షీ ఫ్యాట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షీ చెట్టు
షీ పళ్ళు
ట్రై గ్లిజరాయిడ్
షీ బట్టరు బాల్స్

షీ ఫ్యాట్ లేదా షీ బట్టరు అనే కొవ్వును షీ చెట్టు గింజల నుండి ఉత్పత్తి చేస్తారు.ఇందులో సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువ శాతంలో ఉన్నాయి. షీ కొవ్వు/వెన్న (బట్టరు) ను చాకోలేట్ తయారీలో కోకో కొవ్వుకు ప్రత్యామ్యాయంగా ఉపయోగిస్తారు.అలాగే మార్గరీన్‌ల తయారిలో ఉపయోగిస్తారు. కోకో బట్టరు కంటే రుచి కొద్దిగా వేరుగా వున్నను చాకొలెట్ తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాదు కాస్మోటిక్సులో ఉపయోగిస్తారు. షీ ఫ్యాట్ /బట్టరు సాధారణ ఉష్ణోగ్రత వద్ద మెత్తని ఘనరూపంలో వుండును

షీ(shea) చెట్టు[మార్చు]

షీ చెట్టు సపోటేసి కుటుంబానికి చెందినది.షీ వృక్షశాస్త్ర పేరు విటెల్లరియా పారడోక్సా (Vitellaria paradoxa).షీ చెట్టు 7 నుండి 15 మీటర్ల ఎత్తు వరకు పెరుగును.ఇది ఆకురాల్చు చెట్టు. సపోటేసి కుటుంబంలో విటెల్లరియా ప్రజాతిలో ఒకే ఒకరకం షీ చెట్టు. కొన్నిసార్లు 25 మీటర్ల వరకు పెరుగుతుంది.చెట్టు 10 నుండి 15 సంవత్సరాలనుండి పళ్ల దిగుబడి మొదలగును.పూర్తి దిగుబడి 20-30 ఏళ్లకు మొదలగును.దాదాపు 200 సంవత్సరాలవరకు పళ్ల దిగుబడి ఇచ్చును.షీ పళ్ళు రేగి పళ్లను పోలి పెద్దగా వుండును. పళ్ళు పక్వానికి రావటానికి 4 నుండి 6 నెలలు పట్టును.ఒకచెట్టుకు సరాసరి 15 నుండి 20 కిలోల తాజా పళ్ళు దిగుబడి వచ్చును.కొన్ని 45 కేజీలవరకు దిగుబడి ఇచ్చును.ఒకకేజీ పళ్లనుండి 400 గ్రాముల పొడి విత్తనాలు/గింజలు లభించును.

షీ చెట్టు ఆవాసం[మార్చు]

షీ చెట్టు పుట్టుక స్థానం పశ్చిమ ఆఫ్రికాలోని సవన్నా ప్రాంతం.సవన్నా ప్రాంతంలో దాదాపు 5000 కి.మీ.మేర షీ వృక్షాలు వ్యాపించి ఉన్నాయి.పశ్చిమ ఆఫ్రికా లోని సెనెగల్, బర్కీనా ఫస్కో, కోటెడ్ల్వోయిరే, మాలి, ఘనా, టోగో, బెనిన్, నైగేరియా, కేమరూన్, నైగర్, తూర్పున సూడాన్, ఉగాండా,, ఇథియోపియా వరకు ఈ చెట్లు ఉన్నాయి.పశ్చిమ ఆఫ్రికా లోని చెట్లను పారడోక్షా రకమని, తూర్పు ప్రాంతపు చెట్లను నీలోటీక రకం.[1]

షీ కొవ్వు లేదా బట్టరు[మార్చు]

షీ గింజలోని కెరనల్ (kernel) అనబడు పప్పుగుజ్జు (విత్తనంమెత్తని అంతర్భాగం) లో 50% వరకు షీ కొవ్వు ఉంది.[2]

షీ బట్టరు లోని కొవ్వు ఆమ్లాలు[మార్చు]

షీ ఫ్యాట్/బట్టరులో ప్రధానంగా పామిటిక్, స్టియరిక్, ఒలిక్, లినోలిక్,, అరచిడిక్ కొవ్వు ఆమ్లాలు ప్రధానమైనవి.ఇందులో కొవ్వులో 85-90% స్టియరిక్, ఒలిక్ ఆమ్లాలే వుండును.చెట్టు పెరిగిన ప్రాంతాన్ని బట్టి కొవ్వు లోని కొవ్వు ఆంలాల శాతంలో తేడాలు వుండును.ఉగాండా ప్రాంతం లోని విత్తన నూనెలో ఒలిక్ ఆమ్లం ఎక్కువగా ఉండి, గది /సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో వుండును.పశ్చిమ ఆఫ్రికా ప్రాంతంలోని షీ కొవ్వులో ఉగాండా ప్రాంతం కొవ్వు కన్న ఒలిక్ ఆమ్లం ఎక్కువగా 37నుండి55%. వరకు వుండును.

