అవిసె నూనె

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అవిసె పూలు
పందిన కాయలు
అవిసె గింజలు
అవిసె నూనె

అవిసె మొక్క లినేసి /లైనేసి కుటుంబానికి చెందినమొక్క.ఈమొక్క వృక్షశాస్త్రనామము:Linum usitatissimum.తెలుగులో అవిశ అనేపేరుతో చెట్టు వున్నది. ఆచెట్టు ఫాబేసి కుటుంబానికి చెందినది.ఆచెట్టు వృక్షశాస్త్రనామం:సెస్బానియా గ్రాండిఫ్లోరా.కావున కొన్నిసందర్భాలలో అవిసెను అవిశగా పొరబడే అవకాశమున్నది.ఈవ్యాసంలో పెర్కొన్న అవిసెను ఆంగ్లంలో linseed లేదా Flaxseed అంటారు.వ్యవసాయపంటగా నూనెగింజలకై సాగుచేయు మొక్క.ఏకవార్షికం.

ఇతరభారతీయభాషలలో అవిసె పేరు[మార్చు]

  • హింది,గుజరాతి,పంజాబి:అల్సి(Alsi)
  • మరాతి:జరస్(jaras),అల్సి,(Alsi)
  • కన్నడం:అగసె(agase)
  • తమిళం:అలిరిథల్(alirithal)
  • ఒరియా:పెషి(peshi)
  • బెంగాలి,అస్సామీ:తిషి(Tishi),అల్సి(Alsi)

ఈపంటను సాగుచేస్తున్న రాష్ట్రాలు[మార్చు]

భారతదేశంలో మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్,బీహరు,రాజస్తాన్,బెంగాలు,మరియు కర్నాటక రాష్ట్రాలు సాగుచేస్తున్నవి[1].

నూనెగింజలు[మార్చు]

మొక్కలు నాలుగడుగుల ఎత్తువరకు పెరుగును,[2] .ఆకులు20-40మి.మీ.పొడవుండి,3మి.మీవెడల్పు వుండును.ఇందులో రెండురకాలున్నాయి.చిన్నగింజల రకం,పెద్దగింజల రకం.చిన్నగింజలు బ్రౌనురంగులో,పెద్దవి పసుపురంగులో వుండును.పూలు లేతనీలంరంగులో వుండును.విత్తనదిగుబడి వర్షాధారమైనచో 210-450 కిలోలు/హెక్టారుకు వచ్చును.నీటిపారుదలక్రింద 1200-1500కిలోలు/హెక్టారుకు దిగుబడివచ్చును.నూనెశాతం చిన్నరకంగింజలలో 33.0% వరకు పెద్దగింజలలో 34-36%వరకుండును.గింజలలో 15-29% వరకు చక్కెరలు,5-10%వరకు పీచుపదార్థం(Fiber)వుండును.మాంసకృత్తులు 20-24% వరకుండును.నూనెగింజలు ఆపిలు పండు గింజలఆకారంలో వుండి,పైపొట్టు మెరుపుగా వుండును.పొడవు 4-6మి.మీ.పొడవుండును.చిన్నరకంగింజలైనచో గ్రాముకు 170 వరకు,పెద్దగింజలైనచో 130 వరకు తూగును.

నూనె[మార్చు]

అవిసె నూనెగింజలను మొదట నూనెతీయుయంత్రాలలోఆడించి నూనెను తీసి,కేకులోవున్న నూనెను సాల్వెంట్ ఎక్సుట్రాక్షను ప్లాంటుద్వారా తీయుదురు.నూనెతీయుయంత్రాలలో నూనెను రెండు పద్ధతులలోతీయుదురు.ఒకటి కోల్డుప్రాసెస్.ఈపద్ధతిలో నూనెగింజలను వేడిచెయ్యకుండ నేరుగా ఎక్సుపెల్లరులను నూనెతీయుయంత్రాలలో క్రష్‍చేయుదురు.ఈపద్ధతిలో వచ్చిననూనె పసుపురంగులో వుండును.కాని కేకులో ఎక్కువశాతం నూనెమిగిలిపోవును. హాట్‍ప్రాసెసు పద్ధతిలో గింజలను స్టీముద్వారామొదట వేడిచేసి ఆపిమ్మట క్రష్‍ చేయుదురు.ఈ పద్ధతిలో సేకరించిన నూనెకొద్దిగా ముదురు పసుపురంగులో వుండును.కాని గింజలనుండివచ్చుదిగుబడి ఎక్కువవుండును.

అవిసె నూనె బౌతిక లక్షణాలు (ముడి నూనె),[3]

లక్షణాలు విలువలమితి
తేమ 0.25
వక్రీభవణ సూచిక 400C 1.4720-1.4750
సాంద్రత 300C/300C 0.923-0.928
సపొనిఫికేసను విలువ 188-195
ఐయోడిన్ విలువ 170 కనిష్టం.
అన్‍సపోనిఫియబుల్‍పదార్థం 1.5-2.0%
Foots 1.0 గరిష్టం

అవిసె నూనెలోని కొవ్వు ఆమ్లాలశాతం (భారతదేశం లో)[3]

కొవ్వు ఆమ్లాలు శాతము
పామిటిక్ ఆమ్లంC16:0 4-16
స్టియరిక్ ఆమ్లంC18:0 0.-10.0
ఒలిక్ ఆమ్లంC18:1 13-38
లినొలిక్ ఆమ్లంC18:2 7-18
లినొలెనిక్ ఆమ్లంC18:3 35-67

విదేశాలలో ఉత్పత్తిఅగు అవిసెనూనెలో వున్న కొవ్వుఆమ్లాలశాతం

కొవ్వు ఆమ్లాలు శాతం
పామిటిక్ ఆమ్లం.C16:0 6.0
పామిటొలిక్ ఆమ్లం.C16:1 0.0-0.5
స్టియరిక్ ఆమ్లం.C18:0 2.0-3.0
అరచిడిక్ ఆమ్లం.C20:0 0-0.5
ఒలిక్ ఆమ్లం.C18:1 10.0-22.0
లినొలిక్ ఆమ్లం.C18:2 12.0-18.0
లినొలెనిక్ ఆమ్లం.C18:3 56.0-71.0

నూనె వినియోగం[మార్చు]

అవిసె నూనెలో మూడు ద్విబంధాలున్న లినొలెనిక్ కొవ్వు ఆమ్లం 55% దాటి వుండటంవలన ఈనూనె మంచి డ్రయింగ్(drying oil)నూనె లక్షణాలుకల్గివున్నది.బహుద్విబంధాలున్న కొవ్వు ఆమ్లాలు త్వరగా పాలిమరులుగా మార్పుచెందుతాయి.అందుచే రిఫైండు చేసిన అవిసెనూనెను నేరుగా రంగులలో కలుపు తిన్నరు(thinner) గా వినియోగిస్తారు.అలాగే రంగుల పరిశ్రమలలో కూడా [4].[5].మరి చిత్రకళలో ఉపయోగించు రంగుల తయారిలో అవిసె నూనెను ఉపయోగిస్తారు. .అల్ఫా-లినొలెనిక్ కొవ్వు ఆమ్లం ఎక్కువగా వున్నందున,అవిసె రిఫైండునూనెను కొద్దిమొత్తంలో ఇతర రిఫైండు నూనెలో కలిపి వంటనూనెగా ఉపయోగించవచ్చును.[6]

ఆధారాలు-అంతరలింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అవిసె_నూనె&oldid=1468949" నుండి వెలికితీశారు