కొకుం నూనె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొకుమ్
కొకమ్ పళ్ళు, విత్తనాలు,గుజ్జు , పళ్ళ తొక్కలు.jpg
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
Species:
G. indica

Binomial name
Garcinia indica

కొకుం చెట్టును ఆంగ్లంలో వైల్డ్ మాంగొస్టెన్ (Wild mangosten) అంటారు. కొన్నిచోట్ల రెడ్ మాంగొస్టెన్ అనికూడా వ్యవహరిస్తారు. ఈచెట్టు క్లూసియేసి / గట్టిఫెరె (Gutiferac) కుటుంబానికి చెందినది. వృక్షశాస్త్రనామము: గర్సినియ ఇండికా ఛొయిసి (Garcinia indica choisy).

భారతదేశంలోని వివిధ భాషల్లో పేర్లు[1][2][మార్చు]

పళ్లు-గింజలు[మార్చు]

ఏప్రిల్-మే మాసాలలో పక్వాని కొస్తాయి. నిమ్మకాయ పరిమాణంలో వుండి, తియ్యగా వుండును. పండు 2-3 సెం.మీ వ్యాసముండును .పళ్ళలో అంతోసైనిన్, సైనడిన్3-గ్లుకొసైడ్ లనుకల్గి వుండును. పండు పండినప్పుడు పర్పుల్ రంగులో వుండును.పండులో నూనెగింజల శాతం 20-23% వరకు వుండును. పండులో 5నుంచి 8 వరకు నూనె గింజలుండును. గింజలో నూనెశాతం 23-26% . ఒక చెట్టునుండి 60-80 కిలోల పళ్లు, 10-15 కిలోల గింజలు లభ్యమగును. పళ్ళను ఏప్రిల్-మే నెలలలో సేకరిస్తారు. నూనెగింజలో విత్తనం (kernel) 60% వుండును.గింజలోని నూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాల శాతం ఎక్కువ అందుచే ఈనూనె యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత 41-420C మధ్యలో వుండును. విత్తనంలో నూనె 44% వరకుండును. గింజలో తేమ 8-9% వరకుండును. గింజలో మాంసకృత్తుల (proteins) శాతం 17% వరకుండును. సంవత్సరానికి 1,280 టన్నుల విత్తన సేకరణకు అవకాశమున్నది. 500 టన్నుల నూనెను ఉత్పత్తి చెయ్యవచ్చును.

నూనెను తీయుట[మార్చు]

14-15% వరకు సంప్రదాయ పద్ధతిలో, గింజలను చక్కెరొకళ్లతో నలగగొట్టి పై పొట్టును తొలగించి (decortication) నీటిలో మరగించడం వలన తీయుదురు. ఈ పద్ధతిలో కేవలం 25% వరకు మాత్రమే నూనెను పొందగలరు. ప్రస్తుతం పొట్టుయంత్రాల (Decorticators) ద్వారా పొట్టును తొలగించి, ఎక్సుపెల్లరు (Expellers) నూనెతీయు యంత్రాలతొ నూనెను తీస్తున్నారు. నూనె యంత్రాల ద్వారా 35% వరకు నూనెను తీయవచ్చును. గింజలపిండి (cake) లో మిగిలిన నూనెను (6-10%) సాల్వెంట్‍ఎక్సుట్రాక్షన్ విధానంలో సంగ్రహించెదరు.

కొకుం నూనె[మార్చు]

కొకుం నూనెలో సంతృప్త కొవ్వుఆమ్లాలు60% వరకు వుండటం వలన సాధారణ ఉష్ణోగ్రత వద్ద నూనె ఘనరూపంలో వుండట వలన దీనిని కొకుం బట్టరు (kokum butter) అని వాడుక పేరు. పసుపు లేదా లేత గ్రే రంగులో, పూసలవలె ఏర్పడి వుండును.