  • కొవ్వులోని ప్రధాన కొవ్వు ఆమ్లాల పట్టిక[1]
వరుస సంఖ్య కొవ్వు ఆమ్లం శాతం
1 పామిటిక్ ఆమ్లం 4
2 స్టియరిక్ ఆమ్లం 42
3 ఒలిక్ ఆమ్లం 45
4 లినోలిక్ ఆమ్లం 6
5 ఆన్ సపోనిఫియబుల్ పదార్థాలు 10

షీ కొవ్వులోని ఆన్ సపోనిఫియబుల్ పదార్థాలశాతంలోని పదార్థాలు.ఇవి కొవ్వులో 8-10% వరకు ఉన్నాయి.[1]

వరుస సంఖ్య రసాయన పదార్థం శాతం
1 ట్రై టర్పెన్ ఆల్కహాలులు 65
2 హైడ్రో కార్బనులు 27
3 స్టేరోల్స్ 8
4 టోకోపెరోల్స్ 0.805

భౌతిక గుణాలు[మార్చు]

షీ ఫ్యాట్ /కొవ్వు యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత 51 °C నుండి 56 °C మధ్య వుంటుంది.షీ కొవ్వు ద్రవీభవన ఉష్ణోగ్రత మిగతా ఉష్ణ మండల ప్రాంతానికి చెందిన అధిక సంతృప్త ఆమ్లాలు కల్లిగిన పామ్ ఆయిల్ (35 °C), పామ్ కెర్నల్ నూనె (24 °C), కొబ్బరి నూనె కన్న (24 °C) ఎక్కువ.కారణం షీ ఫ్యాట్/కొవ్వులో స్టియరిక్ ఆమ్లం ఎక్కువ శాతంలో ఉంది. కాగా పామ్ ఆయిల్ లో పామిటిక్ ఆమ్లం, పామ్ కెర్నల్, కొబ్బరి నూనెలో లారిక్ ఆమ్లం ఎక్కువ శాతంలో ఉన్నాయి. లారిక్, పామిటిక్ ఆమ్లాల కన్నా స్టియరిక్ ఆమ్లం ఎక్కువ కార్బనులను కల్గి వున్నందున దీని ద్రవీభవన స్థానం/ఉష్ణోగ్రత ఎక్కువ.ఆంతే కాకుండా షీ కొవ్వులో మిగతా నూనెలకన్నా ఎక్కువ శాతంలో 8-10% వరకు ఆన్ సపోనిఫియబుల్ పదార్థాలు వుండటం కూడా ఒక కారణం. కొవ్వు లేదా నూనెను క్షారంతో రసాయనిక చర్యకు (saponification) లోను కావించినపుడు సబ్బుగా మారని రసాయన పదార్థాలను ఆన్ సపోనిఫియబుల్ పదార్థాలు అంటారు. షీ ఫ్యాట్ లోని సపోనిఫియబుల్ పదార్థాలలో ట్రైటెర్పెను ఆల్కహాలులు, స్టేరోలు ఎక్కువ పరిమాణంలో ఉన్నాయి.వాటి ద్రవీభవన స్థానం కూడా ఎక్కువే.[1]

  • భౌతిక గుణాల పట్టిక[3]
వరుస సంఖ్య భౌతిక గుణం పరిమితి విలువ
1 సపోని ఫికేసను విలువ 141.65-169.79
2 అయోడిన్ విలువ 51.17-53.54
3 ఆమ్లవిలువ 15.52
4 విశిష్ట గురుత్వం 0.94 0=0.96

ఉపయోగాలు[మార్చు]

  • చాకొలెట్ ల తయారిలో కొకొబట్టరుకు బదులుగా ఉపయోగిస్తారు
  • మార్గరీన్ లతయారిలో విస్తారంగా వాడతారు.
  • కాస్మోటిక్సుల తయారిలో వాడతారు.[2]
  • అలాగే ఔషధాల తయారిలో ఉపయోగిస్తారు.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "Shea Butter: An Opposite Replacement for Trans Fat in Margarine". omicsonline.org. Archived from the original on 2018-06-02. Retrieved 2018-11-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. 2.0 2.1 2.2 "Oil extraction from sheanut". ncbi.nlm.nih.gov. Archived from the original on 2018-11-05. Retrieved 2018-11-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Physical and Chemical Characteristics of Shea nut Fat Extracts from Selected Areas of Kebbi State, Nigeria". rroij.com. Archived from the original on 2018-05-06. Retrieved 2018-11-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=షీ_ఫ్యాట్&oldid=3825876" నుండి వెలికితీశారు