కాశ్మీరీ వంటకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాశ్మీరీ వంటలు ప్రాచీన సంప్రదాయ కాశ్మీర్ లోని వంటలపై ఆధారపడి ఉంది.

పాకిస్థాన్బంగ్లాదేశ్ లలోని కాశ్మీరీ ప్రాంతాల్లో కూడా ఈ కాశ్మీరీ వంటలనే తింటారు.

ప్రస్తుతం కాశ్మీరీ వంటల్లో ప్రధానమైనది గొర్రె మాంసం. మటన్ ను ఉపయోగించి వారు దాదాపు 30 రకాల వంటలు తయారు చేసుకుంటారు.

వంటలు[మార్చు]

రోగన్ జోష్

కాశ్మీరీ పండిట్ల వంటల ప్రభావం మొదట్లో కాశ్మీరీ వంటలపై ఉండేది. మిగిలిన ప్రదేశాల్లోని పండిట్లు మాంసం తినకపోయినా కాశ్మీరీ పండిట్లు గొడ్డు మాంసం తప్ప అన్ని మాంసాలు తింటారు. కాశ్మీరీ వంటల్లో గొడ్డు మాంసం ఎక్కువగా గ్రామాలకే పరిమితమైంది. నగరాల్లో దాని వాడకం తక్కువే. కొన్ని వందల సంవత్సరాల క్రితం అక్కడి రాజులు గొడ్డు మాంసాన్ని నిషేధించారు. కాశ్మీరీ పండిట్ల, కాశ్మీరీ ముస్లింల ఆహారాల్లో పెద్ద తేడా ఉండదు.[1] ముస్లింలు గొర్రె మాంసాన్ని ఎక్కువగా వాడితే, పండిట్లు గొర్రె పిల్ల మాంసాన్ని వాడతారు. అదే వారి వంటల మధ్య  ప్రధాన తేడా. నీలమత్ పురాణా అనే ఇతిహాసంలో కూడా పూర్వం నుంచే కాశ్మీరీ పండిట్లు గొర్రె, గొర్రెపిల్ల మాంసాన్ని తింటున్నారని ఉంది.[ఆధారం చూపాలి][ఆధారం చూపాలి][ఆధారం యివ్వలేదు][ఆధారం చూపాలి]

కాశ్మీర్ కు చెందిన లల్లేశ్వరి, షేక్ నూర్-ఉద్-దిన్ వాలీ అనే ఇద్దరు ఫకీర్లు మాత్రం శాకాహారులుగానే ఉన్నారు. కాశ్మీర్ లో పండగలకు కూడా మాంసాన్ని వండుతారు. ఇది కాశ్మీర్ కు ఉన్న ప్రత్యేకతల్లో ఒకటి. కొన్ని ప్రముఖ కాశ్మీరీ వంటకాలు:

 • ఖబర్గాహ్ (కాశ్మీరీ ముస్లింలు ఈ వంటను తబఖ్మాజ్ అని కూడా అంటారు.)
 • దమ్ ఒలావ్
 • గోగ్జీ రాజ్మా
 • గోషటబా
 • ల్యోదుర్ ట్షామన్
 • మట్షగంద్
 • మొదుర్ పులావ్
 • మోంజీ హాక్/గోగీ హాక్
 • ముఝ్ గాద్
 • నాదిర్ యాఖిన్
 • షాయీమ్
 • ఖెలీయా
 • రోగన్ జోష్
 • స్యున్ పులావ్ (మాంసం పులావ్)
 • ట్సర్వన్
 • ట్షోక్ వంగన్
 • యాఖ్నీ[2]

