Jump to content

నారింజ నూనె

వికీపీడియా నుండి
Citrus sinensis (L.) Histoire et culture des orangers A. Risso et A. Poiteau. - Paris Henri Plon, Editeur, 1872

నారింజ నూనె లేదా తీపి నారింజ నూనె ఒక ఆవశ్యక నూనె, సుగంధ తైలం. నారింజ ఆవశ్యక నూనె ఔషధ గుణాలున్న ఆవశ్యక నూనె.నారింజ నూనెను నారింజ పళ్ల తొక్క (rind) నుండి కోల్డ్ కంప్రెసన్ ద్వారా తీస్తారు. నారింజ నూనెను ఆరోమాథెరపిలో ఉపయోగిస్తారు. అంతియే కాక జలుబు, ఫ్లూ జ్వరాన్ని తగ్గించును.అలాగే జీర్ణ కోశ వ్యాధులను కూడా తగ్గించును. నారింజ నూనె నాడీ వ్యవస్థను కూడా ఉత్తేజపరచును. నారింజను ఆంగ్లంలో ఆరంజి అంటారు. నారింజ రూటేసి కుటుంబానికి చెందిన చెట్టు.[1] నారింజలో పలు రకాలు ఉన్నాయి. నారింజ నూనెను సిట్రస్ సినేన్సిస్ అనే వృక్షశాస్త్రపేరు వున్న చెట్టు పళ్ల తొక్కాలనుండి సంగ్రహిస్తారు. సిట్రస్ సినేన్సిస్ ను పోర్చుగల్ లేదా ఛీనా నారింజ అనికూడా అంటారు. నారింజను కమలా లేదా కిచ్చిలి అని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటారు.

నారింజ చెట్టు

[మార్చు]

నారింజ చెట్టు సతతహరితం.ముదురు ఆకుపచ్చని ఆకులను, కల్గి వుండును.పూలు తెల్లగా వుండును. పూలు 5 రెక్కలు కల్గి వుండును. నారింజ పండు గుండ్రంగా వుండి ఆరెంజీ రంగులో వుండును. ఈ చెట్ల జన్మస్థానం చీనా.ప్రస్తుతం (2018నాటికి) అమెరికాలో నారింజ సాగు అధికంగా ఉంది.[2]

నూనె సంగ్రహణ

[మార్చు]

నారింజ పళ్లతొక్కల నుండి కోల్డ్ ప్రెస్ పద్ధతిలో నూనెను సంగ్రహిస్తారు. నూనె దిగుబడి 0.3-0.5% వరకు వుండును.[2]

నూనె

[మార్చు]

నూనె నీళ్ళ వంటి చిక్కదనం కల్గి పసుపు లేదాఅరేంజి రంగులో వుండును.మంచి తియ్యని సువాసన వెలువరించును. నూనెను 6 నెలలల కాలం నిల్వ వుంచవచ్చును.

నూనెలోని రసాయన పదార్థాలు

[మార్చు]

నారింజ నూనెలో చాలా రసాయన సంయోగ పదార్థాలు వున్నప్పటికి, ప్రధానంగా ఎక్కువ శాతంలో ఆల్ఫా పైనేన్, సబినెన్, మైర్సేన్, లిమోనేన్, లినలూల్, సిట్రోనెల్లాల్, నేరోల్,, జెరానియల్.[2]

రసాయనపదార్థం Italian Orange Oil[3] Concentration [%] Valencia orange oil[4] Concentration [%] Valencia orange oil[5] Concentration [%] Valencia orange oil[6] Concentration [%]
లిమోనెన్ 93.67 91.4 95.17 97.0
అల్ఫా-పైనెన్ 0.65 1.4 0.42
సబినేన్, బిటా-పైనెన్/పినేన్ 1.00 0.4 0.24
మైర్సెన్ 2.09 4.3 1.86 0.03
ఆక్టానాల్/Octanal 0.41 -
లినలూల్ 0.31 0.8 0.25 0.3
δ-3-కారేన్) / δ-3-Carene 0.31
డెకనాల్/Decanal 0.27 0.4 0.28

నూనె ఉపయోగాలు

[మార్చు]
  • ఆహారంలలో, పానీయాలలో సువాసన భరితమైన రుచిని ఇచ్చుటకు నారింజ నూనెను ఉపయోగిస్తారు. ఫర్నిసర్/చెక్క గృహోపకరణాలకు ఫర్నిషర్ పాలిష్ తో కలిపి పూతగా పూసిన కీటకాలనుండి సామానులను సంరక్షింఛును.[2]
  • నూనెలోని D-లిమోనెన్ గృహాల్లో, పరిశ్రమల్లోక్లీనింగు ఏజెంట్ గా పనిచేయును.[7]
  • జీర్ణ వ్యవస్థను మెరుగు పరచును. పొడి బారిన, రేగిన మేటిమలున్న చర్మంకు రాసిన ఫలితం వుండును. పరమళ ద్రవ్యాల్లో ఇతర నూనెల్లో కలిపి ఉపయోగిస్తారు.పాదాలను మృదువుగా చేయుటకు కూడా నూనెనుంవాడుతారు.[7]

నూనె వినియోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

[మార్చు]
  • నారింజ నూనె విష ప్రభావంలేని నూనె ఇరిటెంట్ గుణాలున్న నూనె.అయినప్పటికి పోటో టాక్సిక్ (కాంతి తగిలినపుడు విష గుణాలు చూపు) కావున నూనె వొంటికినూనె రాసుకున్నప్పుడు ఎండలో ఎక్కువ సేపు వుండరాదు.

బయటి లింకుల వీడియో

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Orange". britannica.com. Archived from the original on 2018-04-25. Retrieved 2018-10-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. 2.0 2.1 2.2 2.3 "Orange essential oil". essentialoils.co.za. Archived from the original on 2018-04-02. Retrieved 2018-10-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. A. Verzera; A. Trozzi; G. Dugo; G. Di Bella; A. Cotroneo (2004). "Biological lemon and sweet orange essential oil composition". Flavour and Fragrance Journal. 19 (6): 544–548. doi:10.1002/ffj.1348.
  4. J. Pino *; M. Sánchez; R. Sánchez; E. Roncal (2006). "Chemical composition of orange oil concentrates". Nahrung / Food. 36 (6): 539–542. doi:10.1002/food.19920360604.
  5. J. D. Vora; R. F. Matthews; P. G. Crandall; R. Cook (1983). "Preparation and Chemical Composition of Orange Oil Concentrates". Journal of Food Science. 48 (4): 1197–1199. doi:10.1111/j.1365-2621.1983.tb09190.x.
  6. R. L. Colman; E. D. Lund; M. G. Moshonas (1969). "Composition of Orange Essence Oil". Journal of Food Science. 34 (6): 610–611. doi:10.1111/j.1365-2621.1969.tb12102.x.
  7. 7.0 7.1 "Soak Up Sweet Orange Oil's Health Benefits". articles.mercola.com. Archived from the original on 2018-01-26. Retrieved 2018-10-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)