అడవిఆముదం నూనె
అడవి ఆముదము చెట్టు పొదవలె పలు కొమ్మలు కలిగున్న చెట్టు. ఈచెట్టు వృక్షశాస్త్ర నామం జట్రొఫ కుర్‍కస్ (jatropha curcas). ఈ చెట్టులో పలు రకాలున్నాయి. ఈచెట్టు యుఫోర్బియేసి కుటుంబానికి చెందినది. ఈచెట్టు దక్షిణామెరికాకు చెందినది . పొర్చుగీసుల ద్వారా ఆఫ్రికా, ఆసియాదేశాలకు వ్యాప్తిచెందినది [1] వ్యవసాయానికి అనువుకాని నేలల్లో, బంజరు నేలలో, వర్షపాతం తక్కువ వుండు ప్రాంతాలలో పెంచుటకు అనువైన చెట్టు. నీటిఎద్దడిని తట్టుకొని పెరిగే మొక్క. భారతదేశంలో బయోడిసెల్ ఉత్పత్తికై ఈచెట్టు నూనెను ఉపయోగించుటకై వ్యవసాయానికి అనుకూలంగాని నేలలో సాగుచేయుటకై ప్రోత్యహిస్తున్నది భారతప్రభుత్వం.
- సంస్కృతం: కానన్ఎరండ్ (kanan-eramd), పర్వత్ ఏరండ్ (parvat-erand)
- హిందీ: సఫెడ్ ఎరండ్ (safed-erand), బాగ్ఎరండ్ (Bagh-erand)
- మలయాళం: కట్టవెనక్క (kattamanaku)
- తమిళం: అడ్డల కట్టమనకు (Addala kattamanaku)
- కన్నడం: కాడురలు (kadhuralu)
- గుజరాతి-రాజస్థాన్: రతన్జ్యోత్ (Ratanjyot), జంగ్లి ఎరండ్ (Jangli erand)
- మరాఠీ: మొగ్లి ఎరండ్ (mogli erand)
- ఒరియా: జహజిగబ (jahajigaba)
- అస్సామీ: బొంగలి (bongali)
- ఆంగ్లం: ఫిజిక్నట్ (phyic nut), ఫర్జింగ్నట్ (purging nut)
ఈ చెట్లు భారత దేశమంతటా వ్యాప్తి చెందివున్నప్పటికి ఎక్కువఎకరాలలో సాగుకు అవసరమైన భూములను ఈదిగువ పేర్కొన్న రాష్ట్రాలలో గుర్తించారు.
నూనెను ఉత్పత్తిచెయ్యుట
[మార్చు]విత్తనములో నూనె30-40% వరకుండును. కాయలను చక్కి (chakki) లేదా డికార్టికేటరు యంత్రాలలో ఆడి పైపొట్టును తొలగించి విత్తనాన్ని వేరుగా పొందెదరు.విత్తనాలను స్టీముద్వారా కుకింగ్‍చేసి ఎక్సుపెల్లరు నూనె యంత్రాలలో[4] ఆడించి, నూనెను ఉత్పత్తి చేయుదురు. గింజలనుండి ఎక్కువశాతం నూనె దిగుబడి పొందుటకై గింజలను యంత్రంలో డబుల్ క్రషింగ్ చేయుదురు. కేకులో మిగిలిన నూనెను సాల్వెంట్ పరిశ్రమలో ప్రాసెసెస్‍చేసి పొందెదరు. ఎక్సుపెల్లరులో ఆడినప్పుడు 29%వరకు రికవరి వుండును. సాల్వెంట్ఎక్సుట్రాక్షన్ ప్లాంట్ ద్వారా 39% వరకు రికవరి వుండు ను.
నూనె గుణగణాలు
[మార్చు]అడవి ఆముదం నూనెయొక్క గుణగణాలు (భౌతిక, రసాయనిక లక్షనాలు, కొవ్వు ఆమ్లాల సమ్మేళనం వేరుశనగ నూనెను పోలి వున్నప్పటికి, ఈనూనెలో వున్నకొన్ని టాక్సినుల వలన ఇది ఖాద్యతైలం కాదు.
