Jump to content

తమిళ వంటకాలు

వికీపీడియా నుండి
ఈ వ్యాసం భారతీయ వంటలు శీర్షికలో భాగం
తయారుచేసే పద్ధతులు, వంటసామగ్రి

వంటపాత్రలు

ప్రాంతీయ వంటలు
ఉత్తర భారతదేశం

పంజాబీమొఘలాయిరాజస్థానీ
కాశ్మీరీభోజ్‌పూరీబనారసీబిహారీ

దక్షిణ భారతదేశం

కేరళతమిళఆంధ్రతెలంగాణకర్ణాటక

తూర్పు భారతదేశం

బెంగాలీఅస్సామీఒరియా
ఈశాన్య భారత

పశ్చిమ భారతదేశం

గోవాగుజరాతీమరాఠీ
మాల్వానీపార్శీ

ఇతరత్రా

విదేశీచారిత్రకజైన (సాత్విక)
ఆంగ్లో-ఇండియన్చెట్టినాడుఫాస్టుఫుడ్

Ingredients and types of food

ముఖ్యమైన వంటకాలుతీపి పదార్ధాలు
పానీయాలుఅల్పాహారాలుమసాలాలు
Condiments

See also:

Indian chefs
Cookbook: Cuisine of India

మార్చు

తమిళులు సాధారణంగా ఉప్పుడు బియ్యము అన్నం తింటారు. పచ్చి బియ్యం అన్నము తినటానికి ఎక్కువగా వెనకాడుతుంటారు పచ్చిబియ్యము అన్నము అరగదని వారికి కొంచము సందేహము. వారు ఎక్కువగా ఇడ్లీ లను ఉదయపు ఉఆహారంగా తీసుకుంటారు. దానికి వారు సాంబారు, టెంకాయచెట్నీ, ఇడ్లీపొడి మొదలైన వాటితో తీసుకుంటారు. తరువాత ఆదే పిండితో దోశలు చేస్తారు. వారు ఆపిండిని ఉప్పుడు బియ్యము, మినపప్పు నాన పెట్టి రుబ్బిన పిండిని సగము రోజు పులవబెట్టి తయారు చేస్తారు. వారి బోజనములో సాంబారు, రసము, ఒకటో రెండో తాలింపులు తప్పని సరి. కాల్చిన అప్పడము కూడా చేర్చుకుంటారు. మజ్జిగ అన్నంలో ఎక్కువగా వాడరు జలుబు చేస్తుందని వారి సందేహము. మజ్జిగలో తిరగమాత వేసి అల్లము, కొత్తమల్లి, ఉప్పు చేర్చి అప్పుడప్పుడు భోజనములో (సాపాటు) తీసుకుంటారు. మజ్జిగపులుసు (మోర్ కుళంబు), మన పప్పు కూరకు దగ్గరగా ఉండే కూట్టు, కారకుళంబు బోజంతో తీసుకునే ఇతర కూరలు. సాధారణంగా తమిళుల వంటకాలలో కారము, ఉప్పు, పులుపు ఆంధ్రులతో పోల్చినపుడు తక్కువగా ఉంటుంది. వీరు నూనె తక్కువగా వినియోగిస్తుంటారు. వేగింపులు, నూనెలో దేవిన (ఫ్రై) కూరలు అరుదుగా చేస్తారు. వీరు భోజనము అరటి ఆకులలో తినడాంలో ఆసక్తి కనబరుస్తారు. విందు భోజనంలో తలవాళై అనబడే లేత అరటిఆకుల చివరి భాగాలను మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తారు. విందులలో ఉదయపు ఊపాహారములో వెణ్పొంగల్ (పప్పొంగలి) మెదువడ (మత్తగా రుబ్బిన పిండితో చేసిన మనప వడ) చెట్నీ, సాంబార్ లేక కుళంబు (పులుసు) తప్పనిసరి. భోజనము సాంబారు తోనే ఆరంభిస్తారు.

ఉపాహారాలు

[మార్చు]
  1. ఇడ్లీ దీనికి కావలసిన ఆధరువు (సైడ్ డిష్) సాంబార్, చెట్నీ, తువైయల్ (పచ్చడి) వడకరి మొదలైనవి
  2. దోశ దీనికి కావలసిన ఆధరువు (సైడ్ డిష్) సాంబార్, చెట్నీ, తువైయల్ (పచ్చడి) వడకరి మొదలైనవి.
  3. ఇడియాప్పము దీనికి కావలసిన ఆధరువు కుర్మా.
  4. అరిసిశేవై టెంకాయ పాలు చక్కెర, తాలింపు వేసి నిమ్మకాయ రసము చేర్చి నది.
  5. పుట్టు దీనికి కావలసిన ఆధరువు (సైడ్ డిష్) తీపి, కారము.
  6. కుళాయ్ పుట్టు తీపి.
  7. అడై దీనికి కావలసిన ఆధరువు (సైడ్ డిష్)
  8. కొళికట్టై
  9. వెణ్ పొంగల్ దీనికి కావలసిన ఆధరువు (సైడ్ డిష్ ) కుళంబు (పులుసు), టెంకాయచెట్నీ.
  10. ఆపము దీనికి కావలసిన ఆధరువు (సైడ్ డిష్) కుర్మా, వడకరి.
  11. ఉప్మా దీనికి కావలసిన ఆధరువు (సైడ్ డిష్) తువైయల్ (పచ్చడి)
  12. పూరి కిళంగ్ (ఉర్లగడ్డ కూర)
  13. ఉప్పుండలు కారతూళ్ (కారప్పిడి)
  14. సొజ్జి చెట్నీ
  15. ఊతప్పము దీనికి కావలసిన ఆధరువు (సైడ్ డిష్ ) సాంబార్, చెట్నీ, తువైయల్ (పచ్చడి)
  16. మసాల్ దోశ దీనికి కావలసిన ఆధరువు (సైడ్ డిష్ ) సాంబార్, చెట్నీ, తువైయల్ (పచ్చడి)
  17. కుళిపణియారమ్
  18. త్వలకొడా (తపేళచెక్కలు)

