పైన్ గింజల నూనె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పైన్ చెట్టు
పైన్ చెట్టుపుష్ప విన్యాసం, గింజలు

పైన్ గింజల నూనె (pine seed oil) కొవ్వు ఆమ్లాలను కల్గిన శాక నూనె.ఈ నూనెను ఆంగ్లంలో pine seed oil లేదా pine nut oil అంటారు.పైన్ చెట్లు పైనేసి కుటుంబానికి చెందిన, పైనస్ ప్రజాతి, Pinoideae ఉపకుటుంబానికి చెందినవి. వీటిని శృంగాకార వృక్షాలు అంటారు.అనగా కొమ్ము వంటి కొమ్మల, ఆకుల విన్యాసం వున్న చెట్లు.పైన్ గింజల నూనెను వంతలలో, ఔషదపరంగా వాడెదరు.విప్లవానికి ముందు కాలపు రష్యాలో పైన్ గింజల నూనెను కడుపు నొప్పి, ప్రేవులకు సంబంధించిన సమస్యల నివారణకు మందుగా వాడేవారు.

పైన్ చెట్లు[మార్చు]

పైన్ చెట్లు పైనేసి కుటుంబానికి చెందిన, పైనస్ ప్రజాతి, Pinoideae ఉపకుటుంబానికి చెందినవి. వీటిని శృంగార వృక్షాలు అంటారు. కొమ్ము వంటి కొమ్మల, ఆకుల విన్యాసం వున్న చెట్లు.పైన్ చెట్లు దాదాపు 35 రకాలు ఉన్నాయి.[1] పైన్ చెట్లు సతతహరిత చెట్లు.జాతిని బట్టి పై చెట్లు 3 నుండి 80 (10–260అదుగులు) మీటర్లేత్తు పెరుగును.అపిన్ చెట్ల జీవితకాలం చాలా ఎక్కువ.100 నుండి 1000 సంవత్సరాలవరకు జీవించి వుండును.[2]

నూనె[మార్చు]

పైన్ నట్ ఆయిల్ లేదా పైన్ గింజల నూనెను పైన్ జాతికి చెందిన పలు రకాల జాతి చెట్ల గింజల నుండి ఉత్పత్తి చేస్తారు.యూరోపియన్, అమెరికా రకానికి చెందిన పైన్ గింజల నుండి తీసిన నూనెను వంటలలో ఉపయోగిస్తారు.సైబెరియన్ పైన్ (రష్యా, మంగోలియా,, ఖజాకిస్తాన్ లో పెరిగే చెట్లు), కొరియన్ పైన్ (చైనా, ఉత్తర కొరియాలో పెరిగే చెట్లు) గింజల నూనెలు ఎక్కువ పరిమాణంలో పినోలిక్ ఆమ్లం, యాంటి ఆక్సిడెంట్ లను కల్గి ఔషధప్రయోజనాలను కల్గి వున్నది

పైన్ గింజల నూనె తక్కువ స్మోక్ పాయింట్ ( స్మోక్ పాయింట్అనగా నూనెను వేడి చేసినపుడు ఏఉష్ణోగ్రత వద్దనూనెపొగను వెలువరించునో ఆఉష్ణోగ్రతను ఆనూనె స్మోక్ పాయింట్ అంటారు) కల్గి వున్నందున ఈ నూనెను వంటలో తయారు చేయుట కంటే తయారైన వంటల్లో డ్రెస్సింగుగా ఉపయోగిస్తారు.పైన్ నూనెను ఔషధ నూనె కన్న ఆరోమాథెరపిలో ఉపయోగిస్తారు.పైన్ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లున్నందున నూనెను ప్రేవులకు సంబంధించిన కురుపులను/పుండ్లను మాన్పును.2008 లో ఫుడ్ కెమిస్ట్రీ జర్నల్ లో ప్రకటించిన ఆద్యానం ప్రకారం పైన్ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్ పదార్థాలు దేహ వ్యవస్థలో ఫ్రీ రాడికల్స్ ను అవరోధీంచ్చును. మేరీలాండ్ మెడికల్ సెంటరు ప్రకారం నూనెలోని యాంటిఆక్సిడెంట్‌లు దేహ కణాలలోని/పొరల లోని, రక్త నాళాలలోని ఫ్రీరాడికల్స్ వృద్దిని, ఆక్సీడేసనును నిలువరించును.[2] కొన్ని శతాబ్దాలుగా పైన్ నట్ ఆయిల్ ను జబ్బుల నివారణకున్మారియు వంట నూనెగా వాడినట్లు తెలుస్తున్నది. 1017 విప్లవానికి ముందు రష్యాలో పైన్ నట్ ఆయిల్ ను ప్రధానంగా ఇళ్ళలో వంటకు వాడేవారు.నూనూ విక్రయ వ్యాపారాన్నిఫ్రాన్స్ తో జరిపేవారు.ఫ్రాన్స్ లో కూడా ఆకాలంలో వంటల్లో వాడేవారు.[3]

