దాల్చిన నూనె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దాల్చిన నూనె ఒక ఆవశ్యక నూనె.దాల్చిన చెట్టు యొక్క బెరడును దాల్చిన చెక్క అంటారు.దాల్చిన చెక్కను ఆనాదిగా చీనా, ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించినట్లు తెలుస్తున్నది.అలాగే దాల్చిన నూనెను కూదా వైద్యంలో, కాస్మాటిక్సులలో,, వంటలలో వాడుతారు . దాల్చిన చెక్కను ఆహారంలో /వంటల్లో మంచి వాసన రుచి ఇచ్చుటకు ఉపయోగిస్తారు.దాల్చిన నూనెను పలు జబ్బుల నివారణకు ఇతర మందులతో కలిపి ఉపయోగిస్తారు.దాల్చిన నూనెను దాచిన చెట్టు బెరడు, ఆకులనుండి ఉత్పత్తి చేస్తారు.దాల్చిన చెట్టు వృక్షశాస్త్ర పేరు సిన్నమోముమ్ జిలానీకమ్ (Cinnamomum zeylanicum ) దీనికి మరోపీరు సిన్నమోముమ్ వెర్వున్ (Cinnamomum vervun)

దాల్చిన నూనె[మార్చు]

దాల్చిన నూనెను దాచిన చెట్టు బెరడు, ఆకులనుండి ఉత్పత్తి చేస్తారు.బెరడు నుండి తీసిన నూనెను దాల్చిన చెక్క ఆవశ్యకనూనె యని, ఆకుల నుండి తీసిన నూనెను దాల్చిన ఆకుల ఆవశ్యక నూనె యని అంటారు.దాల్చిన చెట్టు బెరడు నుండి తీసిన నూనె, ఆకుల నుండి తీసిన నూనె ఇంచుమించు ఒకే రకమైన రసాయన సమ్మేళనాలను కల్గి వున్నను, వాటిపరిమాణంలో తేడా వుండును.దాల్చిన నూనెలో వున్న ప్రధానమైన వృక్ష సంబంధ రసాయన పదార్థాలు సిన్నమాల్డిహైడ్ (Cinnamaldehyde), సిన్నమైల్ ఆసిటేట్ (Cinnamyl Acetate), యూజనోల్,, యూజనోల్ ఆసిటేట్.[1]

సిన్నమాల్డిహైడ్ అనేది నూనెకు ప్రత్యేకమైన వాసన ఇస్తుంది. అంతేకాక యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ మైక్రోబియల్ గుణాలను కల్గి ఉంది.

సిన్నమైల్ ఆసిటేట్ వలన నూనెకు సువాన కారకం, తియ్యని, మిరియాల వంటి వాసన వెదజల్లును.సుగంధ ద్రవ్యాలలో (perfumes) ఉపయోగిస్తారు.క్రిమి కీటకాలను పారద్రోలులక్షణం ఉంది.

యూజనోల్ నొప్పులను తగ్గిస్తుంది, పుండ్లను మాన్పు తుంది.యాంటీ సెప్టిక్, యాంటీ ఇఫ్లమేటరీ,, అనాజేసిక్ గుణాలు కల్గి ఉంది.బాక్టీరియాను నిర్మూలిస్తుంది.చాలా రకాల శిలీంద్రాలవృద్ధిని నిరోధిస్తుంది.[1]

యూజనోల్ ఆసిటేట్ యాంటీ ఆక్సీడెంట్ స్వాభావం ఉంది.లవంగ నూనె వంటి వాసన వెలువరించును.

రసాయనిక ,భౌతిక లక్షణాలు[మార్చు]

నూనె రసాయనిక ఫార్ములా C19H22O2.అణుభారం:282.383 గ్రాములు/మోల్.ఇథనాల్ అనే ఆల్కహాల్ లో కొంత పరిమాణంలో కరుగును.దాల్చిన బెరడు/చెక్క నూనె మూడువంతుల 70% ఇథనాల్ లో ఒక వంతు కరుగును.దాల్చిన ఆకు నూనె అయినచో 2 వంతుల 70% ఇథనాల్‌లో ఒకవంతు దాల్చిన నూనెకరుగును.దాల్చిన చెక్క నునే సాంద్రత (25 °C)1.010-1.030 గా, దాల్చిన ఆకు నూనె సాంద్రత (20 °C)1.037-1.053 వుండును.ఎక్కువ సేపు గాలి తగిన నూనె రంగు గాఢంగా మారి, నూనె చిక్కబడును.ఎక్కువ వేడి చేసిన వగరు రుచి పొగలు, వెలువడి ఇరిటెసన్ కల్గించును.నూనెలో సిన్నమాల్డిహైడ్ /సిన్నమిక్‌ఆల్దిహైడ్ 55-78% వరకు, యూజనోల్ 10% వరకు ఉండును.[2]

