గుత్తి వంకాయ కూర
అల్లం ముద్దతో చేసిన గుత్తి వంకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. తెలుగువారి వంటలలో గుత్తి వంకాయకు గోగూర పచ్చడి, ఆవకాయ లాగానే కొంత ప్రాముఖ్యత ఉంది. చాలా పాటలు, పద్యాలలో దీని ప్రస్తావన ఉంది.
గుత్తి వంకాయ కూర
[మార్చు]కావలసిన పదార్థాలు
[మార్చు]- తాజా వంకాయలు... అర కిలో
- ఆవాలు... అర టీస్పూన్
- ఉప్పు... 2 టీ స్పూన్లు
- అల్లం... 2 ముక్కలు
- నూనె... 4 టీ స్పూన్లు
- పచ్చి మిర్చి... 10
తయారీ విధానం
[మార్చు]స్టౌ మీద బాణలిని పెట్టి నూనె, ఆవాలు వేసి వేగిన తరువాత ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం మెత్తగా దంచిన మిశ్రమాన్ని, గుత్తుగా కోసిన వంకాయ ముక్కలను వేసి వేయించండి. ముక్కలు బాగా మగ్గిన తర్వాత దంచిన కారంవేసి కలియబెట్టాలి. అది బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ నీటితో కాసేపు మరిగించి దించేయండి. అల్లంతో గుత్తు వంకాయ కూర రెడీ... ఇది అన్నంలో తినడానికి చాలా రుచిగా ఉంటుంది.
నూనె వంకాయ కూర
[మార్చు]ఒక రకం గుత్తి వంకాయ కూరని రాయల సీమ లో నూనె వంకాయ అంటారు. ఇది కూడా అంతే రుచిగా ఉంటుంది. పైగా మామూలు గుత్తి వంకాయ కూర అంత కష్టం కూడా కాదు.
కావలసిన పదార్థాలు
[మార్చు]''''ఉల్లిపాయలు --- 1/2 కిలో
టమోటాలు --- 1/4 కిలో
గుత్తి వంకాయలు- 1/2 కిలో
శనగ గుండ్లు --- 1/2 కప్పు
పచ్చి పప్పు(పచ్చి శెనగ పప్పు) ---- 1/4 కప్పు
ధనియాలు ---- 1/4 కప్పు
పుట్నాల పప్పు-- 1/4 కప్పు
ఎండు మిర్చి---- 6 కాయలు
ఉప్పు ---- తగినంత
నువ్వులు ---- 1/4 కప్పు
నూనె ---- 1/4 కప్పు
పోపు గింజలు--- కసిన్ని
పసుపు ---- ఒక చెంచా
కొత్తిమీర ---- 2 చిన్న కట్టలు
తయరుచేయు విధానం
[మార్చు]ముందుగా కూరలు శుభ్రంగా కడిగి పెట్టుకొవాలి. ఉల్లిపాయలు, టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. వంకాయల్ని అడ్డంగా నిలువుగా గాట్లు పెట్టాలి(గుత్తి వంకాయల్లాగానే). ఇప్పుడు శనగ గుండ్లు, పచ్చిపప్పు, ధనియాలు, మిర్చి, నువ్వులు ఒక భాండీలో వేయించుకోవాలి. దోరగా వేగాక వాటిని మిక్సీలొ పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నే తీసుకుని పొయ్యి మీద పెట్టి నూనె పొయ్యాలి. నూనె కాగాక పోపు పెట్టి ఉల్లిపాయ, టమోటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి సన్నని సెగ మీద ఉడకనివ్వాలి. ఆ ముక్కలు బాగా పేస్టులాగా ఉడకాలి. ఇప్పుడు ఆ గిన్నెలొ ఒక లీటరు నీరు పోసి వంకాయలు, కొంచెం పసుపు, ఉప్పు వేసి, వంకాయలు ఉడికి, నీళ్ళు సగం అయ్యే దాకా ఉడికించాలి. ఇప్పుడు ఇందాక పక్కన పెట్టిన పొడిని గిన్నెలో వేసి అడుగు అంటకుండా కలియతిప్పి 2 నిముషాలు ఉంచి కొత్తిమీర చల్లి దించుకొవాలి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో కలుపుకుని మంచి నెయ్యి వేసుకుని తినవచ్చును. వంకాయ కూర యొక్క గొప్పదనాన్ని చెప్పే ఒక పద్యం: వంకాయ కూర వంటిది, పంకజముఖి సీత వంటి భార్యామణియున్, శంకరుని వంటి దైవము.... ఎవరు లేరు.