రూటేసి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రూటేసి
Skimmia reevesiana2.jpg
Skimmia japonica
Scientific classification
Kingdom
Division
Class
Order
Family
రూటేసి

Juss., 1789
Type genus
రూటా
ప్రజాతి

About 160, totaling over 1600 species.

రూటేసి (Rutaceae) కుటుంబంలో సుమారు 150 ప్రజాతులు, 1300 జాతులు ఉన్నాయి. ఈ మొక్కలు ఎక్కువగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో పెరుగుతాయి.

కుటుంబ లక్షణాలు[మార్చు]

 • మొక్కలు, పొదలు లేదా వృక్షాలు.
 • సంయుక్త పత్రాలు, పుచ్ఛరహితము, గ్రంథి భరితము.
 • ద్విలింగ పుష్పాలు, అండకోశాధస్థితము, సౌష్టవయుతము, పంచభాగయుతము, సంపూర్ణము.
 • అండాశయము క్రింద వర్తులాకార చక్రము ఉంటుంది.
 • రక్షక, ఆకర్షణ పత్రాలు 4 లేదా 5
 • కేసరాలు 8-10, లేదా అనేకము, ఆబ్డిప్లోస్టెమోనస్.
 • ఫలదళాలు 2, సంయుక్తము, ఊర్థ్వ అండాశయము.
 • స్తంభ అండాన్యాసము.
 • ఫలము మృదుఫలము, హెస్పరిడియం లేదా గుళిక.

ఆర్ధిక ప్రాముఖ్యత[మార్చు]

 • సిట్రస్ జాతులైన నిమ్మ, బత్తాయి, నారింజ మొక్కలనుండి తినదగిన పండ్లు లభిస్తాయి.
 • వెలగ పండ్లలోని గుజ్జును తింటారు. ఇది అజీర్తిని హరిస్తుంది.
 • కరివేపాకు పత్రాలను వంటలలో సువాసన కొరకు ఉపయోగిస్తారు.
 • మారేడు పండు గుజ్జు అజీర్తిని హరిస్తుంది.
 • సదాపాకు మందులో ఉపయోగిస్తారు.
 • మాదీఫలం పండ్లరసం అజీర్తిని హరిస్తుంది.
 • క్లోరెక్సైలాన్ స్విటేనియా (Chloroxylon swietenia) నుండి సాటిన్ ఉడ్ (Satin wood) లభిస్తుంది. దీనిని ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తారు.
 • కొన్ని మొక్కలను తోటలలో పెంచుతారు.

ముఖ్యమైన మొక్కలు[మార్చు]

రకరకాల నిమ్మ జాతి పండ్లు.

మూలాలు[మార్చు]

 • బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.
"https://te.wikipedia.org/w/index.php?title=రూటేసి&oldid=2005379" నుండి వెలికితీశారు