దుర్వాయుగ్మం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దుర్వాయుగ్మం

దుర్వాయుగ్మం శాస్త్రీయ నామం సైనోడన్ డక్టైలన్. దీనిని బెర్ముడా గ్రాస్, ఎతన గ్రాస్, డుబో, డాగ్స్ టీత్ గ్రాస్,[1] బహామా గ్రాస్, డెవిల్స్ గ్రాస్, కాచ్ గ్రాస్, ఇండియన్ డోబ్, అరుగంపుల్, గ్రామా, వైర్ గ్రాస్ వంటి నామాలతో వివిధ ప్రాంతాలలో పిలుస్తారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా లభ్యమవుతుంది. ఇది యూరోప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా తో పాటు ఆసియాలో బాగా లభ్యమవుతుంది. ఇది అమెరికాకు పరిచయం చేయబడింది[2][3] ఇది బెర్ముడాకు చెందినది కానప్పటికీ, ఇది అక్కడ విస్తారంగా ఆక్రమించే జాతి. బెర్ముడాలో దీనిని క్రాబ్ గ్రాస్ అని పిలుస్తారు

ఈ పత్రి వినాయక చవితి రోజున వినాయకునికి పూజచేసుకునే ఏకవింశతి పత్రపూజ క్రమంలో మూడవది.[4]

భౌతిక లక్షణాలు[మార్చు]

రెండు కొనలు కలిగి ఉన్న జంట గరిక. ఇది ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. సులభంగా లభ్యమవుతుంది. ఈ ఆకు పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం అస్తవ్యస్తంగా ఉంటుంది. పరిమాణం చిన్నది. ఈ చెట్టు చిన్న మొక్క గా పెరుగుతుంది.

ఔషధ గుణాలు[మార్చు]

ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :

  1. డయేరియాను తగ్గిస్తుంది.
  2. మూత్ర సంబంధ వ్యాధులు నయమవుతాయి
  3. మగవారికి సంతాన నిరోధకంగా కూడా పనిచేస్తుంది.

సువాసన గుణం[మార్చు]

ఈ పత్రి దుర్వాసనతో కూడి ఉంటుంది.

ఆయుర్వేదంలో[మార్చు]

ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది.

మూలాలు[మార్చు]

  1. "Iraq". lntreasures.com. Retrieved 5 November 2015.
  2. "Cynodon dactylon (L.) Pers. | Plants of the World Online | Kew Science".
  3. "CABI Invasive Species Compendium".
  4. "వినాయకుడి పత్రిలతో కరోనా సంహారం!". web.archive.org. 2021-10-04. Archived from the original on 2021-10-04. Retrieved 2021-10-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు[మార్చు]