రూటా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రూటా
Fringed Rue
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
రూటా

రూటా (లాటిన్ Ruta) పుష్పించే మొక్కలలో రూటేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. ఈ మొక్క 80 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతుంది . . ఆకులు అనేక విభాగాలుగా విభజించబడ్డాయి. ఆకులు చూర్ణం చేసినప్పుడు అసహ్యకరమైన వాసన కలిగి ఉంటాయి. పువ్వులో లేనప్పుడు, ఈ కలప నీలం,బూడిద రంగులో ఉంటుంది. ఈ మొక్కను హిందీ లో పిస్మరం, కన్నడ, హవునంజినా గిడా, హవునంజూ , మలయాళం లో అరుత, నాగటాలి, మరాఠీ లో సతపా, సంస్కృత లో గుచాపాత్ర, గుండ్రా, తిలనాకా, తమిళం లో అరువాడ, అరువుడము తెలుగు లో అరుడ, అరుడు, సదాపా అని అంటారు [2]

చరిత్ర[మార్చు]

పురాతన కాలంలో, ర్యూ ఒక ముఖ్యమైన వైద్య మూలిక. బైబిల్లో గ్రీకు పేరు “పెగనాన్” గా పేర్కొనబడినది . ర్యూ అనేది రోమన్‌లకు ఒక సాధారణ వంట మొక్కలను మసాలా పేస్ట్‌ గా ఉపయోగిస్తారు. పూర్వ కాలం లో కాథలిక్ చర్చ్ లలో మొక్క కొమ్మలను పవిత్ర నీటిలో ముంచి, దానిని పారిష్వాసుల తలలపై ఒక ఆశీర్వాదంగా చిలకరించడం , అందుకే ఈ మొక్కకు "దయ వున్నా మూలికా " అంటారు. ఇథియోపియాలో ఇది వంట మూలికగా,కాఫీ కి అదనంగా ఉపయోగించబడుతుంది [3] ఇది మధ్యధరా ప్రాంతం , కానరీ ద్వీపాలకు చెందినది, రాతి ప్రదేశాలు, దట్టాలు, సున్నపురాయిపై లలో కనబడుతుంది . దీని చెక్కతో చేదు, వికారమైన రుచిని కలిగి ఉంటుంది . పువ్వులు జూన్ నుండి సెప్టెంబర్ వరకు వస్తాయి .

ఉపయోగములు[మార్చు]

ఆయర్వేద వైద్యం లో మూలిక లతో దగ్గుకు, అపానవాయువుకు, పెద్దప్రేగు వంటి వ్యాధులలో కషాయాల గా వాడతారు .ఆకుల నుంచి వచ్చే రసములతో సయాటికా నొప్పి,తలనొప్పి , ఛాతీకి పూయడం గా వాడతారు. ఇది కంటి సమస్యలు, చర్మ సంబంధిత , రుమాటిజం, వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు పక్షవాతం, శరీర నరముల బలహీనతకు , కీళ్ల నొప్పులకు చికిత్స కోసం దీనిని తేనెతో ఉపయోగిస్తారు. హోమియోపతి వైద్యం లో రూటా ప్రధానంగా మొక్క నుండి తయారైన మందులను తయారీ చేస్తారు . హోమియోపతి మందులువ్యాధి యొక్క లక్షణాలను ఉత్పత్తి చేసే ఉత్పత్తులతో చికిత్స చేయడం ద్వారా ఒక వ్యాధిని నయం చేయవచ్చు. ఇది హోమియోపతి విధానములో ఉన్న లక్షణము హోమియోపతి వైద్యంలో, రుటాను ప్రథమ చికిత్స నివారణగా ఉపయోగిస్తారు. ఇది బెణుకులు, కీళ్ళ చుట్టూ ఎముకపై పడిన కణజాలాలకు గాయాలు, సయాటికా చికిత్సకు ఉపయోగిస్తారు. రూటా తరచుగా చేతులు, మణికట్టు, కాళ్ళు,కాళ్ళలో నొప్పి దృడత్వం కోసం వాడతారు [4]

జాతులు[మార్చు]

రూటా ప్రజాతిలో సుమారు 8-40 జాతులు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. Takhtajan, Armen (2009). Flowering Plants (2 ed.). Springer. p. 375. ISBN 9781402096082.
  2. "Ruta chalepensis - Fringed Rue". www.flowersofindia.net. Retrieved 2020-10-08.
  3. Long, Jim. "Rue: The Forgotten Herb - Plant Profiles - Heirloom Gardener". Mother Earth Gardener (in ఇంగ్లీష్). Retrieved 2020-10-08.
  4. "Ruta | Encyclopedia.com". www.encyclopedia.com. Retrieved 2020-10-28.
"https://te.wikipedia.org/w/index.php?title=రూటా&oldid=3848397" నుండి వెలికితీశారు