సిట్రస్
సిట్రస్ | |
---|---|
Mandarin Orange (Citrus reticulata cultivar) | |
Scientific classification | |
Kingdom: | Plantae
|
Division: | |
Class: | |
Subclass: | |
Order: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Genus: | సిట్రస్ |
జాతులు and hybrids | |
Important species: Important hybrids: | |
Synonyms | |
Eremocitrus |
సిట్రస్ (లాటిన్ Citrus) పుష్పించే మొక్కలలో రూటేసి కుటుంబంలోని ప్రజాతి. సిట్రస్ రెటిక్యులాటాను మాండరిన్ ఆరెంజ్ అంటారు. ఇది ఆగ్నేయాసియాకు చెందినది. ఇది 15-25 పొడవు వరకు పెరుగుతుంది. సిట్రస్ (మాండరిన్ నారింజ) 2000 సంవత్సర పూర్వమే సాగులో ఉంది. ఆకులు (1 1/2 ”పొడవు వరకు), పువ్వులు వసంత ఋతువులో వస్తాయి . ఈ పండ్లు క్రిస్మస్ సెలవుదినాలలో ఎక్కవగా జనాదరణ ఉన్నందున కొన్నిసార్లు దీనిని " క్రిస్మస్ నారింజ" అని అంటారు [1]
చరిత్ర
[మార్చు]సిట్రస్ పువ్వులు ఏప్రిల్, మే నెల మధ్యలో కాస్తాయి, నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు పండ్లు వస్తాయి. పండు లేత పసుపు, నారింజ, ఎరుపు, రంగులో ఉంటాయి . పండ్లు కొన్ని తియ్యగా చేదుగా, పులుపుగాగా వస్తాయి . ఒక పండుకు సుమారు విత్తనాలు 10-15 వరకు వస్తాయి. ఈ పండ్లను అస్సాంలో కోమ్లా తెంగా, కమలా-తెంగా, సుమ్తియా-తెంగా, హమ్థియా-తెంగా, బెంగాలీ భాషలో కమల,ఇంగ్లీష్ లో ఆరెంజ్,లూస్ -స్కిన్డ్ ఆరెంజ్, మాండరిన్ ఆరెంజ్, హిందీలో సంత్ర,కన్నడలో కుడగోరేంజ్, తమిళంలో వాలాజ కమరా, తెలుగులో కమలా పండు అని అంటారు. భారతదేశం లో: అస్సాం, గుజరాత్, మేఘాలయ, మహారాష్ట్ర ( పశ్చిమ కనుమలు ప్రాంతాలలో ) వస్తాయి [2] ఇతర దేశాలలో ఈ పండ్లు జపాన్, దక్షిణ చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో సాగు చేస్తారు . అమెరికా దేశంలో సిట్రస్ (మాండరిన్ నారింజ) ను వాణిజ్య సాగుగా అలబామా, ఫ్లోరిడా,మిసిసిపీ, టెక్సాస్, జార్జియా,కాలిఫోర్నియా రాష్టములలో వేస్తారు.[3]
ఉపయోగములు
[మార్చు]సిట్రస్ పండ్లలలో పోషక, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, ఆమ్లాలు ఉన్నాయి. వీటి పండ్లు, ఆకులు సౌందర్య సాధనాలలో యాంటీ ఆక్సిడెంట్లు, కెమికల్ ఎక్స్‌ఫోలియెంట్ల,, రక్తస్రావ నివారిణి, అజీర్తి, గ్యాస్ట్రో పేగుల కఫంతో వున్నా దగ్గు, చికిత్సలో ఉపయోగిస్తారు [4]
మూలాలు
[మార్చు]- ↑ "Citrus reticulata 'Clementine' - Plant Finder". www.missouribotanicalgarden.org. Retrieved 2020-10-13.
- ↑ "Citrus reticulata Blanco". India Biodiversity Portal. Retrieved 2020-10-13.
- ↑ "Mandarin Orange". www.hort.purdue.edu. Retrieved 2020-10-13.
- ↑ "medicinal herbs: MANDARIN - Citrus reticulata". www.naturalmedicinalherbs.net. Retrieved 2020-10-13.