పసుపు కొమ్ము నూనె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పసుపు
Curcuma longa - Köhler–s Medizinal-Pflanzen-199.jpg
కురుకుమ లోంగా
Scientific classification
Kingdom:
Division:
Class:
Subclass:
Order:
Family:
Genus:
కురుకుమ
Species:
C. longa
Binomial name
కురుకుమ లోంగా

'పసుపు కొమ్ము నూనే లేదా పసుపు నూనె ఒక ఆవశ్యక నూనె.పసుపు కొమ్ము నూనె ఒక సుగంధ తైలం.పసుపు నూనె ఓషధీ గుణాలు కల్గివున్నది.పసుపును అనాదిగా భారతదేశంలో వంటల్లో, దేశీయ వైద్యంలో, ఆయుర్వేద వైద్యంలో వాడుతున్నారు. పసుపును భారతీయులు శుభప్రదంగా భావిస్తారు.గడపలకు పసుపు పూస్తారు. వ్రతాల్లో, పూజల్లో మొదట గణపతిని పసుపుతో చేసి పూజను ప్రారంభిస్తారు.ముత్తైదువులకు, స్త్రీలకు పాదాలకు పసుపును నోముల సమ్యంలో.శుభకార్యాలలో పూస్తారు.పూజల్లో పసుపు, కుంకుమ వాడటం పరిపాటి.పసుపును ఆహారంలో, జౌళీ మిల్లులల్లో,, ఓషధ మందుల తయారీలో ఉపయోగిస్తారు.పసుపు రంగునిచ్చు పదార్థం.ఇంతటి విశిష్టత వున్న పసుపు కొమ్ముల నుండి తీసిన నూనె కూడా విశిష్టమైనదే, యాంటి భయాటిక్, యాంటి బాక్టిరియా గుణాలు పసుపు నూనెలో ఉన్నాయి.

పసుపు మొక్క[మార్చు]

పసుపు మొక్క జింజీబేరెసియా కుటుంబానికి చెందిన మొక్క. పసుపు కొమ్ము అనేది నిజానికి భూమిలో అడ్డంగా లావుగా పెరిగే వేరు.ఇలా అడ్డంగా పెరిగే వేరును ఆంగ్లంలో రైజోమ్ అంటారు.పసుపును ఆంగ్లంలో టర్మెరిక్ అంటారు.పసుపు వృక్షశాస్త్ర పేరు కుర్కుమా లొంగా (Curcuma longa [Linn]).పసుపు మొక్క చూచుతకు అల్లం మొక్కవలె వుండును, ఆకులు పచ్చగా పొడవుగా వుండును.[1]

పసుపు క్యాన్సరు నిరోధక గుణాలు మెండుగా కల్గి ఉంది.పసుపులో వున్న రసాయనాల్లో 20 వరకు యాంటి బైయోటిక్,14 క్యాన్సరు నిరోధక,12 కంతుల నివారణ,12 కండరాల నొప్పులనివారణ గుణాలు కల్గి ఉన్నాయి.పసుపు లా పసుపు కొమ్ము నూనె కూడా యాంటీ అలర్జీకి గుణాలు, సూక్ష్మ క్రీముల/బాక్టీరియా నిరోధక, యాంటీ మైక్రో బియాల్ గుణాలు, శిలీంధ్రనాశక (యాంటి ఫంగల్), పరాన్న జీవుల నాశక గుణం, యాంటి వైరల్, యాంటి వార్మ్ (anti-worm) గుణాలు కల్గి ఉంది.[2]

నూనె సంగ్రహణ పద్ధతులు[మార్చు]

నీటి ఆవిరి స్వేదన క్రియ /స్టీము డిస్టీలేసను పద్ధతి ద్వారా సంగ్రహించిన దిగుబడి 0.46%, రంగు పదార్థం 0.16% దిగుబడి వచ్చును.ఆర్గానిక్ సాల్వెంట్ లను ఉపయోగించి40 °C వద్ద 6 గంటలు నూనె సంగ్రహణ చేసిన దిగుబడి 5.49 wt % వరకు వచ్చింది. ( (Foust, A. S.; Wenzel, L. A.; Clump, C. W.; Maus, L.; Andersen, L. B. Princípios das Operações Unitárias; Editora Guanabara Dois S.A.:  Rio de Janeiro, Brazil, 1982) ) [1].ఆకులనుండి కూడా నూనెను సంగ్రహిస్తారు.

