పాలకోవా
Jump to navigation
Jump to search
పాలకోవా పాలతో చేసే స్వచ్ఛమైన మిఠాయి. ఇది మంచి రుచి కలిగిన బలవర్ధకమైన ఆహారం.
తయారీకి కావలసిన పదార్థాలు
[మార్చు]తయారుచేయు విధానం
[మార్చు]- పాలు కుంపటి మీద పెట్టి మీగడ కట్టకుండా, గరిట కింద పెట్టకుండా తిప్పుతుండాలి.
- రెండు గంటల అనంతరం పాలు ముద్దలా అవుతుంది. ఇంకా తిప్పుతూనే ఉండాలి.
- మరికొంత సేపటికి గట్టిగా ముద్దలాగ అవుతుంది.
- చక్కెర మెల్లమెల్లగా పోసి మళ్ళీ తిప్పుతుండాలి. పల్చని పాకం తయారవుతుంది.
- మరికొంత సేపటికి పంచదార పాకం అయి పల్చబడిన కోవా మళ్ళీ గట్టిగా అవుతుంది.
- ఒక పళ్ళానికి నెయ్యి రాసుకొని కోవా ముద్దను పళ్ళెంలో గుమ్మరించాలి. శుభ్రంగా కడిగిన గుండ్రాయిగాని, పచ్చడిబండగాని, కంచు చెంబుగాని తీసుకొని, నెయ్యి రాసి కోవా ముద్దని కాటుక నూరినట్టు ఒక ఐదు నిమిషాలు బలంకొద్దీ నూరాలి. ఇందువల్ల కోవా ఉండలు ఉండలుగా కాక, చక్కగా మెత్తగా అవుతుంది. తదనంతరం దానిని కావలసిన అకారాల్లోకి మర్చుకొని కత్తిరించవచ్చు.
పాలకోవా బిళ్ళలు
[మార్చు]కావలసిన పదార్ధాలు
[మార్చు]- చిక్కటి గేదె పాలు - 1 లీటరు
- పంచదార - 1/4 కేజీ
తయారు విధానం
[మార్చు]రాగి తాంబాలంలో పాలు పోసి చిక్కగా కోవా అయ్యేంతవరకూ కలియబెడుతూ మరగబెట్టి స్టౌపైనుండి దింపాలి. పంచదార కలిపి మళ్ళీ స్టౌపై పెట్టి బాగా కలియబెడుతూ ఉండాలి. ఉండ పాకం అయ్యాకా స్టౌపైనుండి దింపాలి. వెచ్చగా ఉన్నప్పుడే బిళ్ళలుగా చేసుకోవాలి. ఈ పాలకోవా బిళ్ళలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి, బయట బజార్లో దొరికే వాటికంటే చాలా బాగుంటాయి.
Look up పాలకోవా in Wiktionary, the free dictionary.