కొకుం బట్టరు భౌతిక లక్షణాలపట్టిక[1][3]

భౌతిక లక్షణాలు మితి
వక్రీభవన సూచిక 600Cవద్ద 1.4565-1.4575
ఐయోడిన్ విలువ 32-40
సపనిఫికెసను విలువ 187-191
అన్‌సఫొనిపియబుల్ పదార్థం 1.0-2.0 గరిష్ఠం
ద్రవీభవన ఉష్ణత 41-420C
 • ఐయోడిన్‌విలువ:ప్రయోగశాలలో 100గ్రాములనూనెచే గ్రహింపబడు ఐయొడిన్‌గ్రాములసంఖ్య.ప్రయోగసమయంలో ఫ్యాటి ఆసిడుల ద్విబంధమున్న కార్బనులతో ఐయోడిను సంయోగంచెంది, ద్విబంధాలను తొలగించును. ఐయోడిమ్ విలువ అసంతృప్తఫ్యాటి ఆసిడ్‌లు ఏమేరకు నూనెలో వున్నది తెలుపును.
 • సపొనిఫికెసను విలువ:ఒకగ్రాము నూనెలోని ఫ్యాటిఆసిడులను సబ్బుగా (saponification) మార్చుటకు కావలసిన పోటాషియంహైదృఆక్సైడ్, మి.గ్రాంలలో.
 • అన్‌సపొనిఫియబుల్‌మేటరు: పోటాషియం హైడ్రాక్సైడుతో సపొనిఫికెసను చెందని నూనెలో వుండు పదార్థంలు. ఇవి అలిపాటిక్‌ ఆల్కహల్‌లు, స్టెరొలులు, హైడ్రొకార్బనులు, రంగునిచ్చు పదార్థములు (pigments), రెసినులు.

కొకుం బట్టరులోని కొవ్వు ఆమ్లంలశాతం[1][3]

ఫ్యాటి ఆమ్లాలు శాతం
పామిటిక్ ఆమ్లం 2.5-5.3
స్టియరిక్ ఆమ్లం 52-56
మిరిస్టిక్ ఆమ్లం 1.2
ఒలిక్ ఆమ్లం 39.4-41.5
లినొలిక్ ఆమ్లం 1.7

కొకుం బట్టరు/నూనె ఉపయోగాలు[మార్చు]

 • చాకొలెట్ తయారిలో విరివిగా వాడు కొకో బట్టరుకు బదులుగా (substitute) వాడెదరు[4]
 • సబ్బుల తయారిలోను
 • కొవ్వొత్తుల తయారిలోని
 • కాస్మోటిక్సు తయారిలోన[5]
 • మందుల (Medicines) తయారిలోను
 • నెయ్యి (ghee) లో కల్తిగా.
 • కొకుం బట్టరుకు ఆక్సీకరణ నిరోధగుణం అధికం.దీనిని పెదవుపగుళ్ళను నివారించు పూతమందుల తయారిలో, లేపనాల తయారిలో, మరిసు సబ్బులతయారిలో ఉపయోగిస్తారు.[6]

ఇవికూడా చూడండి[మార్చు]

చాయాచిత్రహారం[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 SEA HandBOOk -2009,by The Solvent Extractors' Association of India
 2. "Kokam". flowersofindia.net. Retrieved 2015-03-07.
 3. 3.0 3.1 "Kokum Fat-Garcinia indica Fat". pioneerherbal.com. Archived from the original on 2014-02-20. Retrieved 2015-03-07.
 4. [1] Application of kokum (Garcinia indica) fat as cocoa butter improver in chocolate.B Maheshwari, S Yella Reddy Journal of the Science of Food and Agriculture (Impact Factor: 1.44). 01/2005; 85(1):135 - 140. DOI:10.1002/jsfa.1967
 5. "Kokum Butter". kokum-butter.com. Retrieved 2015-03-07.
 6. "Incredible Benefits of Kokum Butter for Skin and Hair". beautyglimpse.com. Retrieved 2015-03-07.