కాశ్మీరీ వంటల్లో మిఠాయిల స్థానాన్ని తేనీరు తీసుకుంటుంది అనడంలో సందేహం లేదు. రెండు రకాల టీలు ఉన్నాయి వీరికి. ఒకటి కెహ్వా. ఇది తియ్యగా ఉండే గ్రీన్ టీ. యాలకులు, బాదం పప్పులు ఉపయోగించి దీనిని తయారు చేస్తారు. రెండోది షీర్ చాయ్. దీనిని ఎక్కువగా మధ్యాహ్నాం తాగుతుంటారు వీరు. బాదంపప్పులతో కాచే చేసే ఈ టీ  గులాబీరంగులో ఉండి, ఉప్పగా ఉంటుంది. ఈ టీలను బేక్ చేసిన రొట్టెలతో కలిపి తీసుకుంటుంటారు. కుల్చా, కట్లమ్, రోఠ్, బకర్ఖనీ వంటి రొట్టెలతీ ఈ టీలు తాగడం కాశ్మీరీ పండిట్ల ఆహార అలవాట్లలో ఒకటి.

కాశ్మీరీ పండిట్ల వంటకాల్లో మిఠాయిలు చాలా తక్కువ. వారు ఎక్కువ ప్రాధాన్యం టీలకు, భోజనం, అల్పాహారాల్లోని వంటలకు ఇచ్చినంత మిఠాయిలకు ఇవ్వరు.

ఇతర వంటలు[మార్చు]

కాశ్మీర్ లోయ బేకరీ సంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది. కాశ్మీర్ లోని  దాల్ సరస్సుశ్రీనగర్ డౌన్ టౌన్ ప్రాంతంలోని వరసగా బేకరీ  దుకాణాలు కనిపిస్తాయి. ముదురు బంగారు రంగులో, నువ్వులు, గసగసాలు పైన చల్లిన బ్రెడ్లను ఎక్కువగా అమ్ముతారు ఇక్కడ. ట్సోట్, ట్సోచ్వురు అనే రెండు రకాల బ్రెడ్లు కూడా ఇక్కడ బాగా అమ్ముడు పోతాయి. అవి గుండ్రంగా చిన్నగా ఉండి, నువ్వులు, గసగసాలతో ఉంటాయి. ఈ రకం బ్రెడ్ లు కరకరలాడుతూంటాయి. షీర్మల్, బఖెర్ఖానీ, లవస్, కుల్చా రొట్టెలు కూడా ఇక్కడ బాగా ప్రసిద్ధం. గిర్దస్, లవస్ రొట్టెలను వెన్నతో కలిపి వడ్డిస్తారు.

హరిస్సా అనేది మాంసంతో చేసే వంటకం. దీనిని అల్పాహారంగా తీసుకుంటారు కాశ్మీరీలు. ఈ వంట తయారు చేయడానికి చాలా గంటలు పడతాయి. ఇందులో ఎక్కువగా మసాలాలు వేస్తారు. గరిటతో కలుపుతో ఎక్కువ సేపు చేస్తారు ఈ వంటని.[2]

వజ్వన్[మార్చు]

వజ్వన్

వజ్వన్ అనేదీ కాశ్మీరీ ముస్లింల సంప్రదాయ భోజనం. అన్ని రకాల వంటలతో ఉండే ఈ భోజనానికి వారా చాలా గౌరవం ఇస్తారు. ఈ భోజనాన్ని వండటమంటే గొప్ప కళగా భావిస్తారు. ఈ భోజనంలో అన్ని వంటలూ మాంసంతో చేసినవే. గొర్రె, కోడి, చేప మాంసాలతో చేస్తారు. కానీ గొడ్డు మాంసం మాత్రం వాడరు. విందుల్లో పప్పుధాన్యాలతో వండిన వంటలను వడ్డించడం గౌరవంగానూ, పవిత్రంగానూ భావిస్తారు. ఈ వజ్వన్ భోజనంలోకి దాదాపు 36 వంటకాలను వడ్డిస్తారు.

మూలాలు[మార్చు]

 1. Religious violence in India#Ancient India
 2. "Harissa recipe". Archived from the original on 2016-03-04. Retrieved 2016-09-13.