గ్రేప్‌ఫ్రూట్ ఆయిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గ్రేప్‌ఫ్రూట్
Grapefruit-Whole-&-Split.jpg
పింక్ గ్రేప్‌ఫ్రూట్
Scientific classification
Kingdom:
ప్లాంటె
(unranked):
ఆంజియోస్పెర్మ్స్
(unranked):
యూడికాట్స్
(unranked):
రోసిడ్స్
Order:
సాపిండేల్స్
Family:
Genus:
సిట్రస్
Species:
సిట్రస్ పారడిసి
Binomial name
సిట్రస్ × పారడిసి
Macfad.
లినలూల్
లెమోనేన్

'గ్రేప్‌ఫ్రూట్ ఆయిల్ లేదా గ్రేప్ఫ్రూట్ ఆయిల్ ఒక ఆవశ్యక నూనె.ఔషధ గుణాలున్న నూనె. గ్రేప్‌ఫ్రూట్ చెట్టు రూటేసి కుటుంబానికి చెందిన చెట్టు.గ్రేప్‌ఫ్రూట్ వృక్షశాస్త్ర పేరు సిట్రస్ పారడీసీ (Citrus paradise).లెమన్, లైమ్, ఆరంజి పండు చెట్లు కూడా రూటేసి కుటుంబానికి చెందినవే.

గ్రేప్‌ఫ్రూట్ చెట్టు[మార్చు]

గ్రేప్‌ఫ్రూట్ చెట్టు మూల స్థావరం ఆసియా.ప్రస్తుతం (2018 నాటికి) అమెరికా, బ్రెజిల్,, ఇజ్రాయెల్ దేశాల్లో సాగవుతున్నది.గ్రేప్‌ఫ్రూట్ చెట్టు ఆకులు నునుపును, మెఱుపునుకల్గి వుండును. చెట్టు 10 మీటర్ల ఎత్తు (32 అడుగులు) వరకు పెరుగును.పూలు తెల్లగా వుండును. ఫలాలు లేత పసుపు రంగులో పెద్దవిగా వుండును. పళ్ల తొక్క లోపలి పొరల్లో నూనె నిక్షిప్తమై వుండటం వలన నూనె దిగుబడి తక్కువ.[1] గ్రేప్‌ఫ్రూట్ చెట్తును సిట్రస్ రేస్ మోస,, సిట్రస్ మాక్షిమా అని కూడా అంటారు. ఈ చెట్టుకు గ్రేప్‌ఫ్రూట్ అనే ఇంగ్లీసు పేరు రావటానికి కారణం ద్రాక్ష పళ్లలా గ్రేప్‌ఫ్రూట్ పళ్ళు గుత్తులు గుట్టులుగా వుండటం వలన వచ్చింది.[2]

నూనె సంగ్రహణ[మార్చు]

గ్రేప్‌ఫ్రూట్ ఆయిల్‌ను పళ్ల తొక్కల నుండి కోల్డ్ కంప్రెసన్ పద్ధతిలో ఉత్పత్తి చేస్తారు. దిగుబడి 0.5-1.0% వుండును.[1]

గ్రేప్‌ఫ్రూట్ ఆయిల్[మార్చు]

గ్రేప్‌ఫ్రూట్ ఆయిల్ నూనె ఉల్లాసకరమైన వాసన వున్న నూనె.నూనె పాలిపోయిన పసుపు రంగు లేదా తేలికపాటి రూబీ (కెంపు) రంగులో వుండును.నూనె యొక్క స్నిగ్థత, నీటి స్నిగ్థతకు దగ్గరగా వుండును. గ్రేప్‌ఫ్రూట్ ఆయిల్ కూడా మిగతా సిట్రస్ ఆవశ్యక నూనెలవలే తయారైన ఆరు నెలలలోపే ఉపయోగించాలి. ఆతరువాత నూనె నాణ్యత తగ్గిపోవును.[1]

నూనెలోని రసాయన పదార్థాలు[మార్చు]

