పామే
Appearance
(పామ్ నుండి దారిమార్పు చెందింది)
పామే | |
---|---|
కొబ్బరి చెట్టు | |
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | పామే Schultz-Schultzenstein
|
ప్రజాతి | |
చాలా ఉన్నాయి. |
పామే కుటుంబం ఏకదళబీజాలకు చెందినది. వర్గీకరణ శాస్త్రవేత్త లిన్నేయస్ వీనిని "వృక్షసామ్రాజ్యపు రాకుమారులు" (Princes of Plant Kingdom) అని వర్ణించారు.
కుటుంబ లక్షణాలు
[మార్చు]- శాఖారహిత వృక్షాలు, పామ్ ఆకృతి.
- విసనకర్ర వంటి లేదా ఈకల వంటి పత్రాలు.
- స్పాడిక్స్ పుష్ప విన్యాసము.
- ఏకలింగ పుష్పాలు, ఏకలింగాశ్రయి లేదా ద్విలింగాశ్రయి.
- దృఢమైన పరిపత్రము.
- కేసరాలు 3 + 3.
- త్రిఫలదళ అండకోశము, ఫలదళాలు సంయుక్తంగా గాని, విడిగా గాని ఉండవచ్చును.
- ఊర్ధ్వ అండాశయము, స్తంభ అండన్యాసము.
- మృదుఫలము లేదా టెంకె గల ఫలము.
- విత్తనం ఏకదళబీజయుతము, అంకురచ్ఛదయుతము.
- వాయు పరాగ సంపర్కము.
ఉపయోగాలు
[మార్చు]ఆహార పదార్ధాలు
[మార్చు]- పండ్లు: ఖర్జూరం, ఈత, తాటి వంటి 100 రకముల చెట్లనుండి రుచికరమైన పండ్లు లభిస్తాయి. తాటిపండ్ల రసం నుండి తాండ్ర, బెల్లం తయారుచేస్తారు.
- విత్తనాలు: కొబ్బరి కాయలు అతిపెద్ద విత్తనాలు. దీనిలోని గుజురు మంచి ఆహారం. వివిధరకాలైన వంటలలో ఉపయోగిస్తారు. వక్క విత్తనాలు తాంబూలంలో విరివిగా వాడుతారు.
- సగ్గుబియ్యం: కొన్ని రకాల చెట్టు కాండం మధ్యనున్న గుజ్జునుండి తయారుచేస్తారు.
- పానీయాలు: కొబ్బరి బొండంలోని నీరు వేసవిలో దాహం తీరుస్తాయి. ఈత, కొబ్బరి, తాటి, జీలుగ చెట్లనుండి కల్లు తీస్తారు.
- పువ్వులు: జీలుగు, వక్క చెట్ల కాబేజీలాంటి పువ్వులు కొందరు కొండజాతివారు తింటారు.
- నూనెలు: కొబ్బరి నూనె, పామాయిలు వంటలో ఉపయోగిస్తారు.
కలప
[మార్చు]- తాటి మొదలైన చెట్ల భాగాలు గట్టిగా ఉండి ఇల్లు కట్టుకోవడంలో రకరకాలుగా ఉపయోగిస్తారు. కాండం కలపలాగా దూలాలు, స్తంభాలుగా ఉపయోగపడతాయి. తాటాకులు ఇంటికప్పు క్రింద, పందిరిగా వేస్తారు.
- పేము కలపతో కుర్చీలు మొదలైన గృహోపకరణాలు తయారుచేస్తారు.
కొన్ని ప్రజాతులు
[మార్చు]- అరేకా – వక్క
- Bactris – Pupunha
- బొరాసస్ – తాటి
- కలామస్ – పేము
- కారియోటా - జీలుగ
- కోకాస్ – కొబ్బరి
- Copernicia – Carnauba wax palm
- ఇలియాస్ – ఆయిల్ పామ్
- Euterpe – Cabbage Heart palm, Açaí palm
- Jubaea – Chilean Wine palm, Coquito palm
- మెట్రోక్సైలాన్ – సగ్గుబియ్యం
- ఫీనిక్స్ – ఖర్జూరం, ఈత, చిట్టి ఈత
- ఫైటెలిఫాస్ - దంతపు తాటి
- Raphia – Raffia palm
- Roystonea – రాయల్ పామ్
- Sabal – Palmettos
- Salacca – Salak
- Trachycarpus – Windmill palm, Kumaon palm
- Washingtonia
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.