియనేలిస్
కుటుంబం: అపోసైనేసి
జాతి: నీరియమ్ లిన్నేయస్
ప్రజాతి: నీ. ఓలియాండర్
ద్వినామీకరణం
నీరియమ్ ఓలియాండర్
లిన్నేయస్
పర్యాయపదాలు

Nerium indicum Mill.
Nerium odorum Aiton[1]

గన్నేరు (ఆంగ్లం Oleander) ఒక అందమైన పూలమొక్క. దీని పువ్వులు పసుపు పచ్చ రంగులో ఉంటాయి. దీనిని సాంప్రదాయక పూజలలో వాడుతారు. దీని కరవీర పత్రం అని కూడా వ్యవహరిస్తారు. ఇది పచ్చ, ఎరుపు, తెలుపు రంగుల్లో లభిస్తాయి. వీటిలో ఏ రకం గన్నేరెైనా సరే.దాని ఆకులు త్రుంచి పాలు కారిన తరువాత తడిబట్టలో పెట్టి శరీరానికి కట్టుకుంటే జ్వర తీవ్రత తగ్గుతుంది. (గమనిక: గన్నేరు పాలు ప్రమాదకరం). దీని శాస్త్రీయ నామం "నీరీయం ఓలియాండ్ర్ర్".

చరిత్ర[మార్చు]

ఇది మొదట వెస్టిండీస్ దీవులలోనూ, దక్షిణ అమెరికాలోనూ కనిపించింది. మధ్యధరా సముద్ర ప్రాంతంలో పెరిగే గన్నేరు పువ్వులు ఎరుపు, తెలుపు రంగులోనూ ఉంటాయి.

గన్నేరు కొమ్మ

లక్షణాలు[మార్చు]

ఇది ఐదు నుంచి ఏడు అడుగుల ఎత్తులో ఉంటుంది. కొమ్మలు, సన్నగా పొడుగ్గా ఉంటాయి. ఆకులు గులాబి, ఎరుపురంగుల మిశ్రమంలో ఉంటాయి. ఐదు నుంచి ఆరు రేకులు కలిగిఉంటుంది. ఆకు రెక్కలు పలుచగా ఉండి మద్య భాగం లేత పసుపుగా ఉంటుంది.ఈ ఆకు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం సూదికొనలతో సమంగా ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు గుబురుచెట్టు గా పెరుగుతుంది. ఈ పత్రి సుగంధభరితంగా కూడి ఉంటుంది.

ఉపయోగాలు[మార్చు]

దీని వేళ్ళను తామర, గజ్జి, కుష్టు వంటి చర్మ వ్యాధుల నివారణకు ఔషధాల నివారణలో ఉపయోగిస్తారు. దాని ఆకులు త్రుంచి పాలు కారిన తరువాత తడిబట్టలో పెట్టి శరీరానికి కట్టుకుంటే జ్వర తీవ్రత తగ్గుతుంది

వినాయక పూజలో[మార్చు]

కరవీర పత్రి గన్నేరు వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు తొమ్మిది వది.

ఇతర విశేషాలు[మార్చు]

  • దీని గింజల నుంచి నూనె లభిస్తుంది.
  • దీని పాలు విషంతో సమానం.
  • దీని గింజలు తింటే మరణం సంభవిస్తుంది.

గ్యాలరీ[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Nerium oleander L.". Germplasm Resources Information Network. United States Department of Agriculture. 1998-03-09. Retrieved 2010-06-26. 

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గన్నేరు&oldid=1510016" నుండి వెలికితీశారు