అడవి ఆముదము చెట్టు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అడవి ఆముదము చెట్టు
Jatropha curcas1 henning.jpg
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): యుడికాట్స్
(unranked): రోసిడ్స్
క్రమం: Malpighiales
కుటుంబం: యుఫోర్బియేసి[1]
జాతి: జట్రోఫా
ప్రజాతి: J. curcas
ద్వినామీకరణం
Jatropha curcas
L.[2]

అడవి ఆముదమును కొండ ఆముదము, నేపాళము అని కూడా అంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం Jatropha curcas. ఇది Euphorbiaceae కుటుంబానికి చెందిన చిన్న చెట్టు.

Common name: Physic Nut, Jatropha, Barbados nut

విష ప్రభావంను కలిగిన అడవి ఆముదము చెట్టు సంవత్సరాల తరబడి జీవిస్తుంది. ఈ చెట్టు సుమారు 5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.

తినడానికి పనికిరాని ఈ అడవి ఆముదము చెట్లను తోటలలో మరియు పొలాలలో జంతువుల నుంచి రక్షణ కొరకు కంచెగా పెంచుతారు.

లేత ఆకుపచ్చ రంగులో ఉండే వీటి ఆకులు 8 నుంచి 15 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఈ చెట్టు ఆకు కాడ వద్ద హృదయాకృతిలో ఉండి 3 గదులుగా హస్తాకారంలో ముందుకు పొడుచుకొని వచ్చి ఉంటుంది.

ఈ చెట్టు యొక్క పుష్పగుచ్ఛములు ప్రత్యేకంగా గుబురుగా ఆకుపచ్చ పసుపు కలసిన రంగులో ఉంటాయి.


వైద్యం[మార్చు]

అడవి ఆముదము చెట్టు ఆకులను గింజలు మరియు నూనెను పలు రోగాల నివారణ కొరకు (పుండ్లు, గాయాలు, చర్మ వ్యాధులు) ధన్వంతరి వైద్యంలో ఉపయోగిస్తారు.

నూనె[మార్చు]


Jatropha curcas seeds

గ్యాలరీ[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Nahar, K. and Ozores-Hampton, M. (2011). Jatropha: An Alternative Substitute to Fossil Fuel.(IFAS Publication Number HS1193). Gainesville: University of Florida, Institute of Food and Agricultural Sciences. Retrieved (12-17-2011).
  2. "Jatropha curcas L.". Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2008-08-29. Retrieved 2010-10-14. 

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]