ఖర్బుజగింజల నూనె
ఖర్బుజ కాయలను కర్బూజఅనికూడా అంటారు.ఈమొక్క దోసమొక్క కుటుంబానికి చెందినది.ఈమొక్కకుకుర్బిటేసి కుటుంబానికి చెందినది. వృక్షశాస్త్ర పేరు కుకుమిస్ మెలొ.లిన్నే (cucumis melo.linn).దోస, గుమ్మడి మొక్కలు కూడా ఇదే సస్యకుటుంబానికి సంబంధించిన ప్రాకెడు రకం మొక్కలు[1].ఈ మొక్క మొదటి పుట్టుక స్థానం పర్షియా (ఇరాన్, అక్కడి చుట్టుపక్కలా తూర్పుపడమర ప్రాంతాలుగా భావిస్తారు.ఈజిప్టులో లభించిన క్రీ.పూ.2400 సం.నాటి చిత్రంలో కర్బుజ పూలను చిత్రించారు.[2] పలుచటి లేదా మందపాటి పైపొర (తొక్క) కలిగి లోపల పండులోని భాగం మృదువుగా వుండి, తియ్యటి రుచి కల్గి వుండును. పండినకాయ ఒకరకమైన మంచి సువాసన వెదజల్లు చుండును.పండిన తరువాత ఎక్కువ రోజులు నిల్వవుండవు. పండ్లలోపలి భాగాన్నిఆహారంగా తీసికొనెదరు.ఈమొక్కలు ఇసుకనేలలో (నదుల, వాగులవడ్డున) బాగా పెరుగును.ఈమొక్క ఏగబ్రాకే పాకుడు మొక్క. ఈమొక్క భారతదేశమంత సాగులో వున్నప్పటికి ఉత్తర గుజరాత్,, రాజస్తాన్లలో, ఎక్కువగా సాగులోవున్నది.
- మరాఠీ, బెంగాలి:ఖర్బుజ్ (kharbuj)
- ఒరియా, హింది, పంజాబ్:ఖర్భుజా (kharbuza)
- కన్నడ:కక్కరికే (kakkarike)
- తమిళం:కక్కరికై (kakkarikaai)
- అస్సాం:ఛిరల్ (chiral)
- గుజరాతి:సక్కర్ తెతి (sakkar teti)
- మలయాళం:థై కుంబలం (thai kumbalom)
ఖర్బుజగింజలు
[మార్చు]ఖర్బుజ పండులోపలి మెత్తటి కండ లోపలి భాగంలో గింజలు వరుసగా వుండును. ఖర్బుజ పండును తినేటప్పుడు విత్తనాలను పక్కకుతీసి, గుజ్జు తింటారు. ఇలా పక్కకుతీసిన గింజలను నీటితోబాగాకడిగి శుభ్రంచేసి ఆర బెట్టెదరు (Drying).ఖర్బుజ గింజలు దోసగింజల్లా వుండి, వాటి కన్నకాస్త పెద్దవిగా వుండును.ఎండబెట్టిన గింజలను మిఠాయి (Confectionery) తయారిలో వినియోగిస్తారు. బస్‍స్టాండుల్లో, రైల్వే స్టేషను లలో చిన్నప్యాకెట్‍లలో 'టైమ్‍పాస్ గింజలు'అని అమ్మేదరు. గింజలలో 33% వరకు నూనె ఉంది.
ఈనూనె పుచ్చగింజల నూనె, నువ్వుల నూనె లలో వున్నట్లుగా కొవ్వుఆమ్లాలను, భౌతికథర్మాలను, రసాయనికలక్షణాలను కల్గివున్నది.నూనెలో లినొలిక్,, ఒలిక్ కొవ్వు ఆమ్లాల శాతం ఎక్కువ.
ఖర్బుజగింజల నూనె భౌతికలక్షణాల పట్టిక
భౌతిక లక్షణాలు | మితి |
వక్రీభవన సూచిక 400Cవద్ద | 1.468-1.487 |
ఐయోడిన్ విలువ | 120-128 |
సపనిఫికెసను విలువ | 188-196 |
అన్‌సఫొనిపియబుల్ పదార్థం | 1.0% గరిష్ఠం |
తేమశాతం | 0.25% గరిష్ఠం |
రంగు 1"సెల్, (y+5R) | 5 (రిపైండ్) |
విశిష్ట గురుత్వం 300/300C | 0.917-0.918 |
ఖర్బుజగింజల నూనెలోని కొవ్వు ఆమ్లాల శాతం
కొవ్వు ఆమ్లాలు | శాతం |
మిరిస్టిక్ ఆమ్లం (C14:0) | 1-2 |
పామిటిక్ ఆమ్లం (C16:0) | 3-7 |
స్టియరిక్ ఆమ్లం (C18:0) | 2-5 |
ఒలిక్ ఆమ్లం (C18:1) | 32-42 |
లినొలిక్ ఆమ్లం (C18:2) | 45-55 |
అరచిడిక్ ఆమ్లం (C20:0) | 0-9 |
నూనె ఉపయోగాలు
[మార్చు]- వనస్పతి తయారిలో ఇతరనూనెలలో కలిపి వాడుచున్నారు.
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Watermrlones". botanical-online.com. Retrieved 2015-03-09.
- ↑ "Muskmelons Originated in Persia". aggie-horticulture.tamu.edu. Retrieved 2015-03-09.
- ↑ 3.0 3.1 SEA HandBook-2009.by Solvent Extractors'Association of India