నూనె[మార్చు]

నూనె భౌతిక గుణాలు[మార్చు]

వరుస సంఖ్య భౌతిక గుణం విలువల మితి
1 రంగు పాలిపోయిన లేదా అరేంజి పసుపు రంగులో వుండును.
2 వాసన పసుపు కొమ్ము వాసన
3 విశిష్ట గురుత్వం,25 °C 0.900- 0.940
4 వక్రీభవన సూచిక20°C 1.480 -1.510
5 దృశ్యభ్రమణం -22 నుండి+30o
6 భార లోహాలు 5 ppmకన్న తక్కువ

నూనెలోని రసాయన పదార్థాలు[మార్చు]

కుర్కుమిన్

పసుపు ఆకులు, పూలు,, రైజోమ్/వేరుల నూనెను స్టిము డిస్తిలేసను, సాల్వెంట్ సంగ్రహణ పద్ధతుల్లో సంగ్రహించి, ప్రయోగశాలలో గ్యాస్ క్రోమోటోగ్రఫీ ద్వారా విశ్లేషించి చూడగా పూలనుండి సంగ్రహించిన నూనెలో p-సైమేన్-8-ఒల్ రసాయనం 26.0%, ఆకుల నూనెలో ఆల్ఫా–పెల్లాండ్రేన్ 32.6%, వేర్ల నుండి తీసిన నూనెలో ఆర్-టర్మేరోన్ 31.0 నుండి 46.8% వరకు వున్నట్లు గుర్తించారు.[3] పసుపు నూనె ప్రధానంగా కర్కమిన్, జింజీబెరిన్, కీటోన్, పెల్లాండ్రన్, లిమోనెన్, ఆరోమాటిక్ టర్మేరోన్, ఆల్ఫా టర్మేరోన్, బీటా టర్మేరోన్, 1,8-సినేఓల్ లను కల్గి ఉంది.[4] పసుపు కొమ్ము లేదా వేరులో 0.36%, ఆకుల్లో 0.56% వరకు నూనె ఉంది. పసుపు కొమ్ము నూనెలో దాదాపు 95.2% వరకు 73 రకాల రసాయన పదార్థాలను గుర్తించారు.వాటిలో ప్రధానమైన ఆరోమాటిక్ టర్మెరోన్ 31.7%, ఆల్ఫా టర్మెరోన్ 12.9%.బీటా టర్మెరోన్ 12.0%, (Z) బీటా ఓసీమేన్ 5.5%వుండగా ఆకుల నుండి తీసిన నూనెలో 75 రకాల రసాయనాలు 77.5% వుండగా అందులో ప్రధానమైనవి ఆల్ఫా పిల్లాన్డ్రెన్ 9.1%, టెర్పినోలెన్ 8.8%,1.8-సినోల్ 7.3%, ఆన్డెకోనెల్ 7.1$, p-సైమేనేన్ 5.5% వుండగా మిగిలినవి తక్కువ శాతంలో ఉన్నాయి.[5]

నూనె సంగ్రహణ సమాన్ని బట్టి నూనెలోనిని రసయనాల్లో 10 ప్రధానమైన రసాయనాల పరిమాణాన్ని దిగువ పట్టికలో ఇవ్వడమైనది.

వరుస సంఖ్య రసాయన పదార్థం శాతం సంగ్రహణ సమయం
నిమిషాలు
1 ఆల్ఫా –పిల్లాన్డ్రేన్ 6.50 12.34
2 కారియోపైల్లెన్ 1.32 21.8
3 ట్రాన్స్ –ఫర్నెసేన్ 0.54 21.98
4 కుర్కుమిన్ 10.49 22.70
5 బీటా –సీసబోలేన్ 3.12 23.14
6 బీటా-సిస్క్వి పిల్లాన్డ్రెన్ 9.62 23.49
7 సీస్-బీటా బిసబోలెన్ 1.11 23.56
8 బీటా- బిసబోలెన్ 2.59 24.68
9 ఆరోమాటిక్ టెర్మేరోన్ 62.88 26.11
10 y-కుర్కుమిన్ 1.83 26.47

నూనె ఉపయోగాలు[మార్చు]

  • పసుపు లా పసుపు కొమ్ము నూనె కూడా యాంటీ అలర్జీకి గుణాలు, సూక్ష్మ క్రీముల/బాక్టీరియా నిరోధక, యాంటీ మైక్రో బియాల్ గుణాలు, శిలీంధ్రనాశక (యాంటి ఫంగల్), పరాన్న జీవుల నాశక గుణం, యాంటి వైరల్, యాంటి వార్మ్ (anti-worm) గుణాలు కల్గి ఉంది.[2]
  • 2013 లో జపాన్ లోని క్యోటో యూనివర్సిటీ వారి ఫుడ్ సైన్స్ అండ్ బైయో టెక్నోలోజీ, గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చరులో జరిపిన అధ్యాయనంలో నూనెలో ప్రధానంగా వున్న ఆరోమాటిక్ టర్మెరోన్, పసుపులోని కురుకుమిన్ రసాయనాలు రెండు జంతువుల్లోని కొలోన్ క్యాన్సరును నివారించినట్లు తెలిసింది.[2]
  • నాడీ వ్యవస్థకు సంబంధించిన జబ్బులను నివారించును.

నూనెలోని సెస్క్యూటెర్పినోయిడ్లు (ఆరోమాటిక్ టర్మేరోన్, ఆల్ఫా, బీటా టర్మేరోన్,, ఆల్ఫా అట్లాంటోన్) లు కండరాల నియంత్రణ గుణం కల్గి వున్నందున మూర్ఛ నివారణకు పనిచేయును.[2]

  • కీళ్ళ వాత సంబంధ నొప్పులను నివారించుటలో సమర్ధవంతంగా పనిచేయును.కాలేయం వ్యవస్థ పనితీరును మెరుగు పరచును.

బయటి లింకుల వీడియోలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]