అడవిఆముదం/జట్రోఫా నూనెలోని కొవ్వు ఆమ్లంలశాతం[5]
ఫ్యాటి ఆమ్లాలు | శాతం |
మిరిస్టిక్ ఆమ్లం | 0.5-1.4 |
పామిటిక్ ఆమ్లం | 15.3874 |
స్టియరిక్ ఆమ్లం | 6.26 |
అరచిడిక్ ఆమ్లం | 2.5-6 |
ఒలిక్ ఆమ్లం | 44.9 |
లినొలిక్ ఆమ్లం | 43.40 |
మొత్తం అసంతృప్త ఆమ్లాలు | 75.64 |
మొత్తం సంతృప్త ఆమ్లాలు | 24.36 |
అడవిఆముదం/జత్రోఫా నూనె భౌతికలక్షణాల పట్టిక[5]
భౌతిక లక్షణాలు | మితి |
వక్రీభవన సూచిక 400Cవద్ద | 1.496,280Cవద్ద |
విశిష్ట గురుత్వం 30/300C | 0.913,280Cవద్ద |
అయోడిన్ విలువ | 104.46 |
సపనిఫికెసను విలువ | 175.12 |
అన్‌సఫొనిపియబుల్ పదార్థం | 1.5-2.0% గరిష్ఠం |
హైడ్రొక్ష్యిల్ విలువ | 15 గరిష్ఠం |
తేమశాతం | 0.5% గరిష్ఠం |
- ఐయోడిన్‌విలువ:ప్రయోగశాలలో 100 గ్రాముల నూనెచే గ్రహింపబడు ఐయొడిన్ గ్రాముల సంఖ్య. ప్రయోగ సమయంలో ఫ్యాటిఆసిడుల ద్విబంధమున్న కార్బనులతో ఐయోడిను సంయోగంచెంది, ద్విబంధాలను తొలగించును. ఐయోడిమ్ విలువ అసంతృప్త ఫ్యాటిఆసిడ్‌లు ఏమేరకు నూనెలో వున్నది తెలుపును.
- సపొనిఫికెసను విలువ: ఒక గ్రాము నూనెలోని ఫ్యాటి ఆసిడులను సబ్బుగా (saponification) మార్చుటకు కావలసిన పోటాషియంహైదృఆక్సైడ్, మి.గ్రాంలలో.
- అన్‌సపొనిఫియబుల్ మేటరు: పోటాషియం హైడ్రాక్సైడుతో సపొనిఫికెసను చెందని నూనెలో వుండు పదార్థంలు. ఇవి అలిపాటిక్ ఆల్కహల్‌లు, స్టెరొలులు, హైడ్రొకార్బనులు, రంగునిచ్చు పదార్థాలు (pigments), రెసినులు.
నూనె ఉపయోగాలు
[మార్చు]- బయోడిసెల్ ఉత్పత్తిలో ఉపయోగించెదరు.[6]
- కొవ్వొత్తులతయారి పరిశ్రమలలో, సబ్బులతయారి పరిశ్రమలో[7]
- లుబ్రికెంట్ల తయారిలో
- అల్కైడ్‍ల (Alkyds) తయారి పరిశ్రమలలో
ఇవికూడా చూడండి
[మార్చు]- ఆముదము
- ఆముదము నూనె
- నూనె
- నూనె గింజలు
- చెట్లనుండి వచ్చే నూనెగింజలు
- సంతృప్త కొవ్వు ఆమ్లం
- అసంతృప్త కొవ్వు ఆమ్లం
- జుట్టు పెరుగుదలకు ఆముదం నూనె ఎలా ఉపయోగించాలి[permanent dead link]
మూలాలు
[మార్చు]- ↑ http://www.jatrophabiodiesel.org/aboutJatrophaPlant.php Archived 2013-11-12 at the Wayback Machine.
- ↑ http://www.flowersofindia.net/catalog/slides/Physic%20Nut.html
- ↑ SEAHandBook-2009,By The Solvent Extractors' Association of India
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-24. Retrieved 2013-10-28.
- ↑ 5.0 5.1 http://www.ijabpt.com/pdf/60018-Rakesh[permanent dead link][1].pdf
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-08-26. Retrieved 2013-10-28.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-10-06. Retrieved 2013-10-28.