పిల్లలకు పెద్దలకు క్యారేజ్ ఆహారాలు

[మార్చు]
  1. పుళియోదరై పులిహోర
  2. తక్కాళిసాదము
  3. మిళగుసాదము
  4. కరివేప్పిలైసాదము
  5. సీరకసాదము
  6. పుదీనాసాదము
  7. కొత్తమల్లిసాదము
  8. టెంకాయసాదము
  9. తైర్ సాదము
  10. సాంబార్ సాదము
  11. రస సాదము
  12. ఎళుమిచ్చైసాదము
  13. మాంగాసాదము
  14. ఎళ్ళుసాదము

తాలింపు కూరలు(పొరియల్)

[మార్చు]
మామిడికాయ పప్పు కూర
అప్పడము

తమిళులు అన్ని రకాల కూరగాయలతో ఎక్కువగా కుబ్బరి తురుము కోచము పచ్చి మిరప కాయను చేర్చి తాలింపు కూరలు చేస్తారు. వీటికి నాన పెట్టిన పెసరపప్పు, పచ్చి బీన్స్, పచ్చి బఠానీలు, నానబెట్టిన చనగలు మొదలైనవి కలిపి చేస్తుంటారు. తాలింపు కూరలను, కూట్టు, అప్పడము, వడాము, వడయాలను, తువైయల్ మొదలైన సాంబారు, రసము, కుళంబు అన్నంలో నంజుకుని తింటారు. మునగాకు, అవిశాకు, ముల్లంగి, పొన్నగంటి, కామంచి ఆకులతోను తాలింపు కూరలను చేస్తారు. వల్లారై, బచ్చలి, చుక్క, పుదీనా, కొత్తమల్లి మొదలైన ఆకు కూరలతో తువైయల్ (పచ్చడి) చేస్తారు. అరటి దూటతో కూట్టు (పప్పుకూర), అరటి పువ్వుతో పొరియల్ (తాలింపు) వడలు వీరి ప్రత్యేకత.

కుళంబులు(పులుసు)

[మార్చు]

సాంబారు కాక మిగిలిన వాటిని పప్పు చేర్చకుండా అదే సమయంలో బెల్లము, చక్కెర మొదలైన తీపిని చేర్చకుండా చేస్తుంటారు.

  1. మోర్ కుళంబు
  2. వత్త కుళంబు
  3. కత్తిరికాయ కారకుళంబు
  4. మురుంగైక్కాయ్
  5. చేప్పం కిళంగ్ కారకుళంబు

వరువల్

[మార్చు]
  1. కరుణై కిళంగ్ వరువల్
  2. కొత్తవరై వరువల్
  3. పాగర్ క్కాయ్ వరువల్
  4. వాళక్కాయ్ వరువల్

తైర్ పచ్చడి

[మార్చు]

అను వైన పచ్చి కూరలను పెరుగుతో కలిపి ఉత్తర భారతీయుల రైతాలాంటి పెరుగు పచ్చడిని చేస్తూ ఉంటారు.

ఊరుగా(ఊరకాయ)

[మార్చు]
  1. ఎలుమచ్చై ఊరుగా
  2. మంగా ఊరుగా

ఫలహారాలు

[మార్చు]
  1. మసాల్ వడై
  2. ఉళుదు వడై
  3. బోండా
  4. బజ్జీ
  5. మెదువడై
  6. తైర్ వడై
  7. పకోడ
  8. పాయసము
  9. హల్వా
  10. కేసరి

నొరుక్కుతీని(చిరుతిండి)

[మార్చు]
  1. మురుకు-
  2. సీడై-
  3. తట్టవడై-
  4. వాం పొడి
  5. బూంది
  6. జాంగ్రి
  7. గులబ్ జామ్
  8. మైసూర్ పాక్
  9. అదిరసము

తువైయల్(పచ్చడి)

[మార్చు]
  1. తేంగాయ్ తువైయల్
  2. పుదీనా తువైయల్
  3. కొత్తమల్లి తువైయల్
  4. కరుణై కిళంగ్ తువైయల్
  5. తక్కాళి తువైయల్

తూళ్(పొడులు)

[మార్చు]

తమిళులకు పొడి ఇడ్లీ దోశలకు మంచినూనెను చేర్చి తినడము అలవాటు భోజనసమయంలో వీరికి పొడి తినడము అలవాటులేదు.

  1. ఎళ్ళుతూళ్
  2. పుదీనాతూళ్
  3. కరివేప్పిలైతూళ్
  4. ఇడ్లీతూళ్
  5. కొత్తమల్లితూళ్