నీలగిరి తైలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మందుగా నీలగిరితైలం(యూకలిప్టస్)

నీలగిరి చెట్టును జామాయిల్ అని కూడా అంటారు. దీనిని ఇంగ్లిషులో యూకలిప్టస్ అంటారు. ఈ చెట్టు నుంచి లభించే తైలాన్ని నీలగిరి తైలం అంటారు. నీలగిరి కొండలలో పెరగటం వల్ల ఈ చెట్లకు నీలగిరి చెట్టు అనే పేరు వచ్చింది. ఈ చెట్టు ఆకులను నలిపితే జందూ బామ్ మాదిరిగా ఘాటైన వాసన వస్తుంది.

నీలగిరి/యూకలిప్టస్ తైలం ఆవశ్యక నూనెలుకు చెందిన నూనె/తైలం.

చెట్లు చల్లని వాతావరణ ప్రాంతాలలోనే పెరుగుతాయి. ఈ చెట్లనుంచి వీచేగాలి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. నీలగిరి చెట్టు ఆకులు, వేళ్ళు, చెట్టుబెరడు ఆయుర్వేద వైద్యంలో వాడబడుతుంది. నీలగిరి తైలం ఔషధంగా ఉపయోగిస్తుంది. ఈ తైలాన్ని ఇంగ్లీషులో యూకలిప్టస్‌ ఆయిల్‌ అంటారు.
1. ఈ తైలం వాసన ఘాటుగా ఉంటుంది. ఇది నొప్పులకు నివారణగా పనిచేస్తుంది.
2. తలనొప్పితో బాధపడేవారు నీలగిరి తైలాన్ని నుదుటికి పట్టిస్తే, నొప్పి తగ్గిపోతుంది.
3. ఈ తైలాన్ని సన్నని క్లాత్‌మీద వేసి వాసన చూస్తుంటే జలుబు, గొంతునొప్పి తగ్గి పోతుంది.
4. మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే యూకలిప్టస్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేసి, వేడినీటితో కాపడం పెట్టాలి.
5. మడమ నొప్పి వచ్చి నడవలేకపోతూంటే ఆ ప్రాంతంలో నీలగిరి తైలంతో బాగా మసాజ్‌ చేయాలి.
6. గోరువెచ్చని నీటిలో మూడు, నాలుగు చుక్కల నీలగిరి తైలాన్ని కలిపి త్రాగినట్లయి తే అజీర్ణం, అజీర్తి విరేచనాలు తగ్గుతాయి.
7. నడుం నొప్పితో బాధపడేవారు నీలగిరి తైలాన్ని వేడినీటిలో కలిపి నొప్పి ఉన్న ప్రదేశంలో కాపడం పెడితేనొప్పి ఉపశ మిస్తుంది.
8. ఒళ్ళు నొప్పులుగా ఉంటే, స్నానం చేసే నీటిలో ఏడెనిమిది చుక్కల నీలగిరి తైలాన్ని కలిపి స్నానం చేస్తే నొప్పులన్నీ తగ్గిపోతాయి.
9. పిప్పి పన్నుతో చెంపవాచి బాధ కలుగుతున్నప్పుడు, చెంప మీద యూకలి ప్టస్‌ ఆయిల్‌ను రాస్తే నొప్పి తగ్గుతుంది.
10. నీలగిరి తైలం వాడకం వల్ల చర్మానికి ఎటువంటి ఎలర్జీలు ఏర్పడవు.


ఇవి కూడా చూడండి[మార్చు]

నీలగిరి చెట్టు