Coordinates: 34°07′N 74°52′E / 34.117°N 74.867°E / 34.117; 74.867

దాల్ సరస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దాల్ సరస్సు
దాల్ సరస్సు is located in Jammu and Kashmir
దాల్ సరస్సు
దాల్ సరస్సు
ప్రదేశంశ్రీనగర్, జమ్మూ కాశ్మీర్, భారతదేశం
అక్షాంశ,రేఖాంశాలు34°07′N 74°52′E / 34.117°N 74.867°E / 34.117; 74.867
పరీవాహక విస్తీర్ణం316 square kilometres (122 sq mi)
ప్రవహించే దేశాలుIndia భారతదేశం
గరిష్ట పొడవు7.44 km (4.62 mi)
గరిష్ట వెడల్పు3.5 km (2.2 mi)
ఉపరితల వైశాల్యం18–22 square kilometres (6.9–8.5 sq mi)
సరాసరి లోతు1.42 metres (4.7 ft)
గరిష్ట లోతు6 m (20 ft)
ఉపరితల ఎత్తు1,583 m (5,194 ft)
ఘనీభవనంశీతాకాలం
ప్రాంతాలుహజ్రత్బాల్, శ్రీనగర్

దాల్ సరస్సు జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ కు సమీపంలో ఉంది. ఇది జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో రెండవ అతిపెద్ద సరస్సు. దీనిని "ఫ్లవర్స్ లేక్" అనీ, "శ్రీనగర్ జ్యువెల్" అనీ అంటారు.[1] [2][3]

విస్తీర్ణం[మార్చు]

సరస్సు తీర రేఖ, దాదాపు 15.5 కిలోమీటర్లు (9.6 మైళ్ళు) ఉంటుంది. శీతాకాలంలో దీని ఉష్ణోగ్రత కొన్నిసార్లు −11 ° C (12 ° F) కి చేరుకుంటుంది ఈ సమయంలో సరస్సు గడ్డకడుతుంది. ఇది 21.1 చదరపు కిలోమీటర్లు (8.1 చదరపు మైళ్ళు) విస్తరించి ఉన్న సహజ చిత్తడినేలల్లో భాగంగా ఉండి, 18 చదరపు కిలోమీటర్ల (6.9 చదరపు మైళ్ళు) విస్తీర్ణంలో ఉంది.[4][5][6][7]

చరిత్ర[మార్చు]

ప్రాచీన సంస్కృత గ్రంథాలలో దాల్‌ సరస్సుని మహాసరిత్ (సంస్కృతం- महासरित्) గా పేర్కొన్నారు. చరిత్రకారులు దాల్‌ సరస్సుకు తూర్పున ఉన్న ఇసాబర్ అనే గ్రామాన్ని దుర్గాదేవి నివాసంగా పేర్కొన్నారు.

మొఘల్ కాలంలో, భారతదేశంలోని మొఘల్ పాలకులు ముఖ్యంగా కాశ్మీర్, శ్రీనగర్ లను తమ వేసవి విడిదిగా గుర్తించారు. వారు శ్రీనగర్‌లోని దాల్ సరస్సు ప్రాంగణాన్ని విస్తారమైన మొఘల్ తరహా తోటలు మంటపాలతో నింపి, ఆహ్లాదకరమైన చల్లని వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఆనందించే రిసార్ట్‌లుగా అభివృద్ధి చేశారు.[8]

ప్రయాణ మార్గాలు[మార్చు]

దాల్ సరస్సు శ్రీనగర్ నగరం నడిబొడ్డున ఉంది. దీనిని రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు. దీనికి 12.8 కిలోమీటర్ల (8.0 మైళ్ళు) దూరంలో బద్గామ్ విమానాశ్రయం, 18.8 కిలోమీటర్ల (11.7 మైళ్ళు) దూరంలో శ్రీనగర్ రైల్వే స్టేషన్ ఉంది. జాతీయ రహదారి NH1A కూడా ఈ సరస్సు గుండా పోతుంది.[9][5]

అభివృద్ధి[మార్చు]

ప్రస్తుతం, దాల్ సరస్సును, దాని చుట్టూ పరిసరాలను మరింతగా అభివృద్ధి పరిచేందుకుగానూ భారత ప్రభుత్వం సుమారు 11 బిలియన్ల రూపాయల భారీ పెట్టుబడులు పెట్టి పునరుద్ధరణ కార్యక్రమాలు మొదలుపెట్టింది.[5][9][10]

మూలాలు[మార్చు]

  1. World, Beautiful (2017-07-19). "Dal Lake Facts & Information - Beautiful World Travel Guide". Facts & Information - Beautiful World Travel Guide (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-05-17.
  2. "Dal Lake". National Informatics Centre. Archived from the original on 25 July 2009. Retrieved 3 April 2010. The world famous water body has been described as Lake Par-Excellence by Sir Walter Lawrence. It is the Jewel in the crown of the Kashmir and is eulogised by poets and praised abundantly by the tourists.
  3. Singh, Sarina (2005). India. Lonely Planet. p. 344. ISBN 978-1-74059-694-7. Retrieved 3 April 2010. peaceful Dal Lake is Srinagar's Jewel
  4. "DAL LAKE". Tourist Attractions in India. Archived from the original on 25 September 2013. Retrieved 3 September 2013.
  5. 5.0 5.1 5.2 Jain, Sharad K; Pushpendra K. Agarwal; Vijay P. Singh (2007). Hydrology and water resources of India. Springer. p. 978. ISBN 978-1-4020-5179-1. Retrieved 27 December 2009. {{cite book}}: |work= ignored (help)
  6. "Dal Lake". International Lake Environment Committee. Archived from the original on 16 మే 2012. Retrieved 18 డిసెంబరు 2009.
  7. Pandit pp. 66–93
  8. the Alternate Hydro Energy centre of the University of Rookee. "Conservation and Management Plan for Dal- Nigeen Lake". House Boat Owners Association. Archived from the original on 25 మార్చి 2012. Retrieved 27 డిసెంబరు 2009.
  9. 9.0 9.1 "Dal Lakes". Kashmir Tourism. Archived from the original on 9 May 2012. Retrieved 18 December 2009.
  10. Bindloss, Joe; Sarina Singh (2007). India. Lonely Planet. pp. 353–354, 360. ISBN 978-1-74104-308-2. Retrieved 29 December 2009. it is a very beautiful lake. {{cite book}}: |work= ignored (help)