వెలగ
స్వరూపం
| వెలగ | |
|---|---|
| Scientific classification | |
| Kingdom: | |
| Division: | |
| Class: | |
| Order: | |
| Family: | |
| Genus: | లిమోనియా |
| Species: | లి. ఎలిఫెంటమ్
|
| Binomial name | |
| లిమోనియా ఎలిఫెంటమ్ | |
వెలగ (ఆంగ్లం Wood apple) రూటేసి కుంటుంబానికి చెందిన పండ్ల వృక్షము. వెలగ ను శాస్త్రీయంగా 'ఫెరోనియా లిమోనియా' అనిగాని, లేదా 'లిమోనియా ఎలిఫెంటమ్' అనిగాని అంటారు. ఇది దాదాపు అన్నినేలలో పెరుగుతుంది.
లక్షణాలు
[మార్చు]- ముళ్ళతో మధ్యరకంగా పెరిగే వృక్షం.
- రెక్కలుగల పత్రవృంతం, పత్రవిన్యాసాక్షం, దీర్ఘవృత్తాకార పత్రకాలతో విషమపిచ్ఛక సంయుక్త పత్రాలు.
- గ్రీవాలలోను, అగ్రాలలోను ఏర్పడిన సామాన్య అనిశ్చిత విన్యాసంలో అమరి ఉన్న లేత పసుపురంగు పుష్పాలు.
- గుండ్రంగా ఉన్న మృదు ఫలం.
ఉపయోగాలు
[మార్చు]- వెలగ పండు గుజ్జును తింటారు. దీని నుండి జామ్, పచ్చళ్ళు, రసాలు, జెల్లీలు తయారుచేస్తారు. ఇది మంచి అజీర్ణకారి. పెంకు గట్టిగా గిన్నెలాగా ఉపయోగపడుతుంది.
- వెలగ ఆకులు, పుష్పాలు కడుపు నొప్పిని తగ్గిస్తాయి.
- చెట్టు కాండం కలప గా ఉపయోగపడుతుంది.
వికీమీడియా కామన్స్‌లో Limonia acidissimaకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.