మూస చర్చ:తెలుగింటి వంట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఆకర్షణీయంగా ఈ మూసని ఎలా తీర్చిదిద్దవచ్చు?[మార్చు]

కేవీఆర్ గారు, మహిళా వికీపీడియనులను ప్రోత్సహించే నా చిన్నపాటి ప్రయత్నంగా, ఈ మూస చేశాను. వంటకాలు స్త్రీలకు వ్యసనం వంటివి కావున, ఒకవేళ వారు ఏ సెర్చ్ ఇంజన్ ద్వారానైనా తెవికీలో వంటకం గురించి చదివినపుడు క్రింద ఉన్న ఈ మూస వారిని ఇతర వ్యాసాలని చదివేలా చేసే ప్రయత్నమే నాది. వీటిలో ఎర్ర లంకెలను ఔత్సాహికులు ప్రారంభించనూ వచ్చు. అయితే ఈ మూసని మరింత ఆకర్షణీయంగా ఎలా తీర్చిదిద్దవచ్చును అని ఆలోచిస్తున్నాను. మూడింటి బొమ్మలను నేను కుడి ప్రక్కన అమర్చాను. ఒక తెలంగాణ వంటకం, ఒక ఆంధ్ర వంటకం, ఒక రాయలసీమ వంటకంతో సరిపుచ్చాను. మరిన్ని బొమ్మలు చేరిస్తే బావుంటుందా? బొమ్మలు కుడి ప్రక్కన మాత్రమే ఉండాలా? (చుట్టూతా ఉంటే ఎలా ఉంటుంది? అనే ఐడియా వచ్చింది కానీ, మరీ వెగటు పుడుతుందేమో అని కూడా అనిపించింది.) ఈ దిశగా ఆలోచించి, మీ "ఫైనల్ టచ్" లు ఈ మూసకు ఇవ్వగలరు. లేవనుకున్న వ్యాసాలను చేర్చనూ వచ్చు. మీ సమయం, వీలు చూసుకొని ప్రయత్నించగలరని నా అభ్యర్థన. - శశి (చర్చ) 14:29, 15 సెప్టెంబరు 2015 (UTC)