గ్రేప్‌ఫ్రూట్ ఆయిల్ లో దాదాపు 28 కి పైగా రసాయన పదార్థాలు వున్నప్పటికి ప్రధానమైనవి అల్ఫా-పైనేన్, సబినెన్, మైర్సేన్, లిమోనెన్, జెరానియోల్, లినలుల్, సిట్రోనెల్లాల్, డేసైల్ అసిటేట్, నేరైల్ అసిటేట్, టెర్పినెన్-4-ఒల్[1] గ్రేప్‌ఫ్రూట్ నూనెలో అధిక మొత్తంలో దాదాపు 88-95 శాతం లిమోనెన్ వుండును. పైన పెర్కొన్న వాటితో పాటు తుజెన్, టెర్పినేన్, కార్పిన్ అల్డిహైడ్ కూడా నూనెలో ఉన్నాయి.[2]

నూనెలోని కొన్ని ప్రధాన రసాయన సంయోగపదార్థాల శాతం పట్టిక (సాల్వెంట్ ఎక్సుట్రాక్సను ద్వారాతిసిన నూనె) [3]

వరుస సంఖ్య రసాయన సంయోగ పదార్థం శాతం
1 లేమోనేన్ 91.5–88.6%)
2 బీటా పైనేన్ 0.8–1.2%,
3 లినలూల్ 0.7-1.1%
4 ఆల్ఫా-టెర్పినెన్ 0.7–1.0%

నూనె బౌతిక గుణాలు[మార్చు]

నూనె భౌతిక గుణాల పట్టిక[4]

వరుస సంఖ్య భౌతిక గుణం విలువల మితి
1 విశిష్టగురుత్వం, 25 °C వద్ద 0.84800 - 0.85600
2 వక్రీభవన సూచిక, 20.00 °C వద్ద 1.47300 to 1.47900
3 దృశ్య భ్రమణం +91.00 - +96.00
4 బాష్పీభవన ఉష్ణోగ్రత 171.00 °C.
5 ఫ్లాష్ పాయింట్ 43.89 °C
6 ద్రావణీయత నీటిలో కరగాడు, ఆల్కహాలులో కరుగును.

నూనె ఔషధగుణాలు[మార్చు]

  • ఇది యాంటి డిప్రెసెంట్, యాంటి సెప్టిక్, ఆకలి కల్గించు, మూత్రవృద్ధికావించు, కృఇమి సంహారక గుణం తదితరాలు కల్గి ఉంది.[1]
  • వ్యాషి సంక్రమణ నిరోధక గుణం కల్గి ఉంది.[1]
  • యాంటీ మైక్రోబియల్ లక్షమ్ ఉంది.

నూనె ఉపయోగాలు[మార్చు]

  • గ్రేప్‌ఫ్రూట్ ఆయిల్ దేహంలోని విషకారక పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.ఇది దేహంలోని లింపాటిక్ వ్యవస్థను చైతన్యవంతం చేసి, దేహవ్యవస్థ లోని విషపదార్థాలను తొలగించి, అధిక ద్రవాలాను తొలగించి కొవ్వును కరిగేటట్లు చేస్తుంది
  • ఆరోమాథెరపిలో ఉపయోగిస్తారు. ఆవిరి రూపంలో పిచ్చిన హేంగోవర్ తగ్గును.అలాగే తలనొప్పిని, మానసిక ఆందోళనను, మానసిక విసుగును తగ్గించును.[2]
  • మొటిమల నివారణ లేపానాలు, ద్రవ్యాలలో గ్రేప్‌ఫ్రూట్ ఆయిల్ ను ఉపయోగిస్తారు.అలాగే కేశ తైలాలో కూడా ఉపయోగిస్తారు.[2]
  • గ్రేప్‌ఫ్రూట్ ఆయిల్ ఆకలిని పెంచును.జీర్ణవృద్ధికి తోడ్పడును.[2]
  • గదిలోని గాలిని పఱిమళ భరితం చేయటానికి, అలాగే కిచెన్ ఇతర గదుల్లోని దుర్గంధాన్ని తొలగించుటకు ఉపయోగిస్తారు.[2]
  • దేహ మర్ధన నూనెగా వొంటిమాలిస్ లో ఉపయోగిస్తారు.[2]

నూనె వాడకంలో జాగ్రత్తలు[మార్చు]

గ్రేప్‌ఫ్రూట్ ఆయిల్ విషగుణాలు నూనె అయినప్పతికి, సున్నిత చర్మతత్వమున్నవారికి వ్యతిరేక పరభావం చుపవచ్చును.వొటికి రాసుకుని ఎక్కువ సేపు సూర్యకాంతి తగిలేలా వున్నచో చర్మానికి ఇరిటేసను కలగవచ్చును.

బయటి వీడియో లింకులు[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]