అన్నము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శాకాహార సాధారణ ఇంటి భోజనము

అన్నం భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సాధారణంగా రోజూ భుజించే ఆహారము. వరి ధాన్యం నుండి వేరుచేసిన బియ్యం నీటిలో ఉడికించి అన్నాన్ని తయారుచేస్తారు. పుట్టిన పిల్లలకు మొట్టమొదటి సారిగా అన్నం తినిపించడం తెలుగు వారు అన్నప్రాసన పండుగలాగా జరుపుకుంటారు.

వండే విధానం[మార్చు]

  • సాధారణ పద్ధతి: కావలసిన బియ్యం తీసుకుని అవసరమైన దాని కంటే ఎక్కువగా నీరు పోసి పెద్దదైన గిన్నెలో ఉడికించాలి. బియ్యం ఉడికిన తరువాత, ఎక్కువైన నీటిని వంచేయాలి.
  • అత్తెసరు పద్ధతి: కావలసిన బియ్యం తీసుకుని అవి ఉడకడానికి కావలసినన్ని మాత్రమే నీరు పోసి ఉడికించాలి. నీరు వంచాల్సిన అవసరం లేదు.
  • కుక్కర్ పద్ధతి: కావలసిన బియ్యం తీసుకుని అవి ఉడకడానికి కావలసినన్ని మాత్రమే నీరు పోసి, కుక్కర్లో ఉంచి నీటి ఆవిరి మీద నిర్నీత సమయంలో వంటసేసే పద్ధతి.

నూకల అన్నం[మార్చు]

దక్షిణ భారతీయ వంటకాల్లో నూకల అన్నం అతి పురాతనమైనది. ఇది సాధారణంగా ఉదయాన్నే తినే పదార్థం. పూర్వం రోజుల్లో వ్యవసాయదారులు ఉదయాన్నే పొలాలకు వెళ్ళే ముందు నూకల అన్నం తిని బయల్దేరేవారు. ముందుగా బియ్యాన్ని నూకలుగా ఆడించి సిద్ధంగా ఉంచుకునేవారు. ఒక వంతు నూకలకు 4 వంతులు నీళ్ళు పోసి జావ లాగ ఉడకబెట్టాలి. దించి కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా వెన్న, కొద్దిగా పచ్చడి లేదా పప్పు వేసుకుని తినేవారు. ఒక్కొక్క సారి ఉడికించేటప్పుడు కొద్దిగా కొబ్బరి తురుము కూడా వేసుకొనేవారు. పాశ్చాత్య నాగరికత ప్రభావం వల్ల నేడు ఈ వంటకం చేసుకోవడం దాదాపుగా అంతరించిపోయింది.

జనాహార్‌ యోజన[మార్చు]

ఢిల్లీ సర్కారు పేదలకు హల్వా, అన్నం, పూరీ, చపాతీ తదితర వంటకాలతో రూ.15కే భోజనం అందించే పథకాన్ని చేపట్టింది.

విశేషాలు[మార్చు]

అన్నం పై తెలుగు సినిమాలలో పలు పాటలు వచ్చాయి. మచ్చుకు కొన్ని

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అన్నము&oldid=3307036" నుండి వెలికితీశారు