జీడిపప్పు మైసూరుపాక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైసూర్ పాక్

జీడిపప్పు మైసూరుపాక్ ఒక మిఠాయి.

కావలసిన పదార్ధాలు

[మార్చు]
  • నానబెట్టిన జీడిపప్పు - 1 తవుడు (సుమారు 300 గ్రాములు)
  • పంచదార - 1 కేజీ
  • నెయ్యి - 2 కప్పులు
  • ఏలకులు - తగినంత

తయారు పద్ధతి

[మార్చు]

రెండు గంటలు ముందుగా పచ్చి జీడిపప్పు నీటిలో నానబెట్టుకుని, శుభ్రం చేయ్యాలి. శుభ్రం చేసిన జీడిపప్పును మిక్సీలో వేసి గారెల పిండి వలె మొరుంగా ముద్ద చేయాలి ప్రక్కనుంచాలి. బాణీలో పంచదార పాకం పట్టాలి. తీగపాకం వచ్చిన తర్వాత జీడిపప్పు ముద్దను అందులో కలిపి, బాగా కలియబెట్టాలి. కొంచెం ఉడికించాక అందులో నెయ్యి వేసి బాగా కలుపుతూ మరింత ఉడికించాలి. నలగ్గొట్టబడిన యాలుకలు వేసి సాధారణ మైసురుపాకం వలె వచ్చాకా దించాలి. రాగి తాంబాళానికి నెయ్యి వ్రాసి ఆ పాకాన్ని అందులో పోయాలి. కొంచెం సేపు తర్వాత ముక్కలుగా కోసి డబ్బాలో వేసుకోవాలి. ఈ మైసూరు పాకం తినడానికి చాలా రుచిగా ఉండటంతో పాటూ చాలా బలాన్ని, ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.