నూనె లోని కొవ్వు ఆమ్లాలు[మార్చు]

పైన్ గింజల నూనె లోస్టియరిక్,, పామిటిక్ అమ్లాలు సంతృప్త కొవ్వు ఆమ్లాలు.ఒలిక్ మరిము లినోలిక్ ఆమ్లాలు సంతృప్త కొవ్వుఆమ్లాలు.పినోలిక్ ఆమ్లం మూడు ద్విబంధమున్న ఆమ్లం.పినోలిక్ ఆమ్లం ఎంపిరికల్ ఫార్ములా C18H30O2

  • సైబేరిన్ ప్రాంతపు పైన్ గింజల నూనెలోని కొవ్వు ఆమ్లాలు[3]
వరుస సంఖ్య కొవ్వు ఆమ్లం శాతం
1 లినోలిక్ ఆమ్లం 49.0% ± 2.3
2 ఒలిక్ ఆమ్లం 23.8% ± 2.1
3 పినోలిక్ ఆమ్లం 17.1% ± 2.0
4 పామిటిక్ ఆమ్లం 6.3% ± 2.2
5 స్టియరిక్ ఆమ్లం 2.5% ± 0.1

నూనె వైద్య ప్రయోజనాలు[మార్చు]

పైన్ గింజల నూనె దేహంలోని LDL స్థాయిని తగ్గించును. LDL అనగా low density lipoprotein (లో డెన్సిటీ లిపో ప్రోటీన్).దీనిని హానికర కొలెస్ట్రాల్ అనికూడా అంటారు.ఎల్డిఎల్ (LDL) వలన రక్తనాళాల లోపలి మార్గం కుంచించుకుపోవడం వలన హృదయ సంబంధ ఆరోగ్య సమస్యలు ఏర్పడును. 2004 లో లిపిడ్స్ అనే జర్నల్ లో ప్రకటించిన ప్రకారం, కొరీయన్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలినది ఏమిటనగా పైన్ నూనెలోని పినోలిక్ ఆమ్లాన్ని గాఢ పరచిన హానికర కొలెస్ట్రాలును దేహ వ్యవస్థలో తగ్గించును.నూనెలోని పినోలిక్ ఆమ్లం కాలేయాన్ని ప్రేరేపించి ఎక్కువ LDL నూ కాలేయం విసర్జించేలా చేయును.అయితే ఇది నూనెను లేదా పైన్ గింజలను ఎక్కువ తీసుకోవడం వలన కాకుండా గాఢ పరచిన (concentrated) పినోలిక్ ఆమ్లం సేవించడం వలన హానికర కొలెస్ట్రాల్ తగ్గును.[2]

నూనె ఉపయోగాలు[మార్చు]

  • వొంటి బరువుతగ్గించును. నూనెలోని అమినో ఆమ్లాలు అవయవ వృద్ధికి సహకరించును.అందువలన పైన్ నూనె కలిపిన ఆహారం చిన్నపిల్లలకు, యువకులకు,, గర్భవతులకు ఆరోగ్యదాయకమైనది.[3]
  • నూనెలోని పినోలిక్ ఆమ్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాన్ని కల్గి ఉంది.[3]
  • రక్తం లోని లిపిడ్ స్పెక్ట్రమ్‌ను నియమ్తృంచడం వలన రక్త వత్తిడిని నియంత్రణలో వుంచును. కొరియా యూనివర్సిట్ లోని లైఫ్ అండ్ ఎంవీరోన్ మెంట్ సైన్సెస్ కాలేకి చెందిన అగ్రికల్చరల్ కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్ వారి ఆద్యాయనంలో పియన్ గింజల నూనె కొలెస్ట్రాల్ ను తగ్గించునాని రుజువు అయ్యింది.[3]
  • జీర్ణ వ్యవస్థకు, పొట్టకు సంబంధించిన సమస్యలను నివారించును.

బయటి వీడియోల లింకులు[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "The Plant List Version 1.1". Retrieved 15 December 2015.
  2. 2.0 2.1 2.2 "Pine Nut Oil Benefits". livestrong.com. https://web.archive.org/web/20170718134200/https://www.livestrong.com/article/272915-pine-nut-oil-benefits/. Retrieved 21-11-2018. 
  3. 3.0 3.1 3.2 3.3 3.4 "Pine Nut Oil". onlyfoods.net. https://web.archive.org/web/20170625162812/https://www.onlyfoods.net/pine-nut-oil.html. Retrieved 21-11-2018.