దాల్చిన నూనె సంగ్రహణ/ఉత్పత్తి[మార్చు]

దాల్చిన చెక్క, దాల్చిన ఆకుల నూనెను స్టీము డిస్టిలేసను పద్ధతిలో ఉత్పత్తి చేస్తారు. నూనెను టీయూ పరికర సముదాయం

 • 1.డిస్టిలేసన్ పాత్ర
 • 2.కండెన్సరు
 • 3.సంగ్రహణ పాత్ర.
 • 4.ఫిల్టరు

విధానం[మార్చు]

డిస్టీలరు అను ఒక స్టీల్ పాత్రలో దాల్చిన చెక్క పొడిని లేదా ఆకుల పొడిని తీసుకుని, దానికి నీటీని తగినంత చేర్చి, పాత్రను అడుగునుండి వేడిచేసిన, నీరు ఆవిరిగా /స్టీముగా మారి, దాల్చిన చెక్క, లేదా ఆకుల ద్వారా పయనించు సమయంలో, వాటిలోని నూనెను ఆవిరిగా మార్చును.నీటి ఆవిరి,, నూనె ఆవిరులు డిస్టీలరు పైభాగాన వున్న ఒక గొట్టం ద్వారా కండెన్సరుకు వెళ్ళును. కండెన్సరులో ఆవిరి గొట్టం వెలుపలి భాగంలో చల్లని నీరు ప్రవహించు ఏర్పాటు వుండును. అక్కడ నీటి ఆవిరి, దాల్చిన నూనె ద్రవీకరణ చెంది, సంగ్రహణ పాత్రలో చేరును. సంగ్రహణ పాత్రలో జమ అయిన నూనె, నీటి మిశ్రమాన్ని కొన్ని గంటలు కదఫా కుండా వుంచాలి. అప్పుడు నూనె, నీరు వేరు వేరు పొరలుగా/మట్టాలుగా ఏర్పడును.నూనె సాంద్రత నీటి కన్న ఎక్కువ కావున పైభాగాన నీరు, ఆడుగు భాగాన నూనె చేరును, నూనెను వేరు పరచి, వడబోసీ భద్ర పరుస్తారు.పాత్రలో తీసుకున్న దాల్చిన చెక్క పరిమాణాన్ని బట్టి సంగ్రహణకు 5-6 గంటల సమయం పట్టును.

దాల్చిన నూనె వినియోగం[1][మార్చు]

 • ఆరోమాపతిలో దాల్చిన నూనెను డిప్రెసన్ తగ్గించుటకు ఉపయోగిస్తారు,
 • దాల్చిన నూనెను ఇన్ఫ్లమెసను తగ్గించుటకు, ఇమ్యూనిటి పెంచుటకు, వంటి నొప్పులను తగ్గించుటకు, జీవన క్రియను వృద్ధిపరచుటకు ఉపయోగిస్తారు.[3]
 • కాస్మోటిక్స్‌లో యాంటీ ఆక్సిడెంట్ గా, స్టీములెంట్ గా, ఆస్ట్రిణ్జెంట్ గా (Astringent) గా ఉపయోగిస్తారు.
 • యాంటీ పారసిటిక్‌గా, యాంటీ ఇన్ఫ్లమాటోరిగా, యాంటీ వైరల్‌గా, ఇమ్మున్ బూస్టరుగా, యాంటీ బాక్టీరియాల్ గా, యాంటీ ఫంగల్‌గా, యాంటీ సెప్టిక్‌గా, ఇలా పలురకాలుగా ఉపయోగ పడును.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 "ALL ABOUT CINNAMON OIL". newdirectionsaromatics.com. Retrieved 06-08-2018. Check date values in: |accessdate= (help)
 2. "Oils, Cinnamon". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 06-08-2018. Check date values in: |accessdate= (help)
 3. "40 Amazing Benefits And Uses Of Cinnamon Essential Oil". stylecraze.com. Retrieved 06-08-2018. Check date values in: |